TE/Prabhupada 0063 - నేను గొప్ప మృదంగము వాయించే వాడిని



Arrival Lecture -- Dallas, March 3, 1975

ఇక్కడ వాతావరణమును చూడటానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. విద్య అంటే కృష్ణ చైతన్యము అని అర్థం. అది విద్య. మనము కేవలము ఆ "కృష్ణుడే భగవంతుడు అని అర్థము చేసుకుంటే. ఆయన గొప్పవాడు, మనము ఆయనను సేవకులము. అందువల్ల కృష్ణుడికి సేవ చేయడం మన బాధ్యత. " ఈ రెండు పంక్తులు మనము అర్థము చేసుకుంటే, అప్పుడు మన జీవితం పరిపూర్ణముగా ఉంటుంది. మనము కేవలం కృష్ణుని పూజించడము ఆయనను ఎలా సంతృప్తి పరచాలో నేర్చుకుంటే ఎలా బాగా అలంకరించాలి ఆయనకు మంచి ఆహారం ఎలా ఇవ్వాలి దుస్తులు ఆభరణాలు పువ్వులతో, ఎలా ఆయనను అలంకరించాలి ఎలా ఆయనకు గౌరవముతో ప్రణామము చేయాలి ఆయన పేరును ఎలా జపము చెయ్యాలి ఈ విధముగా , మనము కేవలం ఇలా అనుకుంటే, ఈ రోజులలో నేర్పబడుతున్న ఏ భౌతిక విద్య లేకుండా, మనము విశ్వములో ఒక పరిపూర్ణ వ్యక్తి అవుతాము. ఇది కృష్ణ చైతన్యము. ఈ ABCD విద్య పొందుట దీనికి అవసరం లేదు. కేవలం చైతన్యములో మార్పు అవసరం. కాబట్టి ఈ పిల్లలు చిన్న వయసులో... నుండి ఈ విద్యాభ్యాసం నేర్చుకుంటే నాకు నా తల్లిదండ్రుల శిక్షణ ద్వారా ఈ అవకాశం వచ్చింది.

నా తండ్రి ఇంటిని సందర్శించండానికి అనేక మంది సాధువులు వచ్చేవారు. నా తండ్రి వైష్ణవుడు. నా తండ్రి వైష్ణవుడు నా తండ్రి నన్ను వైష్ణవుడు కావాలని కోరుకున్నాడు. ప్రతిసారీ ఒక సాధువు వచ్చినప్పుడు, ఆయన అడుగుతాడు., దయచేసి దీవించండి "నా కుమారుడు రాధారాణి యొక్క సేవకుడు కావాలి అని" అది తన ప్రార్థన. ఆయన వేరొక దాని కోసం ప్రార్థించలేదు. ఆయన నాకు మృదంగము వాయించడము నేర్పారు నా తల్లి వ్యతిరేకంగా ఉంది. నాకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు ఒకరు మృదంగం వాయించుటకు మరొకరు నాకు ABCD నేర్పించుటకు ఒక గురువు వేచివుంటే మరొక గురువు నాకు మృదంగం ఎలా వాయించాలో నేర్పించారు. నా తల్లి, కోపంగా ఈ అర్థంలేని పని ఏమిటి మీరు మృదంగం ఎందుకు నేర్పేతున్నారు. ఆయన మృదంగం నేర్చుకొని ఆయన ఏమి చేస్తాడు? కానీ బహుశా నా తండ్రి నన్ను భవిష్యత్తులో ఒక గొప్ప మృదంగ వాయిద్యకారుడు కావాలని కోరుకున్నారు (నవ్వులు) అందువలన నా తండ్రికి నేను చాలా రుణపడి ఉన్నాను, నేను నా పుస్తకము, కృష్ణుడి పుస్తకాన్ని ఆయనకు అంకితం చేసాను. వారు కోరుకున్నారు. వారు నన్ను భాగవత, శ్రీమద్-భాగవతము ప్రచారకుడిగా వుండాలని కోరుకున్నారు మృదంగ వాయిద్యకారుడిగా రాధారాణి సేవకుడిగా.

కాబట్టి ప్రతి తల్లితండ్రులు ఆ విధముగా ఆలోచించాలి; ఇది శ్రీమద్-భాగవతంలో ఉన్నది, లేకపోతే తండ్రి తల్లిగా ఉండకూడదు. ఇది శాస్త్రములో నియమము. ఇది శ్రీమద్-భాగవతం, ఐదవ స్కందములో చెప్పబడినది పితా న సస్యాత్ జననీ న సస్యాత్ గురుర్ న సస్యాత్ స్వ జనో న సస్యాత్. సారంశము ఏమిఅనగా న మోక్ష్యేద్యః సముపేత మృత్యుమ్. ఒకవేళ తన శిష్యుని రక్షించలేక పోతే మరణము నుండి రాబోవు ప్రమాదం, ఆయన ఒక గురువు కాకూడదు. ఆయన అలా చేయలేకుంటే ఆయన తండ్రి లేదా తల్లి కాకూడదు. ఈ విధముగా, స్నేహితుడు, బంధువులు, తండ్రి, అవ్వకుడదు మరణం బారి నుండి ఎలా కాపాడుకోవాలని తన వారికి నేర్పించక పోతే. ప్రపంచం అంతటికీ ఈ విద్య కావాలి సాధారణ విషయము ఏమిటంటే ఒకరు జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి యొక్క ఈ చిక్కులో నుండి కేవలం కృష్ణ చైతన్యముతో బయటపడవచ్చు