“ఆత్మ ఇప్పుడు సూక్ష్మ శరీరం మరియు స్థూల శరీరంతో కప్పబడి ఉంది. స్థూల శరీరం పనిచేయడం ఆగిపోయినప్పుడు … ఎలాగైతే రాత్రిపూట స్థూల శరీరం విశ్రమించి వున్నను, సూక్ష్మ శరీరం (మనస్సు) పనిచేస్తోంది. కనుకనే మీరు కలలు కంటున్నారు. సూక్ష్మ శరీరం పని చేస్తోంది. కాబట్టి మీరు ఈ శరీరాన్ని త్యజించిన్నప్పుడు, మీ సూక్ష్మమైన శరీరం, మనస్సు, బుద్ధి మిమ్మల్ని సరళంగా తీసుకు పోవును. ఎలా అయితే గాలి సుగందాన్ని తీసుకు పూవునో. గాలి గులాబీ చెట్ల దెగ్గరకు వెళితే, గులాబీల పరిమళాన్ని వెదజల్లుతుంది. గులాబీ లేదు కానీ పరిమళం ఉంటుంది. అదేవిధంగా, మీ సూక్ష శరీరము, మనస్సుని బుద్ధిని తీసుకు పోవును. అదే సూక్ష్మ శరీరం. మీకు అటువంటి భావనతో కూడిన శరీరం లభించును. అందువలన కృష్ణ చైత్నన్యంలో ఎంత ప్రగతి చెందామో, మరణ సమయంలో పరీక్షించబడుతుంది."
|