TE/Prabhupada 0120 - అనూహ్యమైన ఆధ్యాత్మిక శక్తి
(Redirected from TE/Prabhupada 0120 - అనూహ్యమైన ఆద్యాత్మిక శక్తీ)
Morning Walk At Cheviot Hills Golf Course -- May 17, 1973, Los Angeles
ప్రభుపాద: మీరు అనువదించారా లేదా?
స్వరూప దామోదర: ఊహించలేము?
ప్రభుపాద: అవును. అనూహ్యమైన లేదా మర్మమైనది.
స్వరాప్ దామోదర: ఆధ్యాత్మిక శక్తి.
ప్రభుపాద: అవును.
స్వరూప దామోదర: నేను శ్రీల ప్రభుపాద వివరించిన, వివిధ అచింత్య-శక్తులను సేకరిస్తున్నాను వేటినైతే మనము గమనిస్తామో.
ప్రభుపాద: ఇక్కడ అనూహ్యమైన శక్తి పని చేస్తున్నది ఈ పొగమంచు పొగమంచును తొలగించగల శక్తి మీకు లేదు. ఇది మీ శక్తికి మించినది. మీరు కొన్ని పదాలు గారడి విద్య తో వివరించవచ్చు ... దారిన వెళ్ళుతున్నవారు: గుడ్ మార్నింగ్.
ప్రభుపాద: శుభోదయం. ... ""ఇటువంటి రసాయనాలు, ఇటువంటి అణువులు, అటువంటివి,"" చాలా విషయాలు ఉన్నాయి. కానీ (నవ్వుతూ) దానిని తీసేసే శక్తి మీకు లేదు.
స్వరూప దామోదర: అవును. పొగమంచు ఎలా ఏర్పడిందో వారు వివరణ ఇస్తారు. వారు దానిని పిలుస్తారు ...
ప్రభుపాద: మీరు చేయగలరు. అంటే, నేను కూడా చేయగలను. ఇది చాలా గొప్ప ప్రతిభ కాదు. కానీ మీకు అది ఎలా ఏర్పడుతుంది తెలిస్తే, అప్పుడు దానిని తటస్థీకరిస్తారు.
స్వరూప దామోదర: మాకు అది ఎలా ఏర్పడుతుందో తెలుసు. మాకు అది ఎలా ఏర్పడుతుందో తెలుసు
ప్రభుపాద: అవును. మీకు తెలుసా, అప్పుడు మీరు కనుగోనండి, తటస్థీకరి౦చే పద్దతిని గతంలో మాదిరిగా, యుద్ధంలో బ్రహ్మా అస్త్రాను వేసినప్పుడు. మరోవైపు అంటే బ్రహ్మా అస్త్రా అంటే అధిక వేడి. వారు ఏదో తయారుచేసి, దానిని నీటిలోకి రూపాంతరం చేశారు . ఎందుకంటే వేడి తరువాత, నీరు ఉండాలి. ఆ శాస్త్రము ఎక్కడ ఉన్నాది?
స్వరూప దామోదర: ఇది కేవలం పాలు లాగా ఉంటుంది. పాలు తెల్లగా కనిపిస్తాయి, కానీ అవి నీరు మాత్రమే. అది నీటిలో ప్రోటీన్లు, కేసిన్లు యొక్క కాంజికాభస్థితి ద్రవము అని పిలుస్తారు అదేవిధంగా, ఈ పొగమంచు, గాలిలో నీరుగా తేలుతుంది అని చెప్పవచ్చు.
ప్రభుపాద: అవును. మీరు కొoత అగ్నిని సృష్టించండి. ఆది వెంటనే దానిని తరిమేస్తుంది. నీటిని మంటలను తరిమేయగలవు . మీరు సృష్టించండి. మీరు చేయలేరు. మీరు కేవలం ఒక బాంబును పేలుస్తారు. కొoత వేడి ఉంటు౦ది, పొగమంచు అంత వెళ్ళిపోతుంది. చేయండి.
కరందర: అది గ్రహంను పేల్చివేస్తుంది. ఆ గ్రహంను పేల్చివేస్తుంది. (నవ్వులు)
ప్రభుపాద: హరే కృష్ణ. నీరుని అగ్ని లేదా గాలి ద్వారా ప్రతిఘటించవచ్చు. ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు చేయండి. ఇది మీ ఆధ్యాత్మిక శక్తి కోసము. మీరు అన్ని అర్ధంలేనివి మాట్లాడవచ్చు, కానీ మీరు దానిపై వ్యతిరేకంగా పని చేయలేరు. అందువలన అది ఆధ్యాత్మిక శక్తి. అదే విధంగా, చాలా విషయాలు ఉన్నాయి. అచింత్య-శక్తీ ఉన్నాది. మీరు ఊహించలేరు. ప్రకృతి యొక్క మార్గం ద్వారా, సూర్యుడు ఉదయించగానే - పొగమంచు ఉండదు. అంత పోతుంది సూర్యుని యొక్క ఉష్ణోగ్రత కొoత పెరిగిన వెంటనే, పొగ మంచు అంత పోతుంది. Nīhāram iva bhāskaraḥ. ఈ ఉదాహరణ భగవద్గీతలో ఇవ్వబడి౦ది. నీహరా, దీనిని నీహరా అని పిలుస్తారు. పొగమంచు సూర్యుడు వచ్చిన వెంటనే పోతుంది అదేవిధంగా, మన నిద్రాణమైన భక్తిని మేల్కొల్పితే అప్పుడు పాపముల యొక్క ప్రతి చర్య అంతా నశిస్తుంది. Nīhāram iva bhāskaraḥ. మీరు సృష్టించ౦డి ... సూర్యుడి ఈ రసాయనము , ఆ రసాయనము యొక్క మిశ్రమం అని మీరు లెక్కించవచ్చు. కేవలం ఒక సూర్యుడుని సృష్టించి దానిని వదల౦డి . కేవలం సైద్ధాంతిక భవిష్యత్తు, మోసము, మాటల గారడీ, ఇది మంచిది కాదు.
స్వరూప దామోదర: పరిశోధన అంటే ఏమిటి? పరిశోధన అంటే అర్థము తెలియని వాటిని అర్థం చేసుకొనుట.
ప్రభుపాద: అవును. పరిశోధన అంటే మీరు ముర్ఖులు అని అంగికరించుట పరిశోధన ఎవరికోసం? ఎవరికి తెలియదు. లేకపోతే, పరిశోధన అనే ప్రశ్న ఎక్కడ ఉన్నది? మీకు తెలియదు. మీరు దానిని అంగీకరించాలి. చాలా ఆద్యాత్మిక శక్తులు ఉన్నాయి. ఆవి ఎలా జరుగుతాయో మీకు తెలియదు. అందువలన, మీరు అనూహ్యమైన శక్తిని అంగీకరించాలి. అనూహ్యమైన శక్తి యొక్క ఈ సూత్రాన్ని అంగీకరించకుండా, దేవుడికి అర్ధం లేదు. ఆ బాల-యోగి దేవుడు అయ్యాడు లాగానే. వీరు మూర్ఖులకు తెలివితక్కువ వారి కోసం ఉన్నారు.". కానీ తెలివైన వారు, అనూహ్యమైన శక్తిని పరీక్షిస్తారు. కృష్ణుడిని (అనూహ్యమైన శక్తిని) దేవుడుగా అంగీకరించినట్లుగానే . మనము రాముడిని (అనూహ్యమైన శక్తిగా) కుడా అంగీకరిస్తాము. చాలా చౌకగా కాదు. ఒక దుష్టుడు వచ్చి, "నేను దేవుడు అవతారం. అని చెప్పగానే" మరొక రాస్కల్ అంగీకరిస్తాడు. ఇది అలా కాదు. "రామకృష్ణడు దేవుడు." మనము అంగీకరించము. మనము అనూహ్యమైన ఆద్యాత్మిక శక్తిని తప్పక చూడాలి. కృష్ణుడిలాగే, చిన్నపిల్లవాడిగా ఉండగానే, కొండను పైకి ఎత్తారు. ఇది అనూహ్యమైన శక్తి. రామచంద్రుడు, అతను స్తంభము లేకుండా ఒక వంతెనను నిర్మించాడు. రాల్లు తేలాయి. మీ ఆలోచన విధానమును మార్చుకోండి. అది అనూహ్యమైన శక్తి. మీరు ఈ అనూహ్యమైన శక్తిని సర్దుబాటు చేయలేరు, వాటిని వివరించినప్పుడు, ", ఇవి అన్ని కథలు." అని మీరు చెప్పుతారు ఏమని పిలుస్తారు? మిథాలజీ. కానీ ఈ గొప్ప, గొప్ప ఋషులు, వాల్మీకి వ్యాసదేవుడు, ఇతర ఆచార్యులు, వారు కేవలం పురాణలు వ్రాయడనికి వారి సమయం వృధా చేసుకున్నారా? అటువంటి జ్ఞానము తెలిసిన పండితులు పురాణశాస్త్రముగా వాటిని వారు అర్థం చేసుకోలేదు. వారు వాటిని వాస్తవంగా అంగీకరించారు. అడవుల్లో ఒక అగ్ని పుట్టింది. కృష్ణుడి స్నేహితులoదరు. గోప బాలురు , వారు కలత చెందారు. వారు కృష్ణుని వైపు చూడటం ప్రారంభించారు: "కృష్ణా, మనం ఏమి చెయ్యాలి?" "సరే అని" అతను మొత్తం అగ్నిని మ్రిoగివేసాడు. ఇది అనూహ్యమైన ఆద్యాత్మిక శక్తి. ఇది దేవుడు. Aiśvaryasya samagrasya vīryasya yaśasaḥ śriyaḥ (Viṣṇu Purāṇa 6.5.47). ఈ ఆరు సంపదలు దేవుడిలో వున్నాయి. అనూహ్యమైన శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తీ, మనకు కూడా ఉన్నాయి. చాలా చిన్న పరిమాణంలో. అనేక విషయాలు మన శరీరాము లోపల జరుగుతున్నాయి. మనము వివరించలేము. అదే ఉదాహరణ. నా గోర్లు సరిగ్గా ఒకే రూపంలో వస్తున్నాయి. వ్యాధి బారిన పడినప్పటికీ, మళ్ళీ వస్తున్నాయి. లోపల ఏ యంత్రాలు వున్నాయో నాకు తెలియదు గోర్లు అదే స్థానములో ఖచ్చితంగా వస్తున్నాయి ప్రతిదీ సరిగ్గా సరిపోతుంది. అది నా శరీరం నుండి వస్తోంది. కావున ఇది ఆధ్యాత్మిక శక్తి. అది నాకు , డాక్టర్లకు, ప్రతి ఒక్కరికి ఆద్యాత్మిక శక్తీ. వారు వివరించలేరు