TE/Prabhupada 0097 - నేను కేవలము తపాలా గుమస్తాని
మనము ధృఢంగా ఈ ఉద్యమం ముందుకు తీసుకొని వెళ్ళితే, మీకు శిష్యులు రాకపోయిన కృష్ణడు సంతృప్తి చెందుతాడు. మన కర్తవ్యము కృష్ణడుని సంతృప్తి పరుచుట. దీనిని భక్తి అంటారు. Hṛṣīkena hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate (CC Madhya 19.170). భక్తి అంటే మనము కృష్ణుని సంతృప్తి కోసము అన్ని ఇంద్రియాలను నిమగ్నం చేయాలి. భౌతిక జీవితం అంటే మన ఇంద్రియాల సంతృప్తి కోసము "నేను దీన్ని ఇష్టపడుతున్నాను నేను దీన్ని ఇష్టపడుతున్నాను నేను ఏదో చేయాలనుకుంటున్నాను. నేను, ఏదో పాడాలనుకుంటున్నాను, జపము చేయాలనుకుంటున్నాను, తినాలను కుంటున్నాను, తాకలనుకుంటున్నాను, రుచి చుడాలనుకుంటున్నాను ఇంద్రియాలను ఉపయోగించుకోవటము. ఇది బౌతిక జీవితం. "నేను మృదువైన చర్మమును తాకాలను కుంటున్నాను. నాకు రుచికరమైన ఆహారం తినాలని ఉంది. నాకు ఇటువంటిది వాసన చూడాలని వున్నది.నాకు ఇలా నడవాలని వున్నది. ఇటువంటిదే. వాకింగ్, రుచి, స్పర్శ, లేదా ఏదైనా - కృష్ణడు కోసం తప్పక వినియోగము చేయాలి. అంతే. ఏదో తాకడం బదులు, మనము ఒక భక్తుడు యొక్క పవిత్ర కమలముల వంటి పాదములను తాకితే ,అ స్పర్శ ఉపయోగించబడుతుంది. అర్ధంలేని ఆహారము బదులుగా, మనము కృష్ణుడి ప్రసాదమును తింటే,అది సరిగ్గా ఉంటుంది. మనము ఎదో వాసన చూసే బదులుగా , మనము కృష్ణుడికి అర్పించిన పువ్వుల వాసన చూస్తే. ఏమీ ఆగిపోలేదు మీరు మీ సెక్స్ జీవితాన్ని ఉపయోగించాలి అనుకుంటే మీరు కృష్ణ చేతన్య పిల్లల కోసము ఉపయోగించవచ్చు. ఇది కేవలం పవిత్రము చేస్తుంది. అంతే. ఇదే మొత్తo కార్యక్రమం ఇది ఆపండి అనే ప్రశ్న లేదు. ఆపడము కుదరదు. ఎలా ఆపగలుగుతాము? ఉదాహరణకు నేను ఒక మనిషిని, ఎవరైనా "మీరు తినకూడదు" అ౦టే సాధ్యమేనా. నేను తినాలి. ఆపడము అనే ప్రశ్నే లేదు. ప్రశ్న ఏమిటంటే పవిత్రము చేయుట. ఇతర తత్వము ఏమిటంటే, గట్టిగా అణిచి ఉంచుట శూన్యము చేయుట. వారు చెప్పినట్లుగా, "కోరికలు లేకుండా ఉండుట" ఇది వారి ప్రచారము. కోరిక లేకుండా నేను ఎలా ఉంటాను? కోరిక తప్పని సరిగా ఉంటుంది కానీ నేను కృష్ణడు కోసము కోరుకుంటున్నాను.
ఇది చాలా చక్కని పద్ధతి. ఇతరులు దీనిని తీవ్రంగా తీసుకోక పోయిన లేదా వారు మన తత్వమునకు రాకపోయిన కానీ మీరు ప్రయత్నము చేస్తే ఆది మీ కర్తవ్యము. కృష్ణడు సంతృప్తి చెందుతాడు. మన ఆచార్యులు తృప్తి చెందుతారు, గురు మహారాజ సంతృప్తి చెందుతాడు. yasya prasadad Bhagavat . వారు తృప్తి చెందితే మీ జీవితము పరిపుర్ణమవుతుంది ఇతరులు సంతృప్తి చెందార లేదా అని కాదు. మీ జపము ద్వార మిగతా జనాలు సంతృప్తి చెందార అని కాదు. ఎ ఆందోళన అవసరము లేదు. అతడు సంతృప్తి పడినా లేదా సంతృప్తి చెందకపోయినా కానీ నేను సరైన మార్గంలో జపము చేస్తే గురు పరంపరలోని ఆచార్యులు, సంతృప్తి చెందుతారు. నా కర్తవ్యము పూర్తియింది నేను నా సొంత మార్గమును నేను తయారు చేయకపోతే. నాకు సహాయముగా చాలా మంచి అబ్బాయిలను అమ్మాయిలను కృష్ణుడు పంపించారు. ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నాది. ఈ పవిత్రమైన రోజున కృష్ణుని ఆశీర్వదము తీసుకోండి. దీనిలో నాది ఏమీ లేదు. నేను కేవలం ఒక తపాలా గుమస్తాను మాత్రమే. నేను నా గురు మహారాజ నుండి విన్నది మాత్రమే మీకు ఇస్తున్నాను మీరు అదే విధంగా సేవ చేయండి, మీరు ఆనందంగా ఉంటారు. ప్రపంచము సంతోషంగా ఉంటుంది, కృష్ణుడు ఆనందంగా ఉంటాడు. ప్రతిది ఆనందముగా ఉంటుంది