TE/Prabhupada 0124 - మనము ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశాలను మన జీవితానందముగా భావించవలెను
అతను తన జీవితంలో నైష్టిక బ్రహ్మచారిగా ఉన్నారు. భక్తివినోద ఠాకురాకు చాలా మంది కుమారులు ఉన్నారు, అతను ఐదవ కుమారుడు. అతని సోదరులలో కొందరు వివాహం చేసుకోలేదు. నా గురు మహరాజ, అతను కూడా వివాహం చేసుకోలేదు. బాల్యం నుండి అతను నైష్టిక బ్రహ్మచారి, భక్తి సిద్ధా౦తా సరస్వతి గోస్వామి మహారాజా. ఈ ఉద్యమం, ప్రపంచ వ్యాప్త ఉద్యమంగా మొదలు పెట్టడము కోసం అయిన చాలా తీవ్రమైన తపస్సులు చేశారు. అది అయిన లక్ష్యం. భక్తివినోద ఠాకురా దీనిని చేయాలని కోరుకున్నారు. అతను, 1896, భక్తివినోద ఠాకురా ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును మొదలుపెట్టాలని కోరుకున్నారు శ్రీ చైతన్య మహాప్రభు, అయిన జీవిత బోధనలు పుస్తకం పంపడం ద్వారా అదృష్టవశాత్తూ, ఆ సంవత్సరం నా జన్మదీన సంవత్సరం, కృష్ణుని ఏర్పాటు ద్వారా, మేము కలుసుకున్నాము నేను వేరొక కుటుంబములో జన్మించాను, నా గురు మహరాజా వేరే కుటుంబంలో జన్మించారు. నేను అయిన రక్షణకు వస్తానని ఎవరికి తెలుసు? నేను అమెరికాకు వస్తానని ఎవరికి తెలుసు? మీరు అమెరికన్ అబ్బాయిలు నా దగ్గరకు వస్తారని ఎవరికీ తెలుసు? ఇవి అన్ని కృష్ణుడి ఏర్పాట్లు. విషయాలు ఎలా జరుగుతున్నాయో మానకు అర్ధం కాదు.
1936 లో ... నేడు తొమ్మిది డిసెంబరు 1968, ముప్పై రెండు సంవత్సరాల క్రితం అంటే. బొంబాయిలో నేను కొ౦త వ్యాపారాము చేస్తున్నాను. అకస్మాత్తుగా, బహుశా ఈ తేదీన, 9 లేదా 10 డిసెంబరు మధ్య. ఆ సమయంలో, గురు మహారాజ కొద్దిగా అనారోగ్యం పాలయ్యారు అతను సముద్రతీరంలో జగన్నాథ పురి వద్ద ఉన్నారు. నేను అయినకు లేఖ వ్రాసాను, నా ప్రియమైన గురు మహారాజ, మీ ఇతర శిష్యులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వారు మీకు నేరుగా సేవలను అందిస్తున్నారు. నేను గృహస్థుడిని. నేను మీతో నివసించలేను, నీకు మీకు చక్కగా సేవ చేయలేను. నాకు తెలియడములేదు. నేను మిమల్ని ఎలా సేవిస్తాను? కేవలం ఒక ఆలోచన, నేను అయినను ఎలా సేవించాలి అని ఆలోచిస్తూన్నాను. "నేను ఆయినకు తీవ్రంగా సేవ ఎలా చేయవచ్చు?" జవాబు 1936, డిసెంబర్ 13 తేదీన వచ్చింది. ఆ లేఖలో అయిన ఇలా వ్రాశారు, "నా ప్రియమైన , మీ లేఖని అందుకోవటానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా ఆలోచన మీరు మా ఉద్యమాన్ని ఇంగ్లీష్లోకి తీసుకు వెళ్ళాటానికి ప్రయత్ని౦చండి. అని ఆయన వ్రాశారు. అది మీకు, మీకు సహాయం చేసే వారికీ ఉపయోగకరముగా ఉంటుంది. నేను కోరుకుంటాను ... అది అయిన ఉపదేశము.
ఆపై 1936 లో, 31 డిసెంబర్ న - దీని అర్ధము ఈ లేఖను రాసిన 15 రోజుల తరువాత తను పరమపదించారు. కానీ నా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశమును చాలా తీవ్రంగా తీసుకున్నాను. కానీ నేను అలాంటి ఇలాంటి విషయములు చేస్తానని నేను అనుకోలేదు. నేను ఆ సమయంలో గృహస్థుడుని. కానీ ఇది కృష్ణుని యొక్క ఏర్పాటు. మనము ఖచ్చితంగా ఆధ్యాత్మిక గురువుకు సేవ చేయటకు ప్రయత్నిస్తు ఉంటే, అతని ఆదేశాలను పాటిస్తువుంటే, అప్పుడు కృష్ణడు మానకు అన్ని సౌకర్యాలు ఇస్తారు అది రహస్యము ఎటువంటి అవకాశం లేనప్పటికీ, నేను ఎన్నడూ ఆలోచించలేదు, కానీ నేను చాలా తీవ్రంగా తీసుకున్నను భగవద్గీత మీద విశ్వనాథ చక్రవర్తి ఠాకురా వ్యాఖ్యానం చదువుతూ. భగవద్గీత శ్లోకములో vyavasāyātmikā-buddhir ekeha kuru-nandana (BG 2.41), ఆ శ్లోకము యొక్క భాష్యములో విశ్వనాథ చక్రవర్తి ఠాకురా తన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు మన ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను మన జీవిత లక్ష్యముగా తీసుకోవాలి. మనము ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దిష్ట ఆదేశమును పాటించుటకు ప్రయత్నము చేయాలి చాలా తీవ్రముగా, మన వ్యక్తిగత ప్రయోజనం లేదా నష్టము కోసం చూసుకోకుండా.
నేను ఆ స్పూర్తితో కొంచెం ప్రయత్నించాను. అందువల్ల ఆయన నాకు సేవ చేయటానికి అన్ని సౌకర్యాలను ఇచ్చారు. విషయములు ఈ దశకు వచ్చాయి, ఈ వృద్ధాప్యంలో నేను మీ దేశానికి వచ్చాను, మీరు ఈ ఉద్యమాన్ని తీవ్రంగా అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనము కొన్ని పుస్తకాలు కలిగి వున్నాము. ఈ ఉద్యమమునకు కొంత స్థానబలం కలిగింది. నా ఆధ్యాత్మిక గురువు పరమపదించిన సందర్భంగా, నేను తన ఇష్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అదేవిధంగా, అదే ఉత్తర్వును అమలు చేయమని నేను మిమల్ని కోరుతున్నాను. నేను ఒక వృద్ధుడను, ఏ సమయంలో అయినా నేను కూడా పరమపదించవచ్చు. అది ప్రకృతి చట్టం. ఎవరూ దానిని మార్చలేరు ఇది చాలా ఆశ్చర్యకరమైనది కాదు, కానీ నా గురు మహారాజు పరమపదించిన ఈ పవిత్ర రోజున మీకు నా విజ్ఞప్తి చేస్తున్నాను కనీసం కొంత వరకు మీరు కృష్ణ చైతన్య ఉద్యమ సారాన్ని అర్థం చేసుకున్నారు. మీరు దాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నము చేయలి. ప్రజలు ఈ చైతన్యం కోసము బాధపడుతున్నారు.