TE/Prabhupada 0094 - మన కర్తవ్యము కృష్ణుని ఉపదేశములను తిరిగి చెప్పడము



Lecture on BG 1.20 -- London, July 17, 1973


అపవిత్రమైన జీవితము వలన భగవంతుని గురించి తెలుసుకోలేరు, భగవంతుని అర్థం చేసుకోలేరు మనము ఈ శ్లోకమును అనేక సార్లు చెప్పాము

yeṣāṁ tv anta-gataṁ pāpaṁ
janānāṁ puṇya-karmaṇām
te dvandva-moha-nirmuktā
bhajante māṁ dṛḍha-vratāḥ
( BG 7.28)

పాపాత్ములు, పాపాత్ములు వారిని అర్థం చేసుకోలేరు. వారు కృష్ణుడు భగవంతుడు కావున, నేను కూడా భగవంతుడిని అని భావిస్తారు. ఆయన ఒక సాధారణ వ్యక్తి, బహుశా చాలా శక్తివంతమైన, చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధ చెందిన వ్యక్తి. ఏమైనప్పటికీ ఆయన ఒక వ్యక్తి. నేను కూడా వ్యక్తిని. అందుచే నేను కూడా భగవంతుడినే అభక్తులు పాపాత్ములు ఈ విధముగా ఆలోచిస్తారు.

తాను భగవంతుడు అని కొందరు ప్రకటించుకున్నతను అత్యంత పాపాత్ముడు అని అర్థము చేసుకోవాలి. మీరు అతని వ్యక్తిగత జీవితం అధ్యయనం చేస్తే అత్యంత పాపాత్ములలో అతడు మొదటి వాడు అని అర్థము చేసుకుంటారు. ఇది పరీక్ష. లేకపోతే నేను భగవంతుడిని అని ఎవరూ ప్రకటించుకోరు. ఇది తప్పుడు ప్రాతినిధ్యము. ఎవరూ చేయరు. ఏ పుణ్యాత్ముడు చేయడు. ఆయనకి తెలుసు నేను ఎవరిని. నేను సాధారణ మానవుడిని. నేను భగవంతుని యొక్క స్థానమును నాది అని ఎలా చెప్పగలను. వారు మూర్ఖుల నందు పేరు పొందుతారు. శ్రీమద్-భాగవతములో ఇలా వివరించారు śva-viḍ-varāhoṣṭra kharaiḥ ( SB 2.3.19) ఆ శ్లోకము ఏమిటి? Uṣṭra-kharaiḥ, saṁstutaḥ puruṣaḥ paśuḥ. ఈ ప్రపంచంలో మనం అనేక మంది గొప్ప వారిని చూస్తాము, గొప్ప వారు అని పిలువబడే వారిని సాధారణ ప్రజలు ఎంతగానో ప్రశంసిస్తారు. కాబట్టి భాగవతము చెపుతుంది భక్తులు కాని వారు ఎవరైనా హరే కృష్ణ మంత్రం జపము చేయని వారు ఆయన మూర్ఖుల అంచనా ప్రకారము, చాలా గొప్ప వ్యక్తి అయి ఉండవచ్చు కానీ ఆయన ఒక జంతువు కంటే ఎక్కువ కాదు. జంతువు. śva-viḍ-varāha-uṣṭra-kharaiḥ. మీరు ఒక గొప్ప వ్యక్తిని గురించి ఈ విధముగా ఎలా చెప్తారు. మీరు ఆయనని ఒక జంతువు అని అంటున్నారు మా కర్తవ్యముని ఎవరూ అభినందించరు. భక్తుడు కానీ ఏ వ్యక్తి అయినా అతడు మూర్ఖుడు. మనము సాధారణంగా చెప్తాము ఇది చాలా కఠినమైన పదము, కానీ మనము దాన్ని ఉపయోగించాలి కృష్ణ భక్తుడు కాని వారిని చూసిన వెంటనే మనము అతడు మూర్ఖుడు అని అర్థము చేసుకుంటాము మనము ఎలా చెబుతాము? ఆయన నా శత్రువు కాదు, కానీ మనము చెప్పాలి ఎందుకంటే ఇది కృష్ణుడిచే చెప్పబడింది.

మనము వాస్తవమునకు కృష్ణ చైతన్యమును కలిగి ఉంటే, అప్పుడు మన కర్తవ్యము కృష్ణుని మాటలను తిరిగి చెప్పటమే. కృష్ణుని ప్రతినిధికీ ప్రతినిధి కాని వారికీ మధ్య తేడా ఏమిటి? కృష్ణుని ప్రతినిధులు కేవలం కృష్ణుని మాటలను యధాతథముగా చెప్తారు ఆయన ప్రతినిధి అవుతాడు. దీనికి చాలా అర్హత అవసరం లేదు. మీరు కేవలం ప్రగాఢ నమ్మకంతో తిరిగి చెప్పండి కృష్ణుడు చెప్తున్నారు సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకమ్ శరణం వ్రజ ( BG 18.66) ఎవరైతే ఈ వాస్తవమును అంగీకరిస్తారో "నేను కృష్ణునికి శరణాగతి పొందితే, నా జీవితము విజయవంతమవుతుంది" ఆయన కృష్ణుని యొక్క ప్రతినిధి. అంతే.

మీకు ఉన్నత విద్య లేదా ఆధునిక విధానములు తెలియవలసిన అవసరము లేదు కేవలం, మీరు కేవలం కృష్ణుడు చెప్పినది అంగీకరిస్తే అర్జునుడు చెప్పిన విధముగా sarvam etaṁ ṛtam manye yad vadasi keśava: ( BG 10.14) నా ప్రియమైన కృష్ణా, కేశవా, మీరు ఏమి చెప్తున్నారో అది ఏ మార్పు లేకుండా, నేను అంగీకరిస్తాను అతడు భక్తుడు. అందువలన అర్జునుడిని భక్తోస్మి అని అంటారు. ఇది భక్తుల కర్తవ్యము నేను కృష్ణుడిని నా వంటి సాధారణ వ్యక్తిగా ఎందుకు పరిగణించాలి? ఇది భక్తుడికీ భక్తుడు కాని వారికీ మధ్య వ్యత్యాసము. భక్తుడుకి తెలుసు, నేను అల్పుడిని. కృష్ణుడిలో ఒక్క చిన్న కణము వంటి వాడిని కృష్ణుడు ఒక వ్యక్తి. నేను కూడా ఒక వ్యక్తిని. కానీ మనము ఆయన శక్తిని నా శక్తిని పరిగణలోకి తీసుకుంటే నేను అత్యంత అల్పుడిని ఇది కృష్ణుని పట్ల భక్తుని అవగాహన.

ఏ కష్టమూ లేదు. మనము నిజాయితీగా ఉండాలి. పాపాత్ములుగా కాదు కానీ ఒక పాపాత్ముడికి ఇది అర్థం కాదు. పాపాత్ముడు చెప్తాడు. "కృష్ణుడు కూడా ఒక వ్యక్తి. నేను కూడా ఒక వ్యక్తిని. నేను ఎందుకు భగవంతుడు కాను? ఆయన మాత్రమే భగవంతుడా? లేదు. నేను కూడా. నేను భగవంతుడిని. నీవు భగవంతుడివి, నీవు భగవంతుడివి, ప్రతి ఒక్కరూ భగవంతుడే ". వివేకానందుడు అన్నాడు ఎందుకు మీరు భగవంతుడు కోసం వెదుకుతున్నారు మీరు వీధిలో చాలా మంది భగవంతుళ్ళు తిరగడము చూడటం లేదా? మీరు చూడండి. ఇది ఆయనకి వున్న భగవంతుడు గురించి అవగాహన. ఇది ఆయనకి భగవంతుని గురించి వున్న అవగాహన. ఆయన ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు "ఆయన ప్రతి ఒక్కరిని భగవంతుడిగా చూస్తున్నాడు."

ఇది బుద్ధిహీనత, ఈ మూర్ఖత్వము ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. భగవంతుడు అంటే ఎవరో తెలియదు, భగవంతుడు అంటే ఏమిటి. భగవంతుని శక్తి ఏమిటి. ఎవరికీ తెలియదు వారు భగవంతునిగా ఒక మూర్ఖుడిని అంగీకరిస్తున్నారు. ఈ రోజుల్లో ఇది జరుగుతోంది. మరో మూర్ఖుడు వచ్చాడు. ఆయన తనను తాను భగవంతుడిగా ప్రకటించుకుంటున్నాడు ఇది చాలా చౌక విషయముగా మారింది. కానీ వారు మెదళ్ళు లేకుండా ఆలోచిస్తూ "నేను భగవంతుడిని అని చెప్పుకుంటున్నారు. వారికి ఏ శక్తి వుంది అని ఆలోచించరు"

కాబట్టి ఇది రహస్యము. ఇది రహస్యము. భక్తుడు కాకుండా భగవంతుని అవగాహన చేసుకొనే రహస్యం అర్థము కాదు. కృష్ణుడు భగవద్గీతలో మనం ఆయనను ఎలా తెలుసుకోవాలి చెప్పారు. Bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi tattvataḥ ( BG 18.55) కేవలం భక్తిభావంతో, చాలా సులభముగా ఆయన చెప్పి ఉండవచ్చు: "యోగ పద్ధతి ద్వారా" లేదా "అత్యుత్తమ యోగ పద్ధతి ద్వారా అని" లేదా "ఒక గొప్ప కర్మిగా మారి, వ్యవహరిస్తూ, ఒక కార్మికుడిగా, అయిననూ అర్థం చేసుకోగలరు." లేదు, ఆయన అలా ఎన్నడూ చెప్పలేదు ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి కర్మిలు, జ్ఞానులు, యోగులు అందరు మూర్ఖులు వారు కృష్ణుని అర్థం చేసుకోలేరు. వారు మూర్ఖులు కర్మిలు తృతీయ శ్రేణి మూర్ఖులు జ్ఞానులు రెండవ తరగతి మూర్ఖులు. మరియు యోగులు మొదటి తరగతి మూర్ఖులు.అంతే