"భగవద్గీత (భగవద్గీత 9.4) లో శ్రీ కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నారు, "మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తినా" నేను విశ్వం అంతటా అవ్యక్త రూపం లో వ్యాపించిఉన్నాను, "మత్ స్థాని సర్వ భూతాని న చాహం తేష్వవస్థితః "జీవులన్నీ నా యందు కలవు, కాని నేను వారి యందు లేను." "పశ్య మే యోగం ఐశ్వరమ్" (భగవద్గీత 9.5) ; ఈ విధంగా ఏకకాలంలో ఒకటి మరియు భిన్నమైన ఈ తత్వాన్ని శ్రీ చైతన్య ప్రభు అంగీకరించారు, అంతే కాక దీనిని భగవద్గీతలో కూడా అంగీకరించారు "మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనుంజయ" (భగవద్గీత 7.7). కనుక ఈ రూపము, ద్విభుజ రూపము, వేణుధారి, కృష్ణ, శ్రీ కృష్ణుని రూపమునకు మించినది లేదు. కాబట్టి ఈ స్థితికి చేరుకోవాలి."
|