TE/Prabhupada 0076 - ప్రతి చోటా భగవంతుని చూడండి
(Redirected from TE/Prabhupada 0076 - ప్రతిచోటా భగవంతుని చూడoడి)
Ratha-yatra -- San Francisco, June 27, 1971
మన కన్నులను భగవంతుని మీద ప్రేమతో అభిషేకించినప్పుడు, మనం ఎక్కడైనా ఆయనను చూడగలము. ఇది శాస్త్రముల యొక్క ఉత్తర్వు. భగవంతుని పై ప్రేమను అభివృద్ధి చేసుకోవడము ద్వారా మనము ఆయనను చూసే శక్తిని అభివృద్ధి చేసుకోవచ్చును. ప్రేమాంజనచ్ఛురిత భక్తి విలోచనేన (Bs. 5.38). ఒకరు కృష్ణ చైతన్యంలో సంపూర్ణముగా అభివృద్ధి చెందినప్పుడు, ఆయన తన హృదయంలో ఎక్కడకు వెళ్ళినా ప్రతిక్షణము ప్రతిచోటా భగవంతుని చూడ గలడు కావున ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఒక ప్రయత్నం ప్రజలు భగవంతుడిని ఎలా చూడవచ్చు, కృష్ణుడిని ఎలా చూడవచ్చు అని భోదించడానికి. మనము సాధన చేస్తే కృష్ణుని చూడవచ్చు. కృష్ణుడు చెప్పినట్టుగా రసోఽహమప్సు కౌంతేయా ( BG 7.8) కృష్ణుడు చెప్తారు, "నేను నీటి యందలి రుచిని" మనము ప్రతి ఒక్కరమూ, ప్రతి రోజూ నీటిని త్రాగుతాము ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కేవలం నీరు త్రాగిన వెంటనే, నీటి రుచి కృష్ణుడు అని మనము అనుకుంటే, వెంటనే మనము కృష్ణ చైతన్యవంతులము అవ్వుతాము. కృష్ణ చైతన్యము అవ్వటము చాలా కష్టమైన పని కాదు. కేవలం మనం సాధన చేయాలి.
కృష్ణ చైతన్యమును ఎలా సాధన చేయాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మీరు నీరు త్రాగినప్పుడు, మీ దాహము తీరిన వెంటనే మీ దాహం తీరినది. వెంటనే మీరు ఈ దాహం, తీర్చే శక్తి కృష్ణుడు అని అనుకోండి. ప్రభాశ్మి శశి సూర్యయోః. కృష్ణుడు చెప్తారు "నేను సూర్యరశ్మిని, నేను చంద్రునిని వెన్నెలను." పగటి సమయంలో, మనము ప్రతి ఒక్కరమూ సూర్యరశ్మిని చూస్తాము. మీరు సూర్యరశ్మిని చూసిన వెంటనే, మీరు కృష్ణుని గుర్తుకు తెచ్చుకోవచ్చు, "ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు అని" మీరు రాత్రి చంద్రుడి వెన్నెలను చూసినప్పుడు వెంటనే మీరు "కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని" గుర్తు తెచ్చుకోవచ్చు. ఈ విధముగా, మీరు సాధన చేస్తే, అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక ఉదాహరణలు భగవద్గీత ఏడవ అధ్యాయంలో ఇస్తారు, మీరు వాటిని జాగ్రత్తగా చదివినట్లయితే, కృష్ణ చైతన్యమును ఎలా సాధన చేయాలి అని. ఆ సమయంలో, మీకు కృష్ణుడిపై వున్న ప్రేమ పరిణితి చెందినప్పుడు, మీరు ప్రతిచోటా కృష్ణుడిని చూస్తారు. కృష్ణుడిని చూడడానికి ఎవరూ మీకు సహాయం చేయనవసరము లేదు, కానీ మీ ప్రేమతో, మీ భక్తితో కృష్ణుడు మీకు కనిపిస్తారు. సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః (Brs. 1.2.234). సేవా ధృక్పదములో వున్నప్పుడు, కృష్ణుడు నేను కృష్ణుడు లేదా భగవంతుని శాశ్వతమైన సేవకుడిని అని అనుకుంటే అప్పుడు కృష్ణుడు ఆయనని ఎలా చూడవచ్చో మీకు సహాయం చేస్తారు.
ఇది భగవద్గీతలో చెప్పబడింది,
- తేషాం సతత యుక్తానాం
- భజతాం ప్రీతి పూర్వకం
- దదామి బుద్ధి యోగం తం
- యేన మాముపయాంతి తే
- ( BG 10.10)