TE/710829 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లండన్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
ప్రభుపాద: కృష్ణుడిని కృత్రిమంగా చూడటానికి ప్రయత్నించవద్దు. వేర్పాటు భావనలో అభివృద్ధి చెందండి, ఆపై అది పరిపూర్ణంగా ఉంటుంది. అది చైతన్య భగవానుడి బోధ. ఎందుకంటే మన భౌతిక నేత్రాలతో మనం కృష్ణుడిని చూడలేము. అతః శ్రీ-కృష్ణ-నామాది న భవేద్ గ్రాహ్యం ఇంద్రియైః (చైతన్య చరితామృత మధ్య 17.136). మన భౌతిక ఇంద్రియాలతో మనం కృష్ణుడిని చూడలేము, కృష్ణుడి పేరు గురించి వినలేము.అయితే సేవోన్ముఖే హి జిహ్వాదౌ, భగవంతుని సేవలో నిమగ్నమైనప్పుడు... సేవ ఎక్కడ ప్రారంభమవుతుంది? జిహ్వాదౌ. సేవ నాలుక నుండి ప్రారంభమవుతుంది, కాళ్ళు, కళ్ళు లేదా చెవుల నుండి కాదు. ఇది నాలుక నుండి ప్రారంభమవుతుంది. సేవోన్ముఖే హి జిహ్వాదౌ. మీరు మీ నాలుక ద్వారా సేవను ప్రారంభిస్తే... ఎలా? హరే కృష్ణ అని జపించండి. మీ నాలుకను ఉపయోగించండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే/ హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. మరియు కృష్ణ ప్రసాదం తీసుకోండి.నాలుకకు రెండు పనులు ఉన్నాయి: ధ్వనిని వ్యక్తీకరించడం, హరే కృష్ణ, మరియు ప్రసాదం తీసుకోవడం. ఈ ప్రక్రియ ద్వారా మీరు కృష్ణుడిని తెలుసుకుంటారు.
భక్తుడు: హరిబోల్! |
710829 - ఉపన్యాసం Festival Appearance Day, Srimati Radharani, Radhastami - లండన్ |