TE/Prabhupada 0092 - మన ఇంద్రియాలకు కృష్ణుని సంతృప్తి పరిచేందుకు శిక్షణ ఇవ్వాలి



Lecture on BG 2.20-25 -- Seattle, October 14, 1968

ఈ భౌతిక ప్రపంచంలో వున్న వారు ఇంద్రియ తృప్తిలో చిక్కుకున్నారు. ఉన్నత లోకములో లేదా అధమ లోకములో కానీ జంతువుల ప్రపంచంలో ఇంద్రియ ప్రేరణ వున్నట్లు మానవులలో కూడా ఉంది. ఈ మనిషి ఏమిటి? మనము నాగరిక ప్రజలము, మనమేం చెయ్యాలి? అదే తినడం, నిద్రపోవడము, సంభోగము చేయడము చేయుట, కుక్క కూడా అదే పని చేస్తోంది. ఎక్కడైనా గాని భౌతిక ప్రపంచంలోని ఉన్నత లేదా అధమ లోకాలలో, ఇంద్రియ సంతృప్తి ప్రముఖంగా ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే ఇంద్రియ తృప్తి లేదు కృష్ణుని సంతృప్తి పరచాలనే ప్రయత్నము మాత్రమే ఉంటుంది. అంటే .... ఇక్కడ, ప్రతి ఒక్కరూ తమ ఇంద్రియాల సంతృప్తి కొరకు ప్రయత్నిస్తున్నారు. ఇది భౌతిక ప్రపంచం యొక్క చట్టం. ఇది భౌతిక జీవితం. మీరు మీ ఇంద్రియాలను సంతృప్తి పరుచుకొనుటకు ప్రయత్నిస్తే, అది భౌతిక జీవితం. మీరు కృష్ణుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరుచుటకు ప్రయత్నించినప్పుడు, అది ఆధ్యాత్మిక జీవితం. ఇది చాలా సాధారణ విషయము.సంతృప్తి పరిచే బదులు…. హృషీకేణ హృషీకేశ -సేవనం ( CC 19.170). అది భక్తి.

మీకు ఇంద్రియాలు వున్నాయి. మీరు వాటిని సంతృప్తి పరచాలి. ఇంద్రియాలను మీరు సంతృప్తి పరచాలి. మీరు సంతృప్తి పడండి... కానీ మీకు తెలియదు. కృష్ణుని ఇంద్రియాలను సంతృప్తి పరిస్తే తన ఇంద్రియాలు సహజముగానే సంతృప్తి చెందుతాయి అని బద్ధ జీవునికి తెలియదు, అదే ఉదాహరణ. చెట్టు వేరుకి నీరు పోయడం లేదా వేళ్లు, నా శరీరం యొక్క అంతర్భాగమైనవి కడుపుకు ఆహారం ఇవ్వడం ద్వారా, వేళ్లు సహజముగా సంతృప్తి చెందుతాయి ఈ రహస్యాన్ని మనము మర్చిపోయము. మనము మన ఇంద్రియాలను సంతృప్తి పరచడము ద్వారా మనము ఆనందంగా ఉంటాము అని అనుకుంటున్నాము కృష్ణ చైతన్యము అంటే మీ ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోవద్దు అని అర్థము మీరు కృష్ణుని ఇంద్రియాలను సంతృప్తి పరుచుటకు ప్రయత్నించండి; సహజముగా మీ ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి ఇది ఈ కృష్ణ చైతన్యము యొక్క రహస్యం. ప్రత్యర్థులు అనుకుంటున్నారు, "ఎందుకు నేను కృష్ణుని సంతృప్తి పరచాలి? నేను ఎందుకు పగలు రాత్రి కృష్ణుని కోసము పని చేయాలి? నేను కర్మిలను సంతృప్తి పరుచుటకు ప్రయత్నిస్తాను మీరు పగలు రాత్రి కృష్ణుని కోసము పని చేస్తున్నట్లు, వారు ఆలోచిస్తున్నారు" ఎంత తెలివి తక్కువ వారు ఈ భక్తులు అని మనము చాలా తెలివైన వారము. మనము ఇంద్రియాలను సంతృప్తి పరుచు కోవడం కోసం పగలు రాత్రి పని చేస్తున్నాము వారు కృష్ణుని కోసము ఎందుకు పని చేస్తున్నారు?

భౌతిక వ్యక్తి ఆధ్యాత్మిక వ్యక్తి మధ్య తేడా వుంది ఆధ్యాత్మిక వ్యక్తి కేవలం కృష్ణుని కోసము అవిరామంగా పగలు రాత్రి పని చేస్తూంటాడు. అది ఆధ్యాత్మిక జీవితం భౌతిక వ్యక్తి కుడా ఎప్పుడూ తన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇది భౌతిక వ్యక్తికి ఆధ్యాత్మిక వ్యక్తికి మధ్య తేడా. కృష్ణ చైతన్య ఉద్యమం అంటే మనము కృష్ణుని సంతృప్తి పరిచేందుకు మన ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వాలి అంతే.. అనేక లక్షల జన్మలలో మనము మన ఇంద్రియాలను తృప్తి పరుచుటకు ప్రయత్నించాము ఈ జీవితం కృష్ణుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరిచేందుకు అంకితం చేద్దాము. ఇది కృష్ణ చైతన్యము. ఒక్క జీవితం. మనకు అనేక జీవితాలు ఉన్నాయి, మన వ్యక్తిగత ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోవడానికి ప్రయత్నించాము. ఈ జీవితం, కనీసము ఒక్క జీవితం, నేను ప్రయత్నిస్తాను. ఏమి జరుగుతుందో కాబట్టి మనము కోల్పోయేది లేదు. ఒకవేళ మనము మన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోకపోవడము ద్వారా అసౌకర్యము పొందవచ్చును, కానీ మనము ఓడిపోయింది లేదు. కృష్ణుడి ఇంద్రియాలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించండి; అప్పుడు ప్రతిదీ సరిగ్గా ఉంటుంది