TE/Prabhupada 0073 - వైకుంఠ అంటే చింతన లేదు అని అర్థం
Lecture on BG 10.2-3 -- New York, January 1, 1967
ఈ సాంగత్యములోనే మీరు దీన్ని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ కళను నేర్చుకోవచ్చు, మీరు మీ ఇంటిలో ప్రయత్నము చేయవచ్చును మీరు మీ ఇంటి వద్ద మంచి ఆహారము, సిద్ధం చేయవచ్చు, కృష్ణుడికి ఆరగింపు చేయవచ్చును. ఇది కష్టం కాదు. మనము కృష్ణుడికి ప్రతి రోజు ఆహారము సిద్ధం చేసి, మంత్రము చదివి ఆరగింపు చేస్తాము
- నమో బ్రహ్మణ్య దేవాయ
- గో బ్రాహ్మణ హితాయ చ
- జగద్ హితాయ చ కృష్ణాయ
- గోవిందాయ నమో నమః
అంతే. ఇది కష్టం కాదు. ప్రతి ఒక్కరూ ఆహారాన్ని సిద్ధం చేసి, కృష్ణుడికి అర్పించి దానిని తీసుకొనవలెను, ఆపై కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మీరు కూర్చోవచ్చు కృష్ణుడి చిత్రం ముందు కీర్తన చేస్తూ,
- హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
- హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఒక పవిత్రమైన జీవనం కలిగి వుండండి. ఫలితాన్ని చూడవచ్చును. ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తి, కృష్ణుడిని అర్థం చేసుకోనే ఈ సిద్ధాంతాన్ని తీసుకుంటే, అది అవుతుంది... మొత్తం ప్రపంచం వైకుంఠం అవుతుంది. వైకుంఠం అంటే చింతన లేదు అని అర్థం. వైకుంఠ, వై అంటే లేకుండా, కుంఠ అంటే ఆందోళన. ఈ ప్రపంచం ఆందోళనతో నిండి ఉంది సముద్విగ్న ధియం -అసద్-గ్రహాత్ ( SB 7.5.5) మనము ఈ తాత్కాలిక భౌతిక జీవితమును అంగీకరించాము అందువల్ల మనము ఎప్పుడూ ఆందోళనతో ఉంటాము. ఆధ్యాత్మిక ప్రపంచంము, దీనికి పూర్తిగా వ్యతిరేకముగా ఉంది, అక్కడ గ్రహాలను వైకుంఠ అని పిలుస్తారు. వైకుంఠ అంటే ఆందోళన లేకుండా.
మనము ఆందోళనల నుండి విముక్తి పొందాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఆందోళనల నుండి స్వతంత్రాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు, అయితే ఈ ఆందోళనల నుండి ఎలా బయటపడాలో ఆయనకి తెలియదు. మత్తును ఆశ్రయం తీసుకోవడం, ఆందోళనలు నుండి తప్పించుకోవడానికి ఉపయోగపడదు. ఇది ఒక మందు. మతిమరుపు ఉంటుంది. కొన్నిసార్లు మనము ప్రతిదీ మర్చిపోతాము, కానీ మీరు చైతన్యములోనికి వచ్చినప్పుడు మళ్ళీ అవే ఆందోళనలు అదే విషయము ఉన్నది కాబట్టి ఇది మీకు సహకరించదు.
మీరు ఆందోళనల నుండి విముక్తి పొందాలని కోరుకుంటే మీరు వాస్తవము కావాలనుకుంటే ఆనందం జ్ఞానంతో కూడిన శాశ్వతమైన జీవితం, అప్పుడు ఇది పద్ధతి ఇది పద్ధతి. మీరు కృష్ణుని అర్థం చేసుకోవడానికి. ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడింది. న మే విధుః సుర గణః ( BG 10.2) ఎవరికి అర్థం కాదు. కానీ ఒక మార్గం ఉంది. సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః (Brs. 1.2.234). ఇది ఒక పద్ధతి. శ్రీమద్-భాగవతం లో అనేక సందర్భాలలో ఈ పద్ధతిని వేరువేరు విధాలుగా వివరించారు. ఒకే చోట, ఇలా పేర్కొన్నారు.
- jñāne prayāsam udapāsya namanta eva
- jīvanti san-mukharitāṁ bhavadīya-vārtām
- sthāne sthitāḥ śruti-gatāṁ tanu-vāṅ-manobhir
- ye prāyaśo 'jita jito 'py asi tais tri-lokyām
- (SB 10.14.3)
ఇది చాలా అందమైన శ్లోకము. అజిత, ఎవరికీ తెలియదు. భగవంతుడుకి మరో నామము అజిత. అజిత అంటే ఎవరూ జయించలేరు. ఎవరూ ఆయనను చేరుకోలేరు. అందువలన అయిన నామము అజిత. కావున జయింపబడనివాడు జయింపబడతాడు. అజిత జితోఽప్యసి. భగవంతుడు గురించి మనకు పూర్తిగా తెలియనప్పటికీ, భగవంతుడు జయింప శక్యము కాని వాడు అయినప్పటికీ, ఆయనను జయించారు. ఎలా? స్థానే స్థితః