TE/Prabhupada 0107 - మరల భౌతిక శరీరమును అంగీకరించ వద్దు
(Redirected from TE/Prabhupada 0107 - మరల బౌతిక శరీరమును అంగీకరించ వద్దు)
Lecture on BG 4.17 -- Bombay, April 6, 1974
ధనవంతుని శరీరమా లేదా పేదవాడి శరీరమ అన్నది కాదు ప్రతిఒక్కరు ముడు రకములైన దుఖములకు లోనవుత్తారు. టైఫాయిడ్ వచ్చినప్పుడు అది విపక్ష చూపదు. ఇది ధనవంతుల శరీరము నేను అతనికి తక్కువ నొప్పి ఇస్తాను. కాదు. టైఫాయిడ్ వచ్చినప్పుడు మీరు ధనవంతులు లేదా పేదవారు అయిన మీరు అదే నొప్పిని అనుభవించాలి మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మీరు అదే నొప్పితో బాధపడ్డారు మీరు రాణి యొక్క గర్భంలో వున్నాలేదా చెప్పులు కుట్టేవాడి భార్య గర్భంలో వున్నా. గర్భములో ప్యాక్ చేయబడిన పరిస్థితిలో కానీ వారికి తెలియదు. Janma-mṛtyu-jarā. చాలా బాధలు ఉన్నాయి. జన్మించే పద్ధతిలో. జననాము, మరణము మరియు వృద్ధాప్యం పద్ధతిలో చాలా బాధలు ఉన్నాయి. ఒక ధనవంతుడు లేదా ఒక నిరుపేద, మనము వృద్ధాప్యములో వున్నప్పుడు, మన పనులను మనము చేయలేము.
అదే విధంగా janma-mṛtyu-jarā-vyādhi (BG 13.9). Jarā, jarā and vyādhi and mṛtyu. మనము ఈ బౌతికము శరీరం యొక్క బాధకరమైన పరిస్థితులను ఎరుగము. శాస్త్రము చెప్పుతున్నాది. మళ్ళీ ఏ బౌతిక శరీరం అంగీకరించ వద్దు" Na sādhu manye: మీరు పదేపదే ఈ బౌతిక శరీరమును తీసుకుంటున్నారు. అది, మంచిది కాదు. Na sādhu manye yata ātmanaḥ. Ātmanaḥ ఆత్మ ఈ బౌతికము శరీరములో చిక్కుకొని ఉన్నాది. Yata ātmano 'yam asann api. తాత్కాలికమే అయినప్పటికీ, నాకు ఈ శరీరం వచ్చింది. Kleśada āsa dehaḥ.
మనము మరొక బౌతిక శరీరం తీసుకొనే బాధాకరమైన పరిస్థితిని ఆపాలి అనుకుంటే మనము కర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలి. ఇది కృష్ణునుడి ప్రతిపాదన. Karmaṇo hy api boddhavyaṁ boddhavyaṁ ca vikarmaṇaḥ. Akarmaṇaś ca boddhavyam. Akarmaṇa ఎటువంటి కర్మ ఫలము లేకపోవుట కర్మ ఫలము. మీరు మంచి పని చేస్తే, దానికి కర్మ ఫలము వస్తుంది. అందమైన శరీరము, మంచి విద్య, మంచి కుటుంబం, ఐశ్వర్యము వస్తాయి ఇది కూడా చాలా మంచిది. మనము మంచిగా వున్నది అని తీసుకోవాలి. మనము స్వర్గ లోకమునకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాము. కానీ వారికీ తెలియదు స్వర్గ లోకములో కుడా janma-mṛtyu-jarā-vyādhi.
అందువల్ల కృష్ణడు మీరు స్వర్గ లోకమునకు వెళ్ళాలి అని ఆ సిఫార్సు చేయుటలేదు. ఆయన చెప్పుతున్నారు ā-brahma-bhuvanāl lokāḥ punar āvartino 'rjuna (BG 8.16). మీరు బ్రహ్మ లోకమునకు వెళ్ళిన, అక్కడ కుడా జన్మ మరియు మృత్యువు వున్నాయి Yad gatvā na nivartante tad dhāma paramaṁ mama (BG 15.6). Yad gatvā na nivartante. కానీ మనకు తెలియదు ఒక దామము ఉందని తెలియదు. మనము ఏదో విధముగా ఆ ధామమునకు వెళ్ళితే అప్పుడు na nivartante, yad gatvā na nivartante tad dhāma paramaṁ mama. మరొక్క చోట చెప్పబడినది tyaktvā dehaṁ punar janma naiti mām eti (BG 4.9). ప్రజల దగ్గర సమాచారాము లేదు కృష్ణుడు, లేదా దేవాదిదేవుడు కృష్ణుడికి సొంత నివాసము వున్నది. ఎవరైనా వెళ్ళ వచ్చు. ఎవరైనా ఎలా వెళ్ళాలి?
- yānti deva-vratā devān
- pitṟn yānti pitṛ-vratāḥ
- bhūtāni yānti bhūtejyā
- yānti mad-yājino 'pi mām
- (BG 9.25)
"ఎవరైనా నన్ను పూజించుటకు, నా కర్తవ్యమునకు, భక్తి యోగాకు అంకితమైతే అతను నా దగ్గరకు వస్తాడు. " మరొక్క చోట కుడా చెప్పబడినది bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi (BG 18.55). మన కర్తవ్యము కృష్ణుడిని అర్ధము చేసుకొనుట Yajñārthe karma. ఇది అకర్మ. ఇక్కడ చెప్పబడినది akarmaṇa, akarmaṇaḥ api boddhavyam, akarmaṇaś ca boddhavyam. అకర్మ అంటే కర్మ ఫలము లేక పోవుట. మనము మన ఇంద్రియాతృప్తి కొరకు పని చేస్తే దానికి కర్మ ఫలము ఉంటుంది ఉదాహరణకు, ఒక సైనికుడు యుద్ధములో శత్రువులను చంపినట్లయితే అతనికి బంగారు పతకాము వస్తుంది అదే సైనికుడు, ఇంటికి వచ్చినప్పుడు, అతను ఒక వ్యక్తిని హత్యచేస్తే, అతనిని ఉరి తీస్తారు. ఎందుకు? ఆయన కోర్టులో చెప్పవచ్చు, "అయ్యా, నేను యుద్ధభూమిలో పోరాటం చేసినప్పుడు, నేను చాలా హత్యలు చేశాను. నాకు బంగారు పతకం వచ్చింది.. మీరు ఇప్పుడు ఎందుకు నాకు ఉరి శిక్ష వేస్తున్నారు "ఎందుకంటే మీరు మీ ఇంద్రియ తృప్తి కోసం చేసినారు కనుక". ఇంతకు ముందు మీరు ప్రభుత్వ అనుమతి మీద చేశారు కనుక.
అందువలన ఏ కర్మ అయిన, మీరు కృష్ణడి సంతృప్తి కోసం చేస్తే, దానిని అకర్మ అంటారు.దానికి కర్మ ఫలము ఉండదు. కానీ మీరు మీ ఇంద్రియ తృప్తి కోసం మీరు ఏదైనా చేస్తే, మీరు దాని ఫలితాన్ని, చెడు లేదా మంచి ఫలితాన్ని అనుభవిస్తారు. అందువలన కృష్ణడు చెప్పుతాడు
- karmaṇo hy api boddhavyaṁ
- boddhavyaṁ ca vikarmaṇaḥ
- akarmaṇaś ca boddhavyaṁ
- gahanā karmaṇo gatiḥ
- (BG 4.17)
మీరు ఏ విధమైన పని చేయాలో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందువలన, మనము గురువు, శాస్త్రము మరియు కృష్ణుడి దగ్గర నుండి సూచనలు తీసుకోవాలి. అప్పుడు మన జీవితంము విజయవంతమవుతుంది. ధన్యవాదాలు. హరే కృష్ణ.