TE/Prabhupada 0123 - బలవంతముగా శరణాగతి పొందునట్లు చేయుట. ఇది ప్రత్యేకమైన అనుగ్రహము



Lecture-Day after Sri Gaura-Purnima -- Hawaii, March 5, 1969

భక్తుడు: మనకు బంధనము ఉండుట కారణముగా మనల్ని బలవంతముగా కృష్ణడికి శరణాగతి పొందేటట్లు చేయమని కృష్ణుడిని ? అభ్యర్థించవచ్చా?

ప్రభుపాద: అవును, మీరు అభ్యర్థించవచ్చు. అయిన కొన్నిసార్లు బలవంతంగా శరణాగతి పొందేటట్లు చేస్తాడు. కృష్ణుడు మీమ్మల్ని అటువంటి పరిస్థితులలో ఎక్కువగా పెడతారు. ఆశ్రయించటము తప్ప మరే ఇతర మార్గం లేకుండా చేస్తారు అవును. ఆది ప్రత్యేకమైన అనుగ్రహము ఆది ప్రత్యేకమైన అనుగ్రహము అవును. నా ఆధ్యాత్మిక గురువు నన్ను ప్రచారము చేయవలెనని కోరుకున్నారు కాని నాకు ఇష్టం లేదు, కానీ అయిన నన్ను బలవంతం చేశారు. అవును. అది నా ఆచరణాత్మకమైన అనుభవము. నాకు సన్యాసా ఆశ్రమాన్నితీసుకొని ప్రచారము చేయవలెనని కోరిక నాకు లేదు, కానీ నా ఆధ్యాత్మిక గురువు నేను ప్రచారము చేయవలెనని కోరుకున్నారు. నేను అంతగా ఇష్టపడలేదు, కానీ అయిన నన్ను బలవంతము చేశారు. అది కుడా జరిగినది. అది ప్రత్యేక అనుగ్రహము అయిన నన్ను బలవంతము చేసినప్పుడు, ఆ సమయంలో, నేను "ఇది ఏమిటి? ఏమిటి నేను కొంచెం తప్పు చేస్తునానా లేదా ఇది ఏమిటి? నేను సందేహించాను. కానీ కొంత కాలము తర్వాత, అది నాకు అర్ధమైనది. అది నా పైన చూపించినబడిన గొప్ప అనుగ్రహము అని నేను గ్రహించాను. మీరు చూడoడి? ఎవరినైనా కృష్ణుడు బలవంతముగా ఆశ్రయము పొందేటట్లు చేసుకుంటే , ఆది వారికి కృష్ణుడు చేస్తున్న గొప్ప ఉపకారము కానీ సాధారణంగా, కృష్ణుడు అలా చేయడు. కానీ అతను కృష్ణుడి సేవలో చాలా నిజాయితీగా ఉన్న వ్యక్తికి అలా చేస్తాడు కానీ అదే సమయంలో అతననికి భౌతిక ఆనందం కోసం స్వల్ప కోరిక ఉన్నప్పుడు ఆ సందర్భంలో కృష్ణుడు చేస్తాడు, "ఆ తెలివితక్కువ వ్యక్తికి తెలియదు" ఆ బౌతిక సౌకర్యం అతనినకి ఎప్పటికి సంతోషము ఇవ్వదు, అతడు నిజాయితిగా నా అనుగ్రహాన్ని కోరుకొనుచున్నాడు. అందువలన అతను తెలివితక్కువ వాడు. అందువల్ల అతని భౌతిక ఆనందం కోసం ఉన్న కొద్ది వనరులను, కృష్ణుడు విచ్ఛిన్నం చేస్తాడు అప్పుడు అతనికి ఇతర ప్రత్యామ్నాయం లేదు నాకు శరణు పొందటము కంటే. ఇది భగవద్గీత, శ్రీమద్-భాగవతములో. చెప్పబడింది. Yasyāham anughṛnāmi hariṣye tad-dhanaṁ sanaiḥ. కృష్ణుడు ఇలా అన్నాడు, "నేను ఎవరి పట్ల అయిన ప్రత్యేకంగా దయ చుపిస్తే" అప్పుడు నేను అతనిని పేదవాడిని చేస్తాను. నేను అతను ఆనందము పొందే అన్ని మార్గాలను తీసివేస్తాను మీరు చూడ౦డి? ఇది శ్రీమద్-భాగావతం లో చెప్పబడింది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఎక్కువ డబ్బును వ్యాపారము ద్వారా కానీ, సేవ ద్వారా కానీ, ఈ విధంగా లేదా ఆ విధంగా సంపాదించడం ద్వారా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రత్యేక సందర్భాలలో కృష్ణుడు ఆతని వ్యాపారాన్ని లేదా సేవను వైఫల్యం చేస్తాడు. మీకు నచ్చుతుందా? (నవ్వుతూ) ఆ సమయంలో అతను కృష్ణుడికి శరణాగతి పొందుట బదులు మరొక ప్రత్యామ్నాయం ఉండదు. మీరే చూడండి? కానీ కొన్నిసార్లు, మన వ్యాపార ప్రయత్నంలో లేదా సంపాదించే ప్రయత్నంలో విజయవంతం కానప్పుడు మనం చాల బాధ పడుతాము, కృష్ణుడు నాపై చాలా క్రూరంగా ఉన్నాడు, నేను దీనిని నమ్మను" కానీ అది కృష్ణుడి అనుగ్రహం, ప్రత్యెక అనుగ్రహం. మీరు ఆలా అర్థం చేసుకోవాలి.