TE/Prabhupada 0071 - మనము నిర్లక్ష్యముగా ఉన్నా కూడా దేవుని యొక్క కుమారులము



Room Conversation With French Commander -- August 3, 1976, New Mayapur (French farm)

మనము భగవంతుడు యొక్క నిర్లక్ష్యముగా వున్న ఉపయోగము లేని కుమారులము మనము భగవంతుని కుమారులము, ఎటువంటి సందేహం లేదు, కానీ ప్రస్తుత సమయంలో, నిర్లక్ష్యముతో ఎందుకూ పనికి రాకుండా వున్నాము మనము మన విలువైన జీవితాన్ని వృధా చేస్తున్నాము, మనము నిర్లక్ష్యంగా ఉన్నాము. కృష్ణ చైతన్య ఉద్యమము మనలోని నిర్లక్ష్యాన్ని నివారించడము కొరకే మన బాధ్యతలను గుర్తుచేసి తిరిగి ఇంటికి, భగవంతుడు దగ్గరకు తీసుకువెళ్ళుతుంది. ఇది కృష్ణ చైతన్యము. కానీ ప్రజలు ఎంతగా నిర్లక్ష్యంగా వున్నారంటే, మీరు భగవంతుడు గురించి ఏదైనా చెప్పిన వెంటనే, వెంటనే వారు నవ్వుతూ, "ఓ, ఇది అర్థంలేనిది, భగవంతుడు." ఇది తారాస్థాయి నిర్లక్ష్యం. భారతదేశం భగవంతుడు గురించి చాలా పట్టుదలతో ఉండేది. భారతదేశంలో నేటికి తీవ్రముగా ఉంది. ఇప్పుడు, ప్రస్తుత నాయకులు అనుకుంటున్నారు, భారతీయులు, కేవలం భగవంతుని గురించి ఆలోచిస్తూ చెడిపోయారు అని వారు ఆర్థిక అభివృద్ధి కోసం అమెరికన్లు యూరోపియన్లు వలె ఆలోచించడము లేదు.

ఇది పరిస్థితి, ఇది చాలా కష్టమైనది కానీ ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారము చేయడం ద్వారా మనము మానవజాతికి ఏదో ఒకటి చెయ్యవచ్చును. అదృష్టం ఉన్నవారు, వారు వచ్చి, తీవ్రంగా తీసుకుంటారు. ఈ నిర్లక్ష్యంతో ఉన్న కుమారులు, మనకు ఉదాహరణలు చాలా వున్నాయి ఉదాహరణకు, కొన్ని పెట్రోలియం నిల్వలు ఉన్నట్లుగా వారు పెట్రోలియముతో గుర్రం లేకుండా కార్లు నడుపవచ్చు అనేది తెలుసుకున్నారు కాబట్టి, మిలియన్ల కొద్దీ కార్లు ఉత్పత్తి చేసి, మొత్తం చమురును పాడుచేస్తున్నారు. ఇది నిర్లక్ష్యం. అది పూర్తి అయినప్పుడు, అప్పుడు వారు విలపిస్తారు. అది పూర్తి అవుతుంది. ఇది జరుగుతోంది. నిర్లక్ష్యంగా. నిర్లక్ష్యంగా ఉన్న బాలుడికి, ఆయన తండ్రి కొంత ఆస్తిని విడిచిపెట్టాడు, దాన్ని ఉపయోగించమని ఆయనకి వచ్చిన వెంటనే దానిని పోగొట్టుకుంటాడు, అంతే. ఇది నిర్లక్ష్యము. శరీరంలో కొంత బలం ఉంది, ఆయన లైంగిక జీవితం యొక్క కొంత రుచి పొందిన వెంటనే, శక్తి మొత్తాన్ని ఉపయోగించాలి ఉపయోగించాలి అని," మొత్తం శక్తిని ఉపయోగిస్తాడు. మెదడు ఖాళీగా అవుతుంది. పన్నెండవ సంవత్సరం నుండి ప్రారంభించి, ముఫ్పై ఏళ్ల వచ్చేసరికి మొత్తము ముగిసిపోతుంది. అప్పుడు ఆయన నపుంసకుడు. మా చిన్ననాటిలో - మా బాల్యంలో ఎనభై సంవత్సరాల క్రితం లేదా వంద సంవత్సరాల క్రితం ఏ మోటారు కారు లేదు. ఇప్పుడు, మీరు ఎక్కడికి వెళ్లినా, ఏ దేశంలో అయినా, లక్షలాది కార్లను చూస్తారు. ఇది నిర్లక్ష్యం. వందల సంవత్సరాల క్రితం వారు మోటారుకారు లేకుండా జీవించారు ఇప్పుడు వారు కారు లేకుండా జీవించలేరు. ఈ విధముగా, అనవసరంగా, వారు జీవితంలో శారీరక లేదా భౌతిక అవసరాలు పెంచుకుంటున్నారు. ఇది నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యాన్ని ప్రోత్సహించినా నాయకుల నాయకత్వము, మంచి నాయకత్వం. ఎవరు చెప్తారు, "ఈ అర్థంలేని వాటిని ఆపండి, కృష్ణ చైతన్యములోనికి రండి" ఎవరూ పట్టించుకోరు. అంధ యథంధైర్ ఉపనీయమానాస్తే పీశా-తంత్ర్యామ్ ఉరుదామ్ని బద్ధః ( SB 7.5.31) గుడ్డి నాయకుడు గుడ్డి అనుచరులకు నిర్దేశము చేయడము ప్రకృతి యొక్క ఖచ్చితమైన, కఠినమైన చట్టాలచే కట్టుబడి ఉన్నామని వారికి తెలియదు. (విరామం)...

ప్రకృతి చట్టాలు ఎలా పని చేస్తాయో వారికి తెలియదు. వారు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారు. వారికి తెలియదు. ఇది ఆధునిక నాగరికత అని. ప్రకృతి చట్టాలు అవి నిర్దేశించిన విధముగా పనిచేస్తాయి. మీరు శ్రద్ధ వహించండి లేదా వాటిని పట్టించుకోక పోయినా, అది మీ ఇష్టము, కానీ ప్రకృతి యొక్క చట్టాలు పని చేస్తాయి. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వషః ( BG 3.27) కానీ ఈ జులాయిలకు, వారికి ప్రకృతి చట్టాలు ఎలా పని చేస్తాయో వారికి తెలియదు. ప్రకృతి చట్టాలను అధిగమించడానికి కృత్రిమంగా మూర్ఖత్వంతో కృషి చేస్తున్నారు. ఈ విజ్ఞానశాస్త్రం, మూర్ఖుల శాస్త్రం, ఇది అసాధ్యం. కానీ వారు ప్రయత్నిస్తున్నారు. దీనిని మూర్ఖత్వము అని పిలుస్తారు. మూర్ఖత్వం. శాస్త్రవేత్తలు ఇలా చెప్పలేదా? "మనము అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాము." మీరు అలా చెయ్యలేరు ఎప్పటికీ. కానీ ఈ మూర్ఖత్వము కొనసాగుతోంది. వారిని ప్రశంసిస్తున్నాము. చక్కగా చేశారు చాలా చక్కగా చేశారు అని ఓ, మీరు చంద్ర గ్రహమునకు వెళ్తున్నారు. కానీ అన్ని ప్రయత్నాలు చేసిన తరువాత, ద్రాక్షలు పుల్లనివి: "ఇది ఉపయోగకరం కాదు." అంతే. మీకు కథ తెలుసా? నక్క? ద్రాక్ష కోసం ప్రయత్నము చేసినది, గెంతినది ఎగిరినది ఎగిరినది ఎగిరినది. అది వైఫల్యం అయినప్పుడు, అది ఇలా అన్నది, "ఓ, ఇది పుల్లగా ఉంది, ఇది ఉపయోగం లేదు." (నవ్వు) కాబట్టి వారు అలా చేస్తున్నారు. నక్కలు గెంతుతున్నాయి, అంతే. మనము ఈ మూర్ఖులు అనవసరంగా ఎగరడం చూస్తున్నాము. (నవ్వులు) కాబట్టి ఈ వెర్రి నక్కలను అనుసరించకుండా మనం ప్రజలను హెచ్చరిస్తున్నాం. వివేకంతో ఉండండి కృష్ణ చైతన్యముతో ఉండండి. అది మీ జీవితాన్ని విజయవంతం చేస్తుంది