"వందే 'హం అంటే 'నేను నా గౌరవప్రదమైన ప్రణామాలు సమర్పిస్తున్నాను'. వందే. V-a-n-d-e. వందే అంటే 'నా గౌరవప్రదమైన నమస్కారాలు'. అహం. అహం అంటే 'నేను'. వందే 'ham śrī-gurūn: అందరు గురువులు, లేదా ఆధ్యాత్మిక గురువులు. ఆధ్యాత్మిక గురువుకు నేరుగా గౌరవం ఇవ్వడం అంటే పూర్వం ఉన్న ఆచార్యులందరికీ గౌరవం ఇవ్వడం.గురున్ అంటే బహువచనం.ఆచార్యులందరూ.. వారు ఒకరికొకరు భిన్నంగా ఉండరు. వారు అసలైన ఆధ్యాత్మిక గురువు నుండి శిష్య పరంపరలో వస్తున్నందున మరియు వారికి భిన్నమైన అభిప్రాయాలు లేవు, కాబట్టి, వారు చాలా మంది ఉన్నప్పటికీ, వారు ఒక్కటే. వందే 'హం శ్రీ-గురున్ శ్రీ-యుత-పద-కమలం. శ్రీయుత అంటే 'అన్ని మహిమలతో, సర్వ సంపదలతో' అని అర్థం. పద-కమల: 'కమల పాదాలు'. ఉన్నతమైన వ్యక్తికి గౌరవం ఇవ్వడం పాదాల నుండి ప్రారంభమవుతుంది మరియు ఆశీర్వాదం శిరస్సు నుండి ప్రారంభమవుతుంది. అది వ్యవస్థ. శిష్యుడు ఆధ్యాత్మిక గురువు యొక్క పాద పద్మాలను తాకడం ద్వారా తన గౌరవాన్ని అందజేస్తాడు మరియు ఆధ్యాత్మిక గురువు శిష్యుని శిరస్సును తాకి ఆశీర్వదిస్తాడు."
|