“ఏ భూభాగము కూడా మీకు చెందినది కాదు. ప్రతీది భగవంతునికి చెందినది. “ఈశావాస్యం ఇదం సర్వం” (ఇసోపనిషద్ 1). ఆయనే యజమాని. భొక్తారం యజ్ఞ తపసాం సర్వ లోక మహేశ్వరం (భగవద్గిత 5.29). అవగాహనా రాహిత్యము … ఇది మనకే చెందినది అని అపార్థం చేసుకుంటున్నాము. అందువలన శాంతి లేదు. మనము శాంతిని వెతుకుతున్నాము. శాంతి ఎలా చేకూరుతుంది? మనకు చెందనిదాని కూడా మనదే అని అపార్థము చేసుకుంటున్నాము. అందుకే ఇక్కడ చెప్పబడినది, “సర్వైశ్వర్య-పూర్ణ”. ప్రతి అణువు ఆ దేవదేవునికి చెందినదే, కానీ ముఖ్యముగా గోలోక బృందావనం ఆయన నివాసము. మీరు కమలాకారము లాంటి ఈ చిత్రాన్ని చూశారు. అన్ని గ్రహాలూ గుండ్రంగా ఉంటాయి కానీ గోలోక బృందావనం కమలాకృతిలో ఉంటుంది. అది ఆధ్యాత్మిక జగత్తులో వుంది, గోలోక బృందావనం.”
|