TE/Prabhupada 0086 - ఈ అసమానతలు ఎందుకు వున్నాయి



Sri Isopanisad, Mantra 9-10 -- Los Angeles, May 14, 1970

మనము వివిధ వ్యక్తిత్వాలను ఎందుకు చూస్తున్నాము? ఇది పిత్తం, కఫం, వాయువు యొక్క కలయిక అయితే, అవి ఎందుకు ఒకే రకముగా లేవు? వారు ఈ జ్ఞానము ఎందుకు పెంచుకోరు? ఈ విభిన్నమైనవి ఎందుకు ఉన్నాయి? ఒక వ్యక్తి లక్షాధికారిగా జన్మించాడు మరొక వ్యక్తి ఆయన రోజుకు రెండుసార్లు పూర్తిగా భోజనం చేయడానికి ఉండదు ఆయన పోరాడుతున్నప్పటికీ ఎందుకు ఈ వివక్ష? ఎందుకు అలాంటి అనుకూలమైన పరిస్థితి ఒకరికి పెడతారు? మరొకరికి ఎందుకు అనుకూలమైన పరిస్థితి లేదు? కాబట్టి కర్మ సిధ్ధాంతము వున్నది, వ్యక్తిత్వం ఉంది.

ఇది జ్ఞానము. అందువలన ఈశోపనిషద్ చెప్తుంది anyad evāhur vidyayā anyad āhur avidyayā. అజ్ఞానముతో వున్న వారు వేరొక రకమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు విజ్ఞానంలో వున్నవారు జ్ఞానాన్ని భిన్నంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలకు మన కార్యక్రమాలు, కృష్ణ చైతన్యము నచ్చవు. వారు ఆశ్చర్యపోతున్నారు. గర్గముని నిన్న సాయంత్రం చెపుతున్నాడు ప్రజలు అడుగుతున్నారు మీకు అంత ధనము ఎలా వస్తుంది మీరు చాలా కార్లు గొప్ప చర్చి ఆస్తిని కొనుగోలు చేస్తున్నారు. రోజువారీ యాభై, అరవై మందిని పోషిస్తూ ఆనందముగా వుంటున్నారు. ఇదేమిటి? కాబట్టి వారు ఆశ్చర్యపోతున్నారు. మనము ఆశ్చర్యపోతున్నాము. ఈ తెలివితక్కువ వారు ఎందుకు అంత కష్టపడుతున్నారు కేవలము పొట్ట నింపుకోవటానికి భగవద్గీత చెప్తుంది yā niśā sarva-bhūtānāṁ tasyāṁ jāgrati saṁyamī. మనము ప్రజలు నిద్ర పోవటము చూస్తున్నాము వారు మనము మన సమయం వృధా చేస్తున్నామని చూస్తున్నారు. ఈ అభిప్రాయములు వ్యతిరేకముగా ఉన్నాయి. ఎందుకు? వారి ఆలోచనా విధానము, చేయు పనులు వేరుగా వున్నాయి. మన ఆలోచనా విధానము చేసే పనులు వేరుగా వున్నాయి ఒక తెలివైన వ్యక్తి ద్వారా నిర్ణయించబడుతుంది వీరిలో నిజానికి ఎవరి పని సరైనది.

ఈ విషయాలు చాలా చక్కగా వేదముల సాహిత్యంలో చర్చించబడినవి ఈ ఈశోపనిషద్ వలె మరొక ఉపనిషద్, గర్గ ఉపనిషద్ ఉంది. భార్యాభర్తల మధ్య చర్చ ఉంది, వారు బాగా చదువుకున్నారు భర్త భార్యకు బోధిస్తున్నాడు Etad viditvā yaḥ prayāti sa eva brāhmaṇa gargi. Etad aviditvā yaḥ prayāti sa eva kṛpanā. విజ్ఞానం యొక్క వాస్తవమైన సంస్కృతి, ఎవరైతే అందరూ జన్మిస్తారు ప్రతి ఒక్కరూ చనిపోతారు దాని గురించి అభిప్రాయ భేదము లేదు. మనము చనిపోతాము వారు చనిపోతారు. మీరు పుట్టుక, మరణము, వృద్ధాప్యం, వ్యాధి గురించి ఆలోచిస్తున్నారు అని వారు చెప్పగలరు. మీరు కృష్ణ చైతన్యమును పెంపొందించుకుంటున్నారు మీరు చెప్పాలనుకొంటున్నది ప్రకృతి నాలుగు విధాలుగా చేస్తున్న దాడి నుంచి మీరు విముక్తులు అవుతారా? ఇది వాస్తవం కాదు. నిజానికి, గర్గ ఉపనిషద్ చెప్తుంది, ఏతధ్ విదిత్వాయః ప్రయాతి. అతడు ఏమిటి అని తెలుసుకొన్న తర్వాత ఈ శరీరం వదిలేసిన వ్యక్తి, ఆయన ఒక బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు. మేము మీకు యజ్ఞోపవీతాన్ని ఇస్తున్నాము. ఎందుకు? మీరు జీవితం యొక్క రహస్యమును తెలుసుకోవడము కొరకు ప్రయత్నించండి. అది బ్రాహ్మణుడు అంటే. మనము ఈ శ్లోకములో చదివాము, విజానతః విషయములను యధాతథముగా తెలుసుకొని శరీరమును వదిలినవాడు బ్రాహ్మణుడు