TE/Prabhupada 0052 - భక్తుడుకి ఆభక్తునికి కల తేడా
Lecture on SB 1.2.9-10 -- Delhi, November 14, 1973
భక్తి మరియు కర్మల మధ్య వ్యత్యాసం ఇది. కర్మ అనేది ఇంద్రియ తృప్తి మరియు భక్తి అనేది భగవంతుని సంతృప్తి పరిచేది. రెండు ఒకేరకముగా ఉంటాయి కాబట్టి భక్తుడు మరియు కర్మీల మధ్య వ్యత్యాసం జనాలకు అర్థం కాదు కర్మి తన స్వంత ఇంద్రియాలను సంతృప్తిపరచు కొనే వాడు మరియు భక్తడు కృష్ణుని సంతృప్తి పరచువాడు కొంత ఇంద్రియ తృప్తి ఉంటుంది కానీ మీరు కృష్ణుడిని సంతృప్తి పెట్టినప్పుడు దానిని భక్తి అని అంటారు. Hṛṣīkeṇa hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate (CC Madhya 19.170). హృషీక అంటే ఇంద్రియలు శుద్ధమైన ఇంద్రియలు ఆ రోజు నేను వివరించాను
- sarvopādhi-vinirmuktaṁ
- tat-paratvena nirmalam
- hṛṣīkeṇa hṛṣīkeśa-
- sevanaṁ bhaktir ucyate
- (CC Madhya 19.170)
భక్తి అంటే మీ పని ఆపడము కాదు. భక్తి భావగర్భితమైన మూఢత్వం కాదు. ఇది భక్తి కాదు. భక్తి అనేది మీ ఇంద్రియాలన్నింటిని వాటి యజమాని యొక్క సంతృప్తి కోసం ఉపయోగించటం దీనిని భక్తి అని పిలుస్తారు అందువల్ల కృష్ణుని పేరు హృషీకేశ. హృషీక అంటే ఇంద్రియాలు అని అర్థం. మరియు హృషీకేశ , అతను ఇంద్రియాలను నియంత్రిoచేవాడు వాస్తవమునకు, మన ఇంద్రియాలు స్వతంత్రంగా పనిచేయవు మనము దానిని అర్థం చేసుకోగలం. కృష్ణుడు వాటిని నియంత్రిస్తున్నాడు Sarvasya cāhaṁ hṛdi sanniviṣṭo mattaḥ smṛtir jñānam apohanaṁ ca (BG 15.15). Mattaḥ smṛtir jñānam apohanaṁ ca. ఒక శాస్త్రవేత్త కృషి చేస్తున్నాడు ఎందుకంటే కృష్ణుడు తనకు సహాయం చేస్తున్నాడు. అతను స్వతంత్రంగా పని చేస్తున్నాడని కాదు. అది సాధ్యం కాదు. కానీ అతను ఆ విధంగా కోరుకున్నాడు అందువలన కృష్ణుడు అతనికి సౌకర్యాలను ఇస్తాడు. నిజానికి, కృష్ణుడు పని చేస్తున్నాడు. ఉపనిషత్తులలో ఇవి వివరించబడ్డాయి. కృష్ణుడి పని చేయకుండా, చూడకుండా, కృష్ణుడు చూడకుండా, మీరు చూడలేరు. ఎలాగైతే సూర్యరశ్మిని బ్రహ్మ-సంహితలో వివరించారో yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ సూర్యుడు కృష్ణుని కళ్ళలో ఒకటి
- yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ
- rājā samasta-sura-mūrtir aśeṣa-tejāḥ
- yasyājñayā bhramati sambhṛta-kāla-cakro
- govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
- (Bs 5.52)
అందువలన, సూర్యుడు కృష్ణుడి కళ్ళలో ఒకటి సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక , సూర్యుడు చూస్తున్నాడు కనుక నీవు చూస్తున్నావు మీరు స్వతంత్రంగా చూడలేరు. మీరు మీ కళ్ళకు చాలా గర్వంగా ఉన్నారు. ఏ సూర్యకాంతి లేనట్లయితే మీ కళ్ళ విలువ ఏమిటి? మీరు చూడలేరు. ఈ విద్యుత్తు కూడా సూర్యుడి నుండి తీసుకోబడింది. కాబట్టి కృష్ణుడు చూసినపుడు, మీరు చూడగలరు. ఇది యదార్థము . కాబట్టి మన ఇంద్రియాలు ... భగవద్గీతలో చెప్పబడింది, .. sarvataḥ pāṇi-pādaṁ tat. Sarvataḥ pāṇi-pāda... అన్నిచోట్లా కృష్ణుడు తన చేతులు మరియు కాళ్ళు కలిగి ఉన్నారు అది ఏమిటి? నా చేతులు, మీ చేతులు, మీ కాలు - ఇవి కృష్ణునివి ఎవరైనా చెప్పినట్లతే నాకు ప్రపంచవ్యాప్తంగా శాఖలు వున్నాయి అని కాబట్టి ఆ శాఖలు దేవాదిదేవుని అధీనములో పనిచేస్తున్నాయి అదేవిధంగా, కృష్ణుడు కూడా. అందువల్ల కృష్ణుడు హృషీకేశ హృషీకేశ అని పిలువబడ్డాడు. కాబట్టి మన పని యేమిటీ అంటే ... భక్తి అంటే మన ఇంద్రియాలను భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాలి. అది పరిపూర్ణ జీవితం అది మన పరిపూర్ణమైన జీవితము కానీ మన ఇంద్రియాల సంతృప్తి కోసం మన ఇంద్రియాలను ఉపయోగించాలని కోరిన వెంటనే అది కర్మ అని పిలువబడుతుంది. ఇది భౌతిక జీవితం అని పిలుస్తారు అందుచేత, ఒక భక్తునికి భౌతికమనేది ఏదీ లేదు. దీనిని īśāvāsyam idaṁ sarvam (ISO 1). అని అంటారు అన్నిటిని కృష్ణుడికి చెందినవిగా భక్తుడు చూస్తాడు Īśāvāsyam idaṁ sarvaṁ yat kiñca jagatyāṁ jagat, tena tyaktena bhuñjīthā. అంతా కృష్ణుడికి చెందినది. అందువల్ల కృష్ణుడు ఏమి ఇస్తాడో ఒక యజమాని వలే . యజమాని సేవకునికి ఏమి ఇస్తాడో నీవు దీనిని ఆనందించవచ్చు. ఆ ప్రసాదం Prasāde sarva-duḥkhānāṁ hānir asyopajā... అదియే జీవితము మీరు కృష్ణ చైతన్యవంతులైతే , "కృష్ణునిడికే అంతా చెందుతుంది అని అర్ధము చేసుకుంటే నా చేతులు మరియు కాళ్ళు కూడా, అవి కృష్ణుడికి చెందినవి నా శరీర భాగాలన్నీ, అవి కృష్ణుడికి చెందినవి, అప్పుడు వాటిని కృష్ణుడి సేవకు వాడాలి, దానిని భక్తి అని అంటారు
- anyābhilāṣitā-śūnyaṁ
- jñāna-karmādy-anāvṛtam
- ānukūlyena kṛṣṇānu-
- śīlanaṁ bhaktir uttamā
- (Brs. 1.1.11)
అది కృష్ణుడు చేశాడు, అర్జునుడు చేశాడు, అర్జునుడు యుద్ధము చేయకుండా అతని ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవాలని కోరుకున్నాడు కానీ భగవద్గీత విన్న తర్వాత అతను అంగీకరించాడు, "అవును, కృష్ణుడు దేవాదిదేవుడు అని
- ahaṁ sarvasya prabhavo
- mattaḥ sarvaṁ pravartate
- iti matvā bhajante māṁ
- budhā bhāva-samanvitāḥ
- (BG 10.8)
ఈ విషయాలు భగవద్గీతలో బాగా చక్కగా వివరించబడ్డాయి ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క ప్రాధమిక అధ్యయనం భగవద్గీతా బోధనలు మనకు నిజంగా అర్ధమైతే , అప్పుడు మీరు కృష్ణుడికి శరణాగతి పొందుతారు . కృష్ణుడికి అది కావాలి Sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja (BG 18.66). కృష్ణుడు శరణాగతిని కోరుకుంటున్నాడు . ఈ కృష్ణచైతన్య జీవితాన్ని తీసుకుంటే, దానిని శ్రద్ధ అని అంటారు. శ్రద్ధ కవిరాజ గోస్వామిచే వివరించబడింది, శ్రద్ధ యొక్క అర్థం ఏమిటి