TE/710913 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మొంబాసా

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మనం భగవంతుని చిన్న భాగమే. భగవంతుడు బంగారం ముద్ద అని అనుకుందాం, మనం కొంచెం బంగారం అని అనుకుందాం. కాబట్టి మనం చిన్న కణం అయినప్పటికీ, నాణ్యతతో మనం బంగారం. దేవుడు బంగారం; మనం బంగారం. కాబట్టి మీరు మీ స్థానాన్ని అర్థం చేసుకోగలిగితే, మీరు భగవంతుడిని కూడా అర్థం చేసుకోగలరు. బియ్యపు సంచిలోంచి కొన్ని గింజలను తీసుకుని చూస్తే, ఆ సంచిలో ఉన్న బియ్యం నాణ్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు మరియు ధరను అంచనా వేయవచ్చు. కాబట్టి మీరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీరు భగవంతుడు అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు. లేదా మరొక విధంగా: మీరు దేవుడిని అర్థం చేసుకుంటే, మీరు ప్రతిదీ అర్థం చేసుకుంటారు. ఒక మార్గం ఆరోహణ ప్రక్రియ, ఒక ప్రక్రియ అవరోహణ ప్రక్రియ."
710913 - ఉపన్యాసం BG 02.13 - మొంబాసా