TE/Prabhupada 0088 - మాతో చేరిన విద్యార్ధులు శ్రవణము చేశారు



Lecture on BG 7.1 -- San Diego, July 1, 1972

బ్రహ్మ చెప్పారు. బ్రహ్మ యొక్క అనుభవము... ఆయన ఈ విశ్వంలో ఉన్నతమైన జీవి ఆయన చెప్పాడు, "ఒక వ్యక్తి అర్థంలేని కల్పన చేసే అలవాటు త్యజించినట్లయితే " Jñāne prayāsam udapāsya. వినయపూర్వకగా ఉండాలి. ఆయన తనకి ఏదో తెలుసని, ఊహించుకోగలనని ఏదైనా కనుగొనగలనని నటించకూడదు శాస్త్రవేత్తలు అని పిలవబడే వారివలె, వారు కేవలం ఊహగానాలు చేస్తూ, వారి శ్రమను వృధా చేస్తున్నారు. మీరు ఏమి చేయలేరు. ప్రతిదీ ఇప్పటికే ఏర్పాటు చెయ్యబడింది. మీరు మార్చలేరు. మీరు ఇది మాత్రమే చూడగలరు ఈ చట్టం ఎలా పనిచేస్తుంది, అంతవరకే మీరు చెయ్యవచ్చు. కానీ మీరు చట్టం మార్చలేరు, మీరు చట్టం నుంచి మేలైన సౌకర్యం కలుగ చేసుకోవచ్చు లేదు, మీరు చెయ్యలేరు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా (BG 7.14) దురత్యయా అది చాలా కష్టము అని అర్థం. కాబట్టి చైతన్య మహాప్రభుకి, బ్రహ్మ యొక్క ప్రకటన తెలియజేసినప్పుడు ఊహించుకునే పద్దతిని వదిలేయాలని, అతను ఏదో సృష్టించాలనుకునే ఈ అర్థంలేని అలవాట్లను వదిలి వేయాలి. చాలా వినయపూర్వకముగా ఉండాలి. గడ్డి కంటే ఎక్కువ వినయపూర్వకముగా ఉండాలి మనము గడ్డి పై కాలితో త్రొక్కినప్పుడు అది నిరసన తెలుపదు సరే, అయ్యా మీరు వెళ్ళండి, ఈ రకమైన వినయం Tṛṇād api sunīcena taror api sahiṣṇunā. తరు అంటే చెట్టు. చెట్టు ఎంతో సహనంతో.

కావున చైతన్య మహాప్రభు చెప్పారు, jñāne prayāsam udapāsya namanta eva... నేను ఊహించడము మానివేస్తాను. మీ సలహా ప్రకారము మరింత వినయపూర్వకముగా వుంటాను. ఏమి నా తదుపరి కర్తవ్యము తదుపరి కర్తవ్యము: నమంత ఏవ, వినయపూర్వకముగా ఉండటం, san-mukharitāṁ bhavadīya-vārtām, ఒక భక్తుని సంప్రదించాలి మీరు ఆయన నుండి వినండి. స్థానే స్థితః. మీరు మీ పరిస్థితిలో ఉండండి. మీరు అమెరికన్ గానే ఉండండి మీరు ఇండియన్ గా ఉండండి. మీరు క్రిస్టియన్ వలె ఉండండి. మీరు ఒక హిందువు వలె ఉండండి. మీరు నల్లవానిగా ఉండండి. మీరు తెల్లవానిగా ఉండండి మీరు ఒక మహిళగా, ఒక వ్యక్తిగా ఉండండి. జ్ఞానము కలిగిన భక్తుల ఉపన్యాసములను శ్రవణము చేయండి. ఇది సిఫార్సు చేయబడినది మీరు విన్నప్పుడు, మీరు ఆలోచించాలి. మీరు నా నుండి శ్రవణము చేయుచున్నారు. మీరు స్వామిజీ ఏమి చెప్పారు అని ఆలోచిస్తే Sthāne sthitāḥ śruti-gatāṁ tanu-vāṅ-manobhiḥ. శ్రుతి-గతామ్. శ్రుతి-గతామ్. శృతి పదమునకు అర్థము చెవి ద్వారా శ్రవణము చేయడము. మీరు ఆలోచిస్తూ మీ శరీరం, మీ మనస్సుతో క్రమంగా అర్థం చేసుకొనుటకు ప్రయత్నించండి ఎందుకంటే మీ లక్ష్యం ఆత్మ సాక్షాత్కారము భగవంతుడు, ఆత్మ. మనము ఆయన అంశలము. ఈ పద్ధతి ద్వారా కాబట్టి, చైతన్య మహాప్రభు చెప్తున్నారు, భగవంతుడు అజిత ఎప్పటికీ జయింబడరు. మీరు సవాలు ద్వారా, మీరు భగవంతుని తెలుసుకోవాలనుకుంటే, మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు భగవంతుడు ఎప్పుడూ సవాలును స్వీకరించరు.. భగవంతుడు గొప్పవాడు కాబట్టి, మీ సవాలును ఆయన ఎందుకు అంగీకరించాలి? మీరు భగవంతుడుతో ఇలా పలికితే, "ప్రియమైన భగవంతుడా, దయచేసి ఇక్కడకు రండి. నేను మిమ్మల్ని చూస్తాను." కాబట్టి భగవంతుడు ఆ విధముగా ఉండరు. నీ ఆజ్ఞను నెరవేర్చరు. మీరు వారి ఆజ్ఞను అనుసరించాలి. అప్పుడు భగవంతుని సాక్షాత్కారము కలుగుతుంది భగవంతుడు చెప్తున్నారు, మీరు శరణాగతి పొందండి. సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకమ్ శరణం వ్రజ (BG 18.66). ఆ పద్ధతి ద్వారా మీరు భగవంతుడు గురించి తెలుసుకుంటారు. అంతే కానీ, "నేను భగవంతుని తెలుసుకుంటాను. నేను తెలివైన వాడిని, నేను ఊహించగలను. ఈ పద్ధతి పనిచేయదు.

కాబట్టి ఈ శ్రవణము... మనము శ్రవణము గురించి మాట్లాడుతున్నాము. శ్రవణ పద్ధతి చాలా ముఖ్యమైనది. మా సంస్థ, కృష్ణ చైతన్య ఉద్యమంలో వ్యాపించింది. ఎందుకంటే మన వద్దకు వచ్చిన విద్యార్థులు వారు శ్రవణము చేశారు శ్రవణము ద్వారా, వారిలో ప్రతిదీ లోపల మార్చబడింది వారు పూర్తిగా మనసును లగ్నము చేసి మన సంస్థలో చేరారు. ఈ విధముగా ఇంకా జరుగుతుంది. కాబట్టి వినటము చాలా ముఖ్యమైనది భగవంతుని ఆధ్యాత్మిక సందేశము వినే అవకాశము కలుగచేయుటకు మనము చాలా కేంద్రాలను ప్రారంభిస్తున్నాము కాబట్టి మీరు ఈ అవకాశం తీసుకొని, నా ఉద్దేశ్యం, ఈ శ్రవణ పద్ధతి యొక్క ప్రయోజనమును పొందండి