TE/Prabhupada 0105 - ఈ శాస్త్రము గురు శిష్య పరంపరలో అర్థమవుతుంది
Lecture on BG 18.67 -- Ahmedabad, December 10, 1972
భక్తుడు: శ్రీల ప్రభుపాద, మీ తర్వాత ఈ ఉద్యమమును ఎవరు కొనసాగిస్తారు.ఒకరు ఈ ప్రశ్నను అడిగారు.
ప్రభుపాద: ఎవరు అడిగితే, అతను చేస్తాడు. (నవ్వు)
భారతీయుడు: నేను మీ భక్తులను అడగవచ్చా ముందుకు తేసుకువెళ్ళటానికి మీ ప్రణాళిక , మీ తర్వాత మీ ఉద్యమం ముందుకు తీసుకు వెళ్ళడానికి శ్రీల భక్తివేదాంత ప్రభు తర్వాత ఈ ఉద్యమమును ఎవరు ముందుకు తీసుకు వెళ్లుతారు. ఎవరు కృష్ణ చైతన్య జండాను ఊపుతారు హరే కృష్ణ, హరే కృష్ణ.
ప్రభుపాద: ఇది భగవద్గీతలో ప్రస్తావించబడింది
- imaṁ vivasvate yogaṁ
- proktavān aham avyayam
- vivasvān manave prāha
- manur ikṣvākave 'bravīt
- (BG 4.1)
మొదట, కృష్ణడు ఈ కృష్ణ చైతన్యమును సూర్యు దేవునికి ఉపదేశించారు మరియు సూర్య దేవుడు తన . కుమారుడు వివస్వాన్కు ఈ శాస్త్రమును వివరించాడు. మరియు మను తన కుమారుడు ఇక్ష్వకునికి వివరించాడు. Evaṁ paramparā-prāptam imaṁ rājarṣayo viduḥ (BG 4.2). ఈ శాస్త్రము గురు శిష్య పరంపరలో అర్ధమవుతుంది కాబట్టి, మేము గురు పరంపరలో మా గురు మహారాజునుండి ఈ శాస్త్రమును అర్ధము చేసుకున్నాము కాబట్టి నా విద్యార్థులు ఎవరైనా అర్థం చేసుకుంటే, అతను ఈ ఉద్యమమును నడిపిస్తాడు. ఇది పద్ధతి. ఇది కొత్త విషయం కాదు. ఇది పాత విషయం. కేవలం మనము సరిగ్గా ప్రచారము చేయాలి. మనము మన గురువునుంచి విన్న దానిని అందువలన, భగవద్గీత లో, ఇది సిఫార్సు చేయబడినది. ఆచార్య ఉపాసనం.మనము ఒక ఆచార్యుని దగ్గరకు వెళ్ళి Ācāryavān puruṣo veda. కేవలము పాండిత్యము అని పిలువబడేదానితో ఉహాగానాలుచేస్తూ, ఇది సాద్యము కాదు ఇది సాధ్యం కాదు. ఆచార్యుని దగ్గరకు వెళ్ళాలి. ఆచార్యులు పరంపరలో వస్తున్నారు. గురు శిష్య పరంపరలో వస్తున్నారు. అందువలన కృష్ణుడు సిఫార్సు చేస్తున్నాడు. tad viddhi praṇipātena paripraśnena sevayā: (BG 4.34) ఆచార్యుని వద్దకు వెళ్ళి శరణాగతి బావముతో దీనిని అర్ధము చేసుకోవాలి. ఈ మొత్తం విషయం శరణాగతి మీద ఆధారపడి ఉన్నది. Ye yathā māṁ prapadyante. శరణాగతి విధానము. శరణాగతి ఎంత ఉంటుందో, శరణాగతే కృష్ణుని అర్ధము చేసుకొనే విధానము. మనము పూర్తిగా శరణాగతి పొందివుంటే అప్పుడు కృష్ణుడిని పూర్తిగా అర్ధము చేసుకోవచ్చు. మనము పాక్షికంగా శరణాగతి పొందివుంటే అప్పుడు కృష్ణుడిని పాక్షికంగా అర్ధము చేసుకుంటాము కావున ye yathā māṁ prapadyante. ఎంత శరణాగతి పొందాము అన్నది ముఖ్యము ఎవరైతే పూర్తిగా శరణాగతి పొందుతారో వారు ఈ తత్వమును పూర్తిగా అర్ధము చేసుకుంటారు కృష్ణుని కృప వలన ప్రచారము కుడా చేయగలుగుతాడు