TE/Prabhupada 0101 - మన ఆరోగ్యకరమైన జీవితము శాశ్వతమైన జీవితమును అనుభవించుట



Press Conference -- April 18, 1974, Hyderabad


అతిధి : ఈ కృష్ణ చైతన్యము యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి?

ప్రభుపాద: అంతిమ లక్ష్యం, ఏమిటంటే అంతిమ లక్ష్యము నేను చెప్పుతాను. ఆత్మ మరియు బౌతిక పదార్ధము రెండు వున్నవి బౌతికము ప్రపంచము ఉన్నాది. ఆధ్యాత్మిక ప్రపంచం కుడా వున్నది Paras tasmāt tu bhāvaḥ anyaḥ avyaktaḥ avyaktāt sanātanaḥ (BG 8.20) ఆధ్యాత్మిక ప్రపంచ శాశ్వతము. భౌతిక ప్రపంచం తాత్కాలికము. మనము ఆత్మ. మనము శాశ్వతము. అందువల్ల మన కర్తవ్యము, ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వెళ్ళడము. మనము బౌతికము ప్రపంచములో చెడు నుండి చెత్తగా లేదా చెత్తగా నుండి మరింత చెత్తగా లేదా మంచిది ఉండటానికి కాదు మన కర్తవ్యము ఇది కాదు. అది ఒక వ్యాధి. మన ఆరోగ్యకరమైన జీవితం శాశ్వతమైన జీవితమును ఆస్వాదించడమే. Yad gatvā na nivartante tad dhāma paramaṁ mama(BG 15.6) చూడండి, మన మానవ జీవితం పరిపూర్ణ దశకు చేరుకోవడానికి వినియోగించాలి. మళ్ళీ ఇంకో మార్చవలసిన భౌతిక శరీరం పొందకుండ ఉండటానికి.ఇది జీవితం యొక్క లక్ష్యం.

అతిధి : పరిపూర్ణత్వం ఈ జీవితంలో సాధ్యపడుతుదా?

ప్రభుపాద: అవును, ఒక క్షణంలో, మీరు అంగీకరిస్తే. కృష్ణడు చెప్పుతున్నారు

sarva-dharmān parityajya
mām ekaṁ śaraṇaṁ vraja
ahaṁ tvāṁ sarva-pāpebhyo
mokṣayiṣyāmi mā śucaḥ
(BG 18.66)

మనము పాపములు చేయుటవలన శరీరము మారుస్తున్నము కానీ మనము కృష్ణడుకి ఆశ్రయముపొంది కృష్ణ చైతన్యమును తీసుకుంటే, వెంటనే మనము ఆధ్యాత్మిక చైతన్యములో వుంటాము

māṁ ca yo 'vyabhicāreṇa
bhakti-yogena sevate
sa guṇān samatītyaitān
brahma-bhūyāya kalpate
(BG 14.26)

వెంటనే మీరు కృష్ణునికి అచంచలమైన భక్తుడిగా మారితే, మీరు వెంటనే ఈ బౌతిక చైతన్యమును అధిగమిస్తారు. Brahma-bhūyāya kalpate. మీరు ఆద్యాత్మిక చైతన్యములో వుంటారు మీరు ఆధ్యాత్మిక చైతన్యములో మరణిస్తే, అప్పుడు మీరు ఆద్యాత్మిక ప్రపంచమునకు వెళ్లుతారు.