TE/Prabhupada 0005 - 3 నిమిషాలలో ప్రభుపాదుల వారి జీవితం
(Redirected from TE/Prabhupada 0005 - 3 నిమిషాలలో ప్రభుపాదుని జీవితం)
Interview -- September 24, 1968, Seattle
ఇంటర్వ్యూయర్: మీరు మీ సొంత నేపథ్యాన్ని గురించి కొంచెం నాకు తెలియజేస్తారా? అంటే, మీరు ఎక్కడ విద్యను అభ్యసించారు, కృష్ణుడి యొక్క భక్తుడిగా ఎలా మారారు.
ప్రభుపాద: నేను కలకత్తాలో జన్మించాను మరియు చదువుకున్నాను. నా నివాసము ,వూరు కలకత్తా. నేను 1896 లో జన్మించాను, మరియు నేను మా తండ్రి గారికి అల్లారుముద్దు కొడుకుని, కావున నా విద్య కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైంది, కానీ, నేను ఎనిమిది సంవత్సరాలు ఉన్నత పాఠశాలలో, హైస్కూల్ లో చదువుకున్నాను. ప్రాథమిక పాఠశాలలో నాలుగేళ్ళు, ఉన్నత పాఠశాల, ఎనిమిది సంవత్సరాలు, కళాశాలలో నాలుగు సంవత్సరాలు. అప్పుడు నేను మహాత్మా గాంధీ యొక్క ఉద్యమం, జాతీయోద్యమంలో చేరాను. కానీ అదృష్టము వలన నేను 1922 లో నా గురు మహారాజా, నా ఆధ్యాత్మిక గురువును కలుసుకున్నాను. మరియు అప్పటి నుండి, నేను ఈ మార్గంలో ఆకర్షితుడయ్యాను, మరియు క్రమంగా నా కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టాను. నేను మూడవ సంవత్సరం విద్యార్ధిగా ఉన్నప్పుడే నాకు 1918 లో వివాహం జరిగింది. మరియు అలా నాకు సంతానం కలిగింది. నేను వ్యాపార చేస్తూ వుండే వాడిని. అప్పుడు నేను నా కుటుంబ జీవితం నుంచి 1954 లో విరామము తీసుకున్నాను. నేను ఏ కుటుంబం లేకుండా నాలుగు సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాను. తరువాత నేను 1959 లో సన్యాసి జీవితాన్ని తీసుకున్నాను. అప్పుడు నేను పుస్తకాలు వ్రాయడంలో నేను పూర్తిగా నిమగ్నమయినాను. నా మొదటి ప్రచురణ 1962 లో వచ్చింది, మరియు మూడు పుస్తకాలు ఉన్నప్పుడు, నేను 1965 లో మీ దేశానికి వచ్చాను. మరియు నేను సెప్టెంబర్ 1965 లో ఇక్కడ చేరుకున్నాను. అప్పటి నుండి, నేను యూరోపియన్ దేశాలలో, అమెరికా, కెనడా దేశాలలో కృష్ణ చైతన్యాన్ని బోధించడానికి ప్రయత్నిస్తున్నాను. మరియు క్రమంగా కేంద్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. శిష్యులు కూడా పెరుగుతున్నారు. చూద్దాం, ఏమి జరుగుబోతుందో.
ఇంటర్వ్యూయర్: మీరు శిష్యుడిగా ఎలా అయ్యారు? మీరు శిష్యుడిగా మారడానికి ముందు, మీరు ఏంటి? మీరు ఏమి అనుసరించే వారు?
ప్రభుపాద: నేను ముందు చెప్పిన సూత్రమే, విశ్వాసము. నా స్నేహితుడు ఒకడు, అతను నన్ను నా ఆధ్యాత్మిక గురువు దగ్గరికి బలవంతంగా తీసుకు వెళ్ళాడు మరియు నేను నా ఆధ్యాత్మిక గురువుతో మాట్లాడినప్పుడు, నేను ప్రేరపించబడ్డాను. మరియు అప్పటి నుండి, ఈ విత్తనం ప్రారంభమైంది.