“కావున భక్తియుక్త సేవ ద్వారా మన భౌతిక స్థితి అభివ్రృధ్ధి చెందునని, లేదా భౌతిక బంధాలనుండి విముక్తి లభించునని ఆశించరాదు. ఎందుకనగా అలా ఆశించడం కూడా ఒక రకముగా ఇంద్రియ తృప్తి లాంటిదే. నాకు అది (భక్తియుత సేవ) కావాలంటే ‘ఈ భౌతిక బంధమునుండి విముక్తుడను కావాలి’... ఎలా అయితే యోగులు, జ్ఞానులు భౌతిక బంధాలనుండి విముక్తి పొందాలనే కోరికతో ప్రయత్నిస్తారో. కాని భక్తియుత సేవ లో ఇటువంటి కోరిక ఉండదు. ఎందుకంటే అది శుధ్ధ ప్రేమ. 'నేను ఈ విధంగా లాభం పొందుతాను' అనే ఆశ ఉండదు. లేదు. ఇది లాభదాయకమైన వాణిజ్య వ్యాపారం కాదు, 'నేను తిరిగి ఏదో ఒకటి పొందకపోతే, ఓహ్, నేను కృష్ణ చైతన్యములో భక్తియుక్త సేవను అభ్యసించను'. (భక్తిలో) లాభాపేక్షకు తావు లేదు.”
|