TE/Prabhupada 0090 - ప్రణాళికతో నిర్వహణ చేయండి. లేకపోతే iskcon ఎలా నిర్వహించగలుగుతారు



Morning Walk -- December 5, 1973, Los Angeles


ప్రభుపాద: అందరూ కృష్ణుని కుటుంబానికి చెందిన వారు, కానీ మనము కృష్ణుడి కోసం ఏమి చేస్తున్నామో చూడాలి ప్రతి ఒక్కరూ రాష్ట్ర పౌరులు ఒక వ్యక్తికి ఉన్నత హోదా గొప్ప స్థాయి ఎందుకు ఇస్తారు?

ప్రభుపాద: ఎందుకు? ఆయన గుర్తించబడ్డారు.

సుదామ: అవును

ప్రభుపాద: మనము సేవ చేయాలి. మీరు కేవలం "నేను కృష్ణుడి కుటుంబానికి చెందినవాడిని అని అనుకొని కృష్ణుడికి ఏమీ సేవ చేయకపోతే, అది సరైన పద్ధతి కాదు.

సుదామ: ఇది సరైనది పద్ధతి కాదు.

ప్రభుపాద: ఇది సరైనది పద్ధతి కాదు. ఆయన త్వరలోనే మళ్లీ కృష్ణుని మర్చిపోతాడు అని అర్థం. ఆయన మళ్లీ మర్చిపోతాడు

సుదామ: సేవ చాలా శక్తివంతంగా ఉంది. ఇక్కడి ప్రజలు, వారు కృష్ణుడి కుటుంబములో భాగంగా ఉన్నాను, కానీ వారు మరచిపోయారు కావున, అప్పుడు మనము మతిమరుపు వలన ప్రభావితం అయ్యాము

ప్రభుపాద: అవును. మతిమరపు అంటే మాయ అని అర్థం.

సుదామ: అవును.

ప్రభుపాద మాయ అంటే ఏమిటో కాదు. అది మతిమరపు. అంతే అది జీవితములో లేదు. మతిమరపు అది నిలబడదు. కానీ ఇది ఉన్నంతవరకు వరకు, అది చాలా సమస్యాత్మకముగా ఉంటుంది.

సుదామ: కొందరు భక్తులు కొన్నిసార్లు నన్ను తాము సంతోషాన్ని అనుభూతి చెందడములేదు అని ప్రశ్నిస్తారు కాబట్టి వారు మానసికముగా అసంతృప్తిగా వున్నా వారు కృష్ణ చైతన్యములో కొనసాగాలా? నేను వారికి తెలియజేస్తాను, వారు అసంతృప్తిగా ఉన్నప్పటికీ...

ప్రభుపాద: కానీ మీరు ఉదాహరణ చూపించాలి. మీరు వేరే విధముగా ఉదాహరణ చూపిస్తే వారు మిమ్మల్ని ఎందుకు అనుసరిస్తారు ఉదాహరణ ఉపదేశము కంటే ఉత్తమం. ఎందుకు మీరు బయట నివసిస్తున్నారు?

సుదామ: ఎందుకంటే, నేను...

ప్రభుపాద: (విరామం)... చివరిసారి, నా ఆరోగ్యం క్షీణించినది. నేను ఈ ధామము వదిలి వెళ్ళాలి అంటే ఈ సంస్థను వదలి వేస్తాను అని కాదు నేను భారతదేశం వెళ్లి కోలుకున్నాను. నేను లండన్ వచ్చాను. కాబట్టి ఆరోగ్యము కొన్నిసార్లు సరిగ్గా వుండదు... కానీ మనము ఈ సంస్థను వదలి వేయలేదు. నా ఆరోగ్యము ఇక్కడ సరిగ్గా ఉండకపోతే... నేను వెళ్ళుతాను. నాకు వంద కేంద్రాలు ఉన్నాయి. మీరు ఆరోగ్యము పునరుద్ధరించడానికి ఈ విశ్వం బయటకు పొలేరు. మీరు ఈ విశ్వంలోనే ఉండాలి. ఎందుకు మీరు సంస్థ నుండి బయటకు వెళ్తారు? నరోత్తమ దాస్ ఠాకురా అన్నారు- మనము భక్తులతో నివసించాలి. నేను నా కుటుంబం ఎందుకు వదిలి వేసాను? వారు భక్తులు కారు. అందుకే నేను వచ్చాను లేకపోతే, వృద్ధాప్యంలో, నేను సౌకర్యముగా ఉండవచ్చును. లేదు మనము భక్తులు కానీ వారితో నివసించకూడదు. వారు కుటుంబ సభ్యులు లేదా ఎవరైనా కావచ్చు. మహారాజా విభీషణుడు వలె. తన సోదరుడు భక్తుడు కాకపోవటము వలన, అతణ్ణి వదిలి, అతనిని విడిచిపెట్టాడు. ఆయన రామచంద్రుని దగ్గరకు వచ్చారు.. విభీషణుడు. మీకు తెలుసా?

సుదామ: తెలుసు

హృదయానంద: కాబట్టి

ప్రభుపాద ఒక సన్యాసి, ఒంటరిగా ఉండవలెను. కేవలము భక్తులతో మాత్రమే నివసించాలి

ప్రభుపాద: ఎవరు...! సన్యాసి ఒంటరిగా జీవించాలని ఎక్కడ చెప్పబడినది?

హృదయానంద: మీ పుస్తకాలలో కొన్నిసార్లు

ప్రభుపాద: అహ్?

హృదయానంద: కొన్నిసార్లు మీ పుస్తకాలలో కాబట్టి భక్తులతోనే నివసించాలి అని అర్థమా?

ప్రభుపాద: సాధారణంగా, సన్యాసి ఒంటరిగా జీవించవచ్చు. కానీ ఒక సన్యాసి యొక్క కర్తవ్యము ప్రచారము చేయడము.

సుదామ: నేను ఎప్పటికీ మానివేయను.

ప్రభుపాద: ఏమిటి?

సుదామ: నేను ప్రచారము ఎప్పటికీ మానాలని కోరుకోవటము లేదు

ప్రభుపాద: ప్రచారము. ప్రచారము మీరు తయారు చేయలేరు మీరు మీ ఆధ్యాత్మిక గురువు ఆదేశించిన సూత్రాల ప్రకారం ఉపదేశములు చేయాలి. మీరు మీ సొంత మార్గాలలో ప్రచారము చేయకూడదు. ఇది అవసరం. ఒక నాయకుడు ఉండాలి. ఆయన నాయకత్వంలో. యస్య ప్రసాదాద్ భగవత్... ఎందుకు ఇలా చెప్పబడినది ప్రతిచోటా కార్యాలయంలో, అక్కడ ఎవరో ప్రత్యక్ష ఉన్నతాధికారులు వుంటారు మీరు ఆయనని సంతోషపరుస్తూ ఉండాలి. ఇది సేవ. కార్యాలయంలో అనుకుందాం ఒక విభాగంలో, ఒక కార్యాలయ నిర్వాహకుడు ఉంటాడు. మీరు మీ స్వంత విధముగా చేస్తే, అవును, నేను నా వ్యాపారం, చేస్తున్నా కార్యాలయ నిర్వాహకుడు సంతృప్తి చెందడు. మీరు ఈ రకమైన సేవ బాగుంది అని అనుకుంటున్నారా? అదేవిధముగా, మనకు ప్రతిచోటా ప్రత్యక్ష కార్యనిర్వాహకుడు వుంటాడు మనం ఈ విధముగా పని చేయాలి. అది క్రమబద్ధమైనది. ప్రతి ఒక్కరూ వారి జీవితమును తన తోచినట్లుగా వుంటున్నప్పుడు, గందరగోళంగా ఉంటుంది.

సుదామ: అవును, ఇది సత్యము.

ప్రభుపాద: అవును. ప్రస్తుతం మనది ప్రపంచ సంస్థ. ఒక వైపు ఆధ్యాత్మికం, మరొక వైపు భౌతికము. అది భౌతిక అంశం కాదు. అది కూడా ఆధ్యాత్మికమే. క్రమబద్ధమైన నిర్వహణ అని అర్థం. లేకపోతే అది ఎలా పూర్తి అవుతుంది? గౌర సుందర ఇంటిని అమ్మాడు. డబ్బు యొక్క ఆధారములు ఏవీ లేవు. ఇది ఏమిటి? ఆయన ఎవరినీ అడగలేదు. ఆయన ఇంటికి విక్రయించాడు. డబ్బు ఎక్కడ ఉంది, ఆధారములు ఏవీ లేవు.