TE/Prabhupada 0004 - అర్థరహితమైన ఏ విషయానికీ శరణాగతి పొందవద్దు



భగవద్గీత 10.2-3 పై ఉపన్యాసం - న్యూయార్క్, జనవరి 1, 1967

పద్ధతి ఏమనగా... అది కూడా భగవద్గీతలో చెప్పబడింది.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా (భగవద్గీత 4.34) మీరు ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే, మీరు ఈ సూత్రాన్ని అనుసరించాలి.

అది ఏమిటి?

తద్విద్ధి ప్రణిపాతేన (భగవద్గీత 4.34) ఆయనకు శరణాగతి పొందాలి.

అదే విషయము: నమంత ఏవ వలె. మీరు విధేయుడుగా అయితే తప్ప, మీరు శరణాగతి పొందిన ఆత్మ అవ్వలేరు.

ఎక్కడ?

ప్రణిపాత.

మీరు ఒక వ్యక్తిని ఎక్కడ కనుగొంటారు, ఆయన తనే అని? ఇక్కడే నేను విధేయుడుగా ఉండాల్సిన వ్యక్తి వున్నాడు అని?

దాని అర్థం ఏమనగా మనం ఒక చిన్న పరీక్ష చేసుకోవాలి. మనం ఎక్కడ శరణాగతి పొందిన వానిగా ఉండవలెను అని. మీకు ఆ జ్ఞానం తప్పక వుండాలి. ఏమీ అర్థంలేని వాటికి మీరు మిమ్మల్ని శరణాగతి పొందవద్దు.

మీరు... మీరు తెలివైనది లేదా అర్థంలేనిది ఎలా కనుగొంటారు?

అది కూడా శాస్త్రంలో పేర్కొనబడి వుంది. అది కఠోపనిషత్తులో పేర్కొనబడింది. తద్విద్ధి ప్రణిపాతేన పరి (భగవద్గీత 4.34) ... కఠోపనిషత్తులో ఈ విధముగా చెప్పారు "తద్ విజ్ఞానార్థం స గురుం ఏవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మ-నిష్టం" [ముండక ఉపనిషత్ 1.2.12].

శ్రోత్రీయం అర్థం ఏమనగా "ఎవరైతే శిష్యుడు, గురు శిష్య పరంపరలో వస్తున్నాడో."

అతడు గురు శిష్య పరంపరలో వస్తున్నాడని రుజువు ఏది?

బ్రహ్మ-నిష్ఠం. బ్రహ్మ- నిష్ఠం అనగా ఆయన ఉన్నత పరమ సత్యాన్ని గురించి సంపూర్ణంగా ఒప్పుకున్నాడు.

కాబట్టి మీరు అక్కడ శరణాగతి పొందాలి. ప్రణిపాత. ప్రణిపాత అనగా ప్రకృష్ట-రూపేన నిపటం, ఎటువంటి సందేశము ఉండదు.

మీరు అటువంటి వ్యక్తిని కనుగొంటే అప్పుడు ఆయనకు మీరు శరణాగతి పొందండి. ప్రణిపాత. ఆయనకు సేవ చేయడానికి ప్రయత్నించండి, ఆయనను సంతోష పెట్టడానికి ప్రయత్నించండి, ఆయనను ప్రశ్నించండి. మొత్తం విషయము అవగతము అవుతుంది. మీరు ఒక ప్రామాణిక వ్యక్తిని కనుగొనవలెను, ఆయన వద్ద మీరు విధేయుడుగా శరణాగతి పొందవలెను. ఆయన దగ్గర మీరు మిమ్మల్ని శరణాగతి పొందితే భగవంతునికి శరణాగతి పొందినారు అని అర్థం, ఎందుకంటే ఆయన భగవంతుని ప్రతినిధి.

కానీ మీ అవగాహన కోసం, ప్రశ్నలు వేయడానికి అనుమతించబడతారు సమయం వృధా చేయడానికి కాదు. దాన్ని "పరిప్రశ్న" అంటారు.

ఇది పద్ధతి.

కాబట్టి ప్రతి ఒక్కటి ఉంది. మనం కేవలం తీసుకొనవలెను. కానీ మనం పద్ధతిని తీసుకోకుండా, మత్తులో కేవలం సమయాన్ని వృధా చేస్తూ ఉంటే కల్పన మరియు అన్ని అర్థంలేని కార్యక్రమాలను చేస్తూ, అది ఇంక ఎప్పటికీ సాధ్యం కాదు. మీరు భగవంతున్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే భగవంతున్ని అర్థం చేసుకోవడం దేవతలకు గొప్ప ఋషులకు కూడా సాధ్యపడలేదు. మన మిక్కిలి చిన్న ప్రయత్నాలు ఎంత?

కాబట్టి ఇది పద్ధతి. మీరు సూత్రాలు పాటించండి మీరు, అసమ్మూఢః, అసమ్మూఢః, మీరు విధానాల్ని అనుసరిస్తే నెమ్మదిగా కానీ పరిపూర్ణంగా, అసమ్మూఢః, ఏ సందేహం లేకుండా, మీరు చేస్తే... ప్రత్యక్షావగమ ధర్మ్యం. మీరు అనుసరిస్తూ ఉంటే, మీరే అర్థం చేసుకుంటారు "అవును. నేను ఏదో పొందుతున్నాను." మీరు అంధత్వంలో వున్నారు అని కాదు, మీరు గుడ్డిగా అనుసరిస్తున్నారు. మీరు సూత్రాలను అనుసరించండి, మీకు అర్థం అవుతుంది.

ఉదాహరణకు మీరు సరైన పోషణ ఇచ్చే పోషక ఆహారాన్ని తీసుకుంటే, మీకు బలం చేకూరుతుంది మీ ఆకలి సంతృప్తి చెందుతుంది. మీరు ఎవర్నీ అడగనవసరం లేదు. మీరే అనుభూతి చెందుతారు. అదేవిధముగా, మీరు సరైన మార్గం సూత్రం అనుసరించండి మీకు అర్థం అవుతుంది "అవును, నేను పురోగతి చెందుతున్నాను అని."

ప్రత్యక్ష .... తొమ్మిదవ అధ్యాయంలో ప్రత్యక్ష ఆవగమం ధర్మ్యం సుసుఖం (భగవద్గీత 9.2) అని చెప్పారు.

అది చాలా సులభం. మీరు సంతోష మానసిక స్థితిలో చేయవచ్చు. పద్ధతి ఏమిటి? మనము హరే కృష్ణ మంత్రాన్ని జపించడం కృష్ణుని ప్రసాదం తినడం చేస్తాం. భగవద్గీత ను అధ్యయనం చేస్తాం, మంచి సంగీత ధ్వనులను వినడం చేస్తాం.

ఇది ఏమైనా చాలా కష్టమా? ఇది ఏమైనా చాలా కష్టమా?

అస్సలు కానే కాదు.

కాబట్టి ఈ పద్ధతి ద్వారా మీరు అసమ్మూఢః అవుతారు. ఎవరూ మిమ్మల్ని మోసం చేయలేరు. కానీ మీరు మోసపోవాలి అనుకుంటే చాలా మంది మోసగాళ్లు వున్నారు. కాబట్టి ఒక మోసగాడిని మోసపూరితమైన సమాజం చేయవద్దు. వేదముల సాహిత్యంలో ఇవ్వబడిన విధముగా కేవలం పరంపర పద్ధతిని యధాతథంగా అమలు పరచండి. యధాతథంగా శ్రీకృష్ణపరమాత్ముడు ఇవ్వబడిన విధముగా. ప్రామాణిక మూలం నుండి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ జీవితంలో దాన్ని అమలు పరచడానికి ప్రయత్నించండి.

అప్పుడు అసమ్మూఢః స మర్త్యేసు.

మర్త్యేసు అనగా.... మర్త్య అనగా వారు మరణించడానికి అర్హులు.

ఎవరు?

ఈ బద్ధ జీవులు. బ్రహ్మ నుంచి మొదలగు చివరన వున్న అల్పమైన చీమ వరకు, వారు అందరు మర్త్య. మర్త్య అనగా వారు మరణించే సమయం ఒకటి వుంది అని. కాబట్టి మర్త్యేసు. మరణిస్తున్న మానవుల మధ్య ఆయన చాలా తెలివైన వాడు అవుతాడు.

అసమ్మూఢః స మర్త్యేసు. ఎందుకు?

సర్వ-పాపైః ప్రముచ్యతే. ఆయన పాపముల యొక్క అన్ని రకాల ప్రతి చర్యల నుండి స్వతంత్రము పొందుతాడు.

ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో, నేను చెప్పేది ఏమనగా, మనం తెలిసి లేదా తెలియకుండా, ఎల్లప్పుడూ పాపములకు పాల్పడుతున్నాం. కాబట్టి మనము ఈ ప్రతిచర్య నుండి బయటకు రావాలి.

దాని నుంచి బయటకు రావడం ఎలా?

అది కూడా భగవద్గీతలో చెప్పబడింది. యజ్ఞార్థాత్ కర్మణోఽన్యత్ర లోకో 'యం కర్మ-బంధనః (భగవద్గీత 3.9) మీరు ఏది చేసినా కృష్ణుడు కోసమే చేస్తే.... యజ్ఞ అనగా విష్ణు లేదా కృష్ణ. మీరు కృష్ణుడు కోసమే పని చేస్తే, మీ ప్రతి యొక్క ప్రతిచర్య నుండి విముక్తి చెందుతారు.

శుభాశుభ-ఫలః. మనము పవిత్రమైన లేదా పాప కార్యం ఏదో ఒకటి చేస్తాం. కానీ ఎవరైతే కృష్ణతత్త్వంలో వుంటూ కార్యలను చేస్తారో, ఆయనకు పవిత్రమైన లేదా పాపమైన దానితో ఏమి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన చాలా శుభకరమైన కృష్ణుని సాంగత్యములో వున్నాడు. కావున, సర్వ-పాపైః ప్రముచ్యతే. ఆయన పాపముల యొక్క అన్ని ప్రతిచర్యల నుండి విముక్తి చెందుతాడు.

ఇది పద్ధతి.

మనము ఈ పద్ధతిని అమలు పరిస్తే, చివరికి మనం కృష్ణుడు సాన్నిహిత్యం పొందవచ్చు. మన జీవితం విజయవంతం అవుతుంది. పద్ధతి చాలా సులభం, మనము, ప్రతి ఒక్కరూ తీసుకొనవచ్చు. చాలా ధన్యవాదాలు.