"జీవాత్మ, జీవి, కృష్ణునికి శాశ్వతమైన సేవకుడు, మరియు తన యజమాని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, తద్వారా తన సేవా వైఖరి, ఆప్యాయతతో, మరింత సన్నిహితంగా ఉండవచ్చు. నేను ఒక ప్రదేశంలో సేవచేస్తున్నానని అనుకుందాం. నేను ఒక యజమానికి సేవ చేయడంలో నిమగ్నమై ఉంటాను, కానీ నా యజమాని ఎంత గొప్పవాడో నాకు తెలియదు. కానీ నా యజమాని యొక్క పలుకుబడి, ఐశ్వర్యం మరియు గొప్పతనాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు, నేను మరింత భక్తితో ఉంటాను: "ఓహ్, నా యజమాని చాలా గొప్పవాడు." కాబట్టి "దేవుడు గొప్పవాడు, నాకు దేవునితో కొంత సంబంధం ఉంది" అ ని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. ఆయన ఎంత గొప్పవాడో మీరు తెలుసుకోవాలి. వాస్తవానికి, మీరు అంచనా వేయలేరు, కానీ సాధ్యమైనంతవరకు, ఆయన ఎంత గొప్పవారో మీరు తెలుసుకోవాలి. "
|