TE/Prabhupada 0040 - ఇక్కడ ఒక్క పరమ పురుషుడు ఉండెను



Lecture on BG 16.8 -- Tokyo, January 28, 1975

కొన్ని మిలియన్ల మరియు మిలియన్ల మరియు ట్రిలియన్ల జీవిస్తున్న ప్రాణులు ఉన్నాయి, మరియు ప్రతి ఒక్కరి మనస్సులో, ఆయన కూర్చుని ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిస్టో మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ ( BG 15.15) ఆయన ఆ విధముగా నిర్వహిస్తున్నాడు. మనము అతను మన వంటి నియంత్రికుడు అనుకుంటే, అది మన పొరపాటు. అతను నియంత్రికుడు. అక్కడ నియంత్రికుడు ఉన్నాడు అపరిమితమైన జ్ఞానముతో మరియు అసంఖ్యాకమైన సహాయకులతో , అపరిమితమైన శక్తులు కలిగి ఉన్నాడు. ఆయన నిర్వహణ చేస్తున్నాడు. ఈ మాయవాదులు, వారు అపరిమితమైన శక్తి గల ఒక వ్యక్తి ని ఊహించుకోలేరు. అందువలన వారు మాయవాదులుగా మారారు. వారు ఆలోచించలేరు. మాయవాదులు, వారు ఊహించలేరు.. వారు ఊహిస్తారు," ఒకరు వ్యక్తి అయితే, అతను నావంటి వ్యక్తి అని. నేను ఇది చెయ్యలేను. కావున అతను కూడా చెయ్యలేడు." అందువలన వారు మూఢా :. అవజానన్తి మాం మూఢా ( BG 9.11) వారు వాళ్ళని కృష్ణుడి తో పోల్చుకుంటున్నారు. తాను వ్యక్తి అయినందున, అదే విధముగా కృష్ణుడు కూడా ఒక వ్యక్తి అని వారికి తెలియదు. వేదములు ఈ విధముగా తెలియచేస్తాయి "ఆయన వ్యక్తి అయినప్పటికీ, ఆయన అసంఖ్యాకమైన వ్యక్తుల నిర్వహణ చేస్తున్నాడు. అది వారికి తెలియదు. ఏకో యో బహునాం విదధాతి కామాన్. ఆ ఒకే ఒక్క వ్యక్తి, అతను కొన్ని మిల్లియన్ల, ట్రిలియన్ల మనుషులను పోషిస్తున్నాడు అని. మనము ప్రతి ఒక్కరు, అందరమూ మనుషులము. నేను మనిషిని. నువ్వు మనిషివి. చీమ ఒక ప్రాణి. పిల్లి ఒక ప్రాణి. కుక్క ఒక ప్రాణి, మరియు కీటకము ఒక ప్రాణి. చెట్లు ఒక ప్రాణి. ప్రతి ఒక్కటి ప్రాణి. ప్రతి ఒక్కటి ప్రాణి. మరియు వేరొక వ్యక్తి ఉన్నాడు. అతను భగవంతుడు, కృష్ణుడు. ఆ ఒక్క మనిషి ఈ మిలియన్ల, ట్రిలియన్ల ప్రాణులను పోషిస్తున్నాడు. ఇది వేదముల సూచన.. ఎకో యో బహునాం విదధాతి కామాన్, నిత్యో నిత్యానాం చేతనా చేతనానాం (కఠోపనిషద్ 2.2.13) ఇది సమాచారము.

కావున కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తాడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వ భజన్తే మాం ( BG 10.8)

అందువలన ఒక భక్తుడు, "ఇతను ఒక మహోన్నతమైన మనిషి అని సంపూర్ణముగా అర్థము చేసుకుంటే నాయకుడో, నియంత్రికుడో, అందరిని పోషించేవాడో అని అర్థం చేసుకుంటే, అప్పుడు అతను ఆయనకు శరణాగతి పొంది ఆయన భక్తుడు అవుతాడు.