“మనమంత అధిపతులము అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అందరూ ప్రయత్నిస్తున్నారు. “భోక్త” "నేను తప్పక… ". పోటీ జరుగుతోంది. మీరు వేలాది మంది కార్మికులు లేదా కార్యాలయ గుమస్తాకు అధిపతులు. మీ కార్యాలయం చాలా పెద్దది. కాబట్టి నా కార్యాలయాన్ని మీకన్నా పెద్దదిగా చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను మీ కంటే గొప్ప అధిపతిని కావాలనుకుంటున్నాను. మన ఈ పోటీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ మనలో ఎవ్వరూ వాస్తవానికి అధిపతులు కారు. మనము (ఒకరి) ఆధిపత్యంలో వున్నాము. "నేను ఎప్పటికీ అధిపతిని కాలేను" అని మనకు తెలియదు కాబట్టి, నేను భ్రమలో (మాయలో) ఉన్నాను. మన నిజమైన అధిపతి శ్రీ కృష్ణ భగవానుడు.”
|