TE/Prabhupada 0103 - భక్తుల సంఘము నుండి బయటకి వెళ్ళటానికి ఎప్పుడూ ప్రయత్నించక౦డి



Lecture on CC Adi-lila 7.91-2 -- Vrndavana, March 13, 1974

నరోత్తం దాస్ ఠాకూర్ చెప్పుతారు, జన్మ జన్మలకి భక్తుడు ఎప్పుడు దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళాలని కోరుకోడు. లేదు ఎక్కడికైన, అది పట్టింపు లేదు. అతను కేవలం దేవుడిని కీర్తి౦చాలని కోరుకుంటున్నారు. అది అతని కర్తవ్యము. జపము చేయుట మరియు నృత్యం చేయుట భక్తుల యొక్క కర్తవ్యము కాదు వైకుంఠము లేదా గోలక బృందావనమునకు వెళ్లేందుకు భక్తి యుక్త సేవ చేయుట ఆది కృష్ణుని కోరిక. అతను ఇష్టపడితే అయిన తీసుకు వెళ్ళుతాడు. భాక్తివినోద ఠాకురా చెప్పుతారు icchā yadi tora. Janmāobi yadi more icchā yadi tora, bhakta-gṛhete janma ha-u pa mora. భక్తుడు కేవలము ప్రార్థిస్తాడు ... అతడు కృష్ణుడిని దయచేసి నన్ను వైకుంఠామునకు లేదా గోలోక బృందావనమునకు తేసుకువేళ్ళు అని ప్రార్ధి౦చడు "మీరు నేను మళ్ళీ పుట్ట్టాలి అని భావిస్తే, ఆది సరే. కానీ నా అభ్యర్థన ఏమిటంటే భక్తుని ఇంట్లో నాకు జన్మను ఇవ్వు. అంతే. నేను నిన్ను మర్చిపోను. ఇది మాత్రమే భక్తుని యొక్క ప్రార్థన. ఎందుకంటే ...ఈ అడపిల్లవలె ఆమె వైష్ణవ తల్లిదండ్రులకు పుట్టినది కాబట్టి తను మునుపటి జీవితంలో ఒక వైష్ణవి లేదా వైష్ణవడు అయ్యుంటుంది ఎందుకంటే ఈ అవకాశము ... మన పిల్లలు, వైష్ణవ తల్లితండ్రులకు పుట్టిన వారు చాల అదృష్టవంతులు జీవితం ప్రారంభం నుండి, వారు హరే కృష్ణ మహా-మంత్రమును విoట్టున్నారు. వారు వైష్ణవులతో కలుస్తున్నారు. పాడుతున్నారు, నాట్యము చేస్తున్నారు. అనుకరించిన లేదా వాస్తవముగా, ఆలోచించవలసిన పనిలేదు. వారు చాలా చాలా అదృష్టవంతులైన పిల్లలు. Śucīnāṁ śrīmatāṁ gehe yoga-bhraṣṭaḥ-sañjāyate (BG 6.41). వారు సాధారణ పిల్లలు కాదు. వారు ఎల్లప్పుడూ భక్తుల, సహవాసమును కోరుకుంటున్నారు హరే కృష్ణ జపము చేస్తూ మన దగ్గరకు వస్తున్నరు. వారు సాధారణ పిల్లలు కారు. bhakti-saṅge vāsa. ఇది చాలా మంచి అవకాశము bhakta-saṅge vāsa.


మన కృష్ణ చైతన్య సంఘం, భక్తులు సమాజము ఎప్పుడూ వెళ్ళిపోవటానికి ప్రయత్నించకండి. ఎప్పుడూ వెళ్ళిపోవటానికి ప్రయత్నించకండి తేడాలు ఉండవచ్చు. మీరు సర్దుబాటు చేసుకోవాలి. భక్తుల సమాజములో పాడటము నాట్యము చేయుటకు ఒక గొప్ప ప్రయోజనం, గొప్ప విలువ ఉంది. ఇక్కడ ధృవీకరించబడింది మరియు వైష్ణవులందరూ ధ్రువీకరించారు.


tandera carana-sevi-bhakta-sane vasa
janame janame mora ei abhilasa


అంటే అతను తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. అది ఆతని కోరిక కాదు. కృష్ణుడు కోరుకున్నప్పుడు, కృష్ణుడు నన్ను అనుమతిస్తాడు. అది వేరే విషయం. లేకపోతే, నన్ను ఈ విధముగా వెళ్ళనివండి, భక్తుల సమాజంలో జీవితము, పాడటము మరియు నృత్యము చేయుట, నా కర్తవ్యము ఇది అవసరము. వేరేది ఏమీ అవసరము లేదు. మిగతావన్ని, ఏదైనా కోరుకున్న anyābhilāṣa. Anyābhilāṣitā-śūnyam (Brs. 1.1.11). భక్తుడు భక్తుల సాంగత్యమును తప్ప వేరేది ఏమి కోరుకోకుడదు, నేను భక్తుల సమాజంలో నివసిస్తాను మరియు హరే క్రిష్ణ మంత్రమును జపము చేస్తాను. ఇది మన జీవితము.


ధన్యవాదాలు.