TE/720118 సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు జైపూర్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఒక సాధువు కర్తవ్యం ప్రజాని, పౌరుడిని ఒక వ్యవస్థలో వారు భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా సంతోషంగా ఉండేలా రక్షించడం. ఇది సాధువు యొక్క విధిలో ఒకటి.'నన్ను హిమాలయాలకు వెళ్లి ముక్కు నొక్కుకోనివ్వండి, నేను విముక్తి పొందాను' అని కాదు. ఇది సాధువు కాదు. ఇది సాధువు కాదు. మీరు చూడండి? సాధువు అంటే వారికి ప్రజా సంక్షేమం, నిజమైన ప్రజా సంక్షేమం పట్ల ఆసక్తి ఉండాలి.మరియు ప్రజా సంక్షేమం అంటే ప్రతి పౌరుడు కృష్ణ చైతన్యంతో ఉండాలి, అప్పుడు వారు భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా సంతోషంగా ఉంటారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే మన కృష్ణ చైతన్య ఉద్యమం స్వార్థ ఉద్యమం కాదు. ఇది అత్యంత దాతృత్వ ఉద్యమం. కానీ ప్రజలు, దాతృత్వ ఉద్యమం పేరుతో, సాధారణంగా, వారు నిజానికి సాధువులు కానందున, వారు డబ్బు వసూలు చేసి జీవిస్తారు."
720118 - సంభాషణ - జైపూర్