TE/Prabhupada 0021 - ఈ దేశంలో ఎందుకు ఎక్కువ విడాకులు తీసుకుంటున్నారు?



Lecture on SB 6.1.26 -- Honolulu, May 26, 1976

కాబట్టి ఇది సాధారణమైన జీవన విధానము ప్రతి ఒక్కరు భౌతిక కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు, మరియు భౌతిక కార్యాలలో ప్రాథమిక సూత్రం గృహస్థ, కుటుంబ జీవితం. కుటుంబ జీవితం, వైదిక వ్యవస్థ ప్రకారం, లేదా ఎక్కడైనా. భార్యాపిల్లలను భాద్యతగా చూసుకోవాల్సిన జీవితం. ప్రతి ఒక్కరు నిమగ్నమయ్యారు. వారు ఇదే భాద్యతగా భావిస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం, అదే నా భాద్యత. వీలైనంత సౌకర్యంగా. అదే నా విధి. " ఈ విధమైన విధులని జంతువులు కూడా నిర్వహిస్తాయి అని ఆలోచించడం లేదు. వారికి పిల్లలు ఉన్నారు, వారు ఆహరం ఇస్తారు. తేడా ఏంటి? అందువలన ఇక్కడ మూఢ అనే పదం ఉపయోగించబడింది. మూఢ అంటే గాడిద అని అర్థం. ఎవరైతే అటువంటి కార్యకలాపాలలో నిమగ్నమవుతారో, భుంజనః ప్రపిబాన్ ఖదన్. ప్రపిబాన్. ప్రపిబాన్ అనగా తాగడం, మరియు భుంజనః అనగా తినడం. తినే సమయంలో, తాగే సమయంలో, ఖదన్, నములుతున్న సమయంలో, కార్వా కాస్య రాజ ప్రియ (?). నాలుగు రకములైన తిను బండారాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం నములుతాం, కొన్నిసార్లు మనం నాకుతాం, (సంస్కృత) కొన్నిసార్లు మనం మింగుతాం మరియు కొన్నిసార్లు మనం తాగుతాం. కాబట్టి నాలుగు రకాల ఆహారాలు ఉన్నాయి. కావున మనం గానం చేస్తాం చతుర్విధ శ్రీ-భగవత్-ప్రసాదాత్. చతుర్విధ అనగా నాలుగు రకాలు. కావున మేము ఆర్చాముర్తులకు ఈ నాలుగు రకాలలో చాలా ఆహార ఉత్పత్తులు అందిస్తాం. కొన్ని నములుతాం, కొన్ని నాకుతాం, కొన్ని మింగుతాం. ఆ విధంగా.

కావున భుంజనః ప్రపిబాన్ ఖదన్ బలకమ్ స్నేహ-యంత్రితః. తల్లి మరియు తండ్రి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారు, వారికి ఆహారాన్ని ఎలా ఇవ్వాలి. మేము తల్లి యశోద కృష్ణునికి తినిపించడం చూస్తున్నాం. ఇదే. ఇదే తేడా. మనము సాధారణ పిల్లలకు తిండి పెడుతున్నాం, అదే పిల్లులు మరియు కుక్కలు కూడా చేస్తాయి. కానీ తల్లి యశోద కృష్ణుడికి ఆహారం పెడుతోంది. అదే ప్రక్రియ. ప్రక్రియలో తేడా లేదు, కానీ ఒకటి కృష్ణ కేంద్రీకరమైనది మరియొకటి విచిత్రమైనది. అది తేడా. అది కృష్ణుడు కేంద్రీకరమైతే, అప్పుడు అది ఆధ్యాత్మికం, అది చపలచిత్తమైనది అయితే, అప్పుడు అది భౌతికం. భౌతికమైన తేడా ఏమి లేదు అనుకుంటున్నారు...ఇది తేడా. తేడా ఉంది...కామ కోరికలు మరియు ప్రేమ, స్వచ్చమైన ప్రేమ వలె. కామ కోరికలు స్వచ్చమైన ప్రేమ మధ్య తేడా ఏంటి? ఇక్కడ మనం పురుషులను మరియు స్త్రీలను కలుస్తున్నాం, కామ కోరికలతో కలుస్తున్నాం, మరియు కృష్ణుడు కూడా గోపికలతో కలుస్తున్నాడు. పై పై చూడడానికి అవి ఒకేలా ఉంటాయి. కానీ తేడా ఏమిటి? కావున ఈ తేడా చైతన్య-చరితామృత రచయత చే వివరింపబడింది, కామ కోరికలు మరియు ప్రేమ మధ్య తేడా ఏమిటి అని ? అది వివరించబడింది. ఆయన చెప్పాడు, ఆత్మేంద్రియ-ప్రీతి-ఇచ్చా-తారే బలి కామ ( CC Adi 4.165) నేను ఎప్పుడైతే నా భావాలను సంతృప్తి పరచాలి అనుకుంటే, అది కామం. కానీ కృష్ణేన్ద్రియ-ప్రీతి-ఇచ్చ దారే ప్రేమ నమ, మరియు మనము కృష్ణ భావాలను సంతృప్తి పరచాలి అనుకుంటే, అది ప్రేమ, ప్రేమ అది తేడా. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ప్రేమ లేదు. ఎందుకంటే పురుషులు మరియు స్త్రీలు, వారికి ఎటువంటి ఆలోచన లేదు "నేను పురుషుడితో కలుస్తాను, నన్ను సంతృప్తి పరిచే అతన్ని నేను కోరుకుంటున్నాను." కాదు. "నేను నా కోరికలు సంతృప్తి చేసుకుంటాను." ఇది ప్రాథమిక సూత్రం. పురుషుడు అనుకుంటున్నాడు "స్త్రీ తో కలవడం వలన, నేను నా ఇంద్రియాలను సంతృప్తి చేసుకుంటాను," మరియు స్త్రీ అనుకుంటుంది "ఈ పురుషుడితో కలవడం ద్వారా నేను నా కోరికలను సంతృప్తి చేసుకుంటాను." అందువలన ఇది పాశ్చాత్య దేశాలలో చాలా ప్రముఖంగా ఉంది, వెంటనే ఎప్పుడైతే వ్యక్తిగత ఇంద్రియ తృప్తి కష్టమవుతుందో, వెంటనే విడాకులు. ఇది మానసికమైనది, అందుకే ఇన్ని విడాకులు ఈ దేశం లో. మూల కారణం ఏంటంటే " ఎప్పుడైతే నాకు సంతృప్తి కలగదో, అప్పుడు నాకు వద్దు." ఇది శ్రీమద్-భాగవతం లో తెలియచేసారు: దాంపత్యం రతిం ఏవ హై. ఈ కాలం లో, భార్యాభర్తలు అంటే మైథున సంతృప్తి అని అర్థం. వ్యక్తిగతముగా మనము కలిసి బ్రతుకుదాం అన్న ప్రశ్నే లేదు; మనము కృష్ణుని ఎలా సంతృప్తి పరిచాలో శిక్షణ తీసుకుని ఆయనను సంతృప్తి పెడదాము. అది కృష్ణ చైతన్య ఉద్యమం.