TE/Prabhupada 0043 - శ్రీకృష్ణుని ప్రాథమిక సూత్రం - ప్రభుపాద
Lecture on BG 7.1 -- Sydney, February 16, 1973
ప్రభుపాద :
- (మయ్యాసక్త మనః పార్థ)
- యోగం యుంజన్మదాశ్రయః
- అశంశయం సమగ్రమ్ మాం
- యథా జ్ఞాస్యసి త్యచ్ఛృుణు
- ( BG 7.1)
భగవద్గీతలో ఒక శ్లోకము ఉంది కృష్ణ చైతన్యమును లేదా భగవంతుని చైతన్యమును ఎలా పెంపొందించుకోవాలి భగవద్గీత అనే పుస్తకము పేరు మీలో చాలా మంది వినే వుంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా విస్తృతంగా చదివే జ్ఞానం యొక్క పుస్తకం ఆచరణాత్మకంగా ప్రతి దేశంలో భగవద్గీత యొక్క అనేక సంచికలు ఉన్నాయి. కాబట్టి ఈ భగవద్గీత మా కృష్ణ చైతన్యము యొక్క ప్రాథమిక సూత్రం మనం ప్రచారము చేస్తున్న కృష్ణ చైత్యనము, అది మాత్రమే భగవద్గీత. అది మేము ఏదీ తయారు చేసినది కాదు. కృష్ణ చైతన్య సృష్టి మొదటి నుండి ఉంది కానీ గత ఐదు వేల సంవత్సరాలుగా కనీసం కృష్ణుడు ఈ గ్రహం మీద ఉన్నప్పటి నుండి అతను స్వయముగా కృష్ణ చైతన్యమును భోదించారు ఆయన ఉపదేశము ఉంది, ఇది భగవద్గీత దురదృష్టవశాత్తు, ఈ భగవద్గీత పండితులు మరియు స్వాములు అని పిలవబడే వారి ద్వారా పలు విధాలుగా దుర్వినియోగం చేయబడినది. నిరాకార వాదులు మరియు నాస్తికులచే వారు వారి సొంత విధానములో భగవద్గీత మీద వ్యాఖ్యానించారు. నేను 1966 లో అమెరికా లో ఉన్నప్పుడు, ఒక అమెరికన్ మహిళ నన్ను అడిగినారు ఆమె చదవడానికి భగవద్గీత యొక్క ఆంగ్ల సంచికను సిఫార్సు చేయమని కోరినారు. కానీ నిజానికి నేను వాటిలో ఒక్క దానిని కూడా సిఫార్సు చేయలేదు వారి కల్పనలతో కూడిన వివరణల వలన ఇది నాకు భగవద్గీత యధాతథం రాయడానికి నాకు ప్రేరణను ఇచ్చింది. మరియు ఈ ప్రస్తుత సంచికలో భగవద్గీత యధాతధములో , ఇప్పుడు మాక్ మిల్లన్ కంపెనీ ద్వారా, ప్రపంచంలో అతిపెద్ద ప్రచురణకర్త ద్వారా ప్రచురించబడుతుంది. మరియు మేము చాలా చక్కగా చేస్తున్నాము. ఒక 1968 లో భగవద్ గీత యధాతథమును మేము ప్రచురించాము, చిన్న ఎడిషన్ లో ఇది చాలా చక్కగా విక్రయించ బడుతుంది మాక్మిలన్ సంస్థ లావాదేవీలను మేనేజర్ నివేదించారు మా పుస్తకాలు మరింత విక్రయించ బడుతున్నాయి అని ; వేరే వాటి అమ్మకాలు తగ్గుతున్నాయి తరువాత ఇటీవల, ఈ 1972 లో, మేము భగవద్గీత యొక్క, పూర్తి ఎడిషన్ను ప్రచురించాము. మరియు మాక్ మిల్లన్ కంపెనీ యాభై వేల కాపీలను ముందుగానే ప్రచురించినది కానీ అవి మూడు నెలల్లో విక్రయించ బడినవి మరియు వారు రెండవ ఎడిషన్ కోసం ఏర్పాటు చేశారు