"ఇది భగవద్గీతలో చెప్పబడింది, సర్వస్య చాహమ్ హృది సన్నివిష్టః 'నేను అందరి హృదయాలలో కూర్చున్నాను'. మత్తః స్మృతిర్ జ్ఞానమ్ అపోహన చ: (భగవద్గీత 15.15)'నేను ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఇస్తున్నాను, అలాగే ప్రతి ఒక్కరి నుండి తెలివితేటలను తీసివేస్తున్నాను'. ఈ రెట్టింపు పనిని పరమాత్మ చేస్తున్నాడు, ఒక వైపు అతను తనను తాను ఎలా గ్రహించాలో, భగవంతుడిని ఎలా గ్రహించాలో సహాయం చేస్తున్నాడు మరియు మరొక వైపు దేవుణ్ణి మరచిపోవడానికి కూడా సహాయం చేస్తున్నాడు. భగవంతుడైన కృష్ణుడు పరమాత్మగా ఈ ద్వంద్వ పని ఎలా చేస్తున్నారు? మనము దేవుణ్ణి మరచిపోవాలని కోరుకుంటే, జీవితానంతర జీవితంలో మనం దేవుణ్ణి మరచిపోయే విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ మనం దేవునితో మన సంబంధాన్ని పునఃస్థాపించాలనుకుంటే, ఆయన లోపల నుండి మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. ఈ మానవ జీవితం భగవంతుని సాక్షాత్కారానికి ఒక అవకాశం."
|