"బుద్ధ దేవుని శ్రీమద్-భాగవతంలో కృష్ణుని అవతారంగా అంగీకరించబడ్డాడు. కాబట్టి మనం కూడా, హిందువులు, బుద్ధ దేవుని భగవంతుని అవతారంగా ఆరాధిస్తాము. ఒక గొప్ప కవి, వైష్ణవ కవి పఠించిన చాలా మంచి పద్యం ఉంది. మీరు ఆనందిస్తారు వినండి.
నిందసి యజ్ఞ-విధేర్ అహహ శృతి-జాతం
సదయ-హ్రదయ దర్శిత-పశు-ఘాతం
కేశవ ధృత-బుద్ధ-శరీర
జయ జగదీశ హరే జయ జగదీశ హరే
ఈ పద్యం యొక్క భావము ఏమనగా 'ఓ కృష్ణ భగవంతుడ, మీరు, పేద జంతువులపై కరుణతో బుద్ధ దేవుని రూపాన్ని స్వీకరించారు'.
ఎందుకంటే బుద్ధ దేవుని బోధనలు జంతు హత్యలను ఆపడమే. ‘అహింస’, అహింస. తన ప్రధాన లక్ష్యం, జంతువుల హత్యను ఆపడం."