TE/Prabhupada 0049 - మనము ప్రకృతి నియమములచే బంధింపబడి వున్నాము



Arrival Talk -- Aligarh, October 9, 1976


కనుక ఈ సంకీర్తనం సర్వ జనీతమైనది ఇది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదాలు. పరమ విజయతే శ్రీ కృష్ణ సంకీర్తనం ఇది అతని ఆశీర్వాదం: కేవలం ఈ యుగములో హరి కీర్తన ద్వారా వైదిక సాహిత్యంలో ఇది ధృవీకరించబడింది., వేదాంత-సూత్రంలో శబ్ధాద్ అనావిృత్థి అనావిృత్థి- విముక్తి. మన ప్రస్తుత స్థానం(పరిస్థితి) బానిసత్వం మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము మనం మూర్ఖముగా స్వేచ్ఛను ప్రకటించాము – ఇది మన వెర్రితనం కానీ వాస్తవానికి మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము.

prakṛteḥ kriyamāṇāni
guṇaiḥ karmāṇi sarvaśaḥ
ahaṅkāra vimūdhātmā
kartāham...
(BG 3.27)


కానీ మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము. కానీ మూర్ఖులు, విమూఢాత్మలు, తప్పుడు గౌరవంతో లేదా అహంకారము వలన, అలాంటి వ్యక్తి అతను స్వతంత్రుడు అని అనుకుంటాడు. లేదు అలా కాదు కాబట్టి ఇది అపార్థము. కనుక ఈ అపార్థమును నిర్మూలనం చేయాలి. అది జీవితం యొక్క లక్ష్యం అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించారు ఒకవేళ మీరు కనుక హారే కృష్ణ మహా మంత్రాన్ని జపించినట్లయితే, అప్పుడు మొదటి విడత యొక్క ప్రయోజనం ఏమిటంటే ‘చేతోదర్పణ మార్జనం(CC Antya 20.12) ఎందుకంటే అపార్థము గుండెలో(హృదయములో) ఉంటుంది. హృదయం స్వఛ్ఛముగా ఉంటే, చైతన్యము స్వఛ్ఛముగా అవుతుంది, అప్పుడు ఎటువంటి అపార్థము ఉండదు. కాబట్టి ఈ చైతన్యం శుద్ధి చేయబడాలి. ఇక అది హరే కృష్ణ జపించడం వలన కలిగే మొదటి విడత ఫలితము కిర్తనాద్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ (SB 12.3.51) కేవలం కృష్ణనామము జపించడం ద్వారా .’కృష్ణస్య’ కృష్ణుడి పవిత్ర నామము ద్వారా ..’హరే కృష్ణ’ హరే కృష్ణ, హరే రామా, అదే విషయం. రాముడు మరియు కృష్ణుడుకు తేడా లేదు. రామాది ముర్తీషు కలానియమేన తిష్ఠాన్ (బ్రహ్మ సంహిత 5.39). కాబట్టి మీకు అవసరం. ప్రస్తుత స్థానం లేదా స్థితి అపోహతో కూడినది, "నేను ఈ భౌతిక పదార్థపు యొక్క ఉత్పత్తి," "నేను ఈ శరీరంని." "నేను భారతీయుడను", "నేను అమెరికన్ని," "నేను బ్రాహ్మణుడిని," "నేను క్షత్రియుడిని," మొదలైనవి ... చాలా హోదాలు ఉన్నాయి. కాని మనము వాటిలో ఏదీ కాదు. ఇది శుద్దికరణ.....చేతో-దర్పణ "నేను భారతీయుడిని కాదు, నేను ఒక అమెరికన్ని కాదు, అని మీకు స్పష్టముగా అర్థమైతే “ నేను బ్రాహ్మణ్ని కాదు, నేను క్షత్రియుడిని కాదు"- అంటే నేను ఈ శరీరాన్ని కాదు అన్నమాట" అప్పుడు చేతనా ‘అహం: బ్రహ్మాస్మి ‘ అవుతుంది. బ్రహ్మ భూతాః ప్రసన్నాత్మా నా శోచతి నా కాంక్షతి (BG 18.54) . ఇది కావలెను. ఇది ఈ జీవితం యొక్క విజయం