TE/Prabhupada 0127 - ఒక గొప్ప సంస్థ వెర్రి విధానాల వలన పతనమవుతుంది
Lecture on SB 1.2.11 -- Vrndavana, October 22, 1972
అప్పుడు ... నా గురు మహరాజా చెప్పేవారు "కృష్ణుని చూడడానికి మీరు ప్రయత్నించవద్దు; ఏదైనా చేయండి కృష్ణుడు మిమ్మల్ని చూడడానికి. ఈ విధముగా మనము ఉండవలెను. మీరు కృష్ణుని దృష్టిని ఆకర్షించలేకపోతే, yat kāruṇya-katākṣa-vaibhavavatām, katākṣa-vaibhavavatām... ప్రభొధనoదా సరస్వతి చెపుతున్నారు, మీరు ఏదో విధముగా మీరు కృష్ణుడి దృష్టిని ఆకర్షించగలిగితే, మీ జీవితం విజయవంతమైంది. వెంటనే. మీరు ఎలా ఆకర్షిస్తారు? Bhaktyā mām abhijānāti (BG 18.55). కేవలం కృష్ణుడిని సేవించడం ద్వారా. ఆధ్యాత్మిక గురువు ఆదేశించిన, సేవను తీసుకోండి, కృష్ణుడి సేవను తీసుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మిక గురువు కృష్ణుని ప్రతినిధి. మనము నేరుగా కృష్ణని సమీపించలేము. Yasya prasādād bhagavat-prasādaḥ. మీరు కృష్ణుడి ప్రతినిధిని ప్రామాణిక ఆధ్యాత్మిక గురువును కలిగి ఉంటే, ఇది చాలా కష్టం కాదు. అందరూ కృష్ణుడి ప్రతినిధి అవ్వవచ్చు. ఎలా? మీరు ఎటువంటి కల్తీ లేకుండా కృష్ణుని సందేశాన్ని పాటిస్తే. అంతే.
చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా āmāra ājñāya guru hañā (CC Madhya 7.128). "మీరు నా ఆదేశము ప్రకారము ఒక ఆధ్యాత్మిక గురువు అవ్వండి." మీరు చైతన్య మహాప్రభు, కృష్ణుడి ఆదేశాన్ని చేపట్టితే, అప్పుడు మీరు గురువు అవుతారు. Āmāra ājñāya guru hañā. దురదృష్టవశాత్తు, మనము ఆచార్యుల ఆదేశములను పాటించము మనము మన సొంత మార్గాలను తయారు చేస్తాము. ఒక గొప్ప సంస్థ వెర్రి మార్గాల ద్వారా ఎలా నష్ట పోయిందో మాకు ఆచరణాత్మక అనుభవం వున్నది. ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను పాటించకుండా, వారు ఏదో తయారు చేయటము వలన సంస్థ మొత్తము పతనమైనది. అందువల్ల విశ్వనాధ చక్రవర్తి ఠాకురా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాల మీద చాలా ఉద్ఘాటించారు. Vyavasāyātmikā buddhir ekeha kuru-nandana (BG 2.41). మీరు ఆధ్యాత్మిక గురువు యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉంటే, అప్పుడు, మీ స్వంత సౌలభ్యం లేదా అసౌకర్యానికి శ్రద్ధ లేకుండా వుంటే, అప్పుడు మీరు సంపూర్ణంగా ఉంటారు.
- yasya deve parā bhaktir
- yathā deve tathā gurau
- tasyaite kathitā hy arthāḥ
- prakāśante mahātmanaḥ
- (ŚU 6.23)
ఇది ప్రామానికులు అందరి ద్వారా నిర్ధారించబడింది. మనము విధేయతతో కృష్ణుడి ప్రామాణికమైన ప్రతినిధి ఆజ్ఞలను నిర్వర్తించాలి. అప్పుడు మన జీవితం విజయవంతమవుతుంది. మనము నిజంగా కృష్ణుడిని అర్ధం చేసుకోవచ్చు. Vadanti tat tattva-vidas tattvam (SB 1.2.11). మనము తత్వా-విత్తుల నుండి వినవలసి ఉంటుంది, పండితులు అని పిలవబడే వారి నుండి , రాజకీయ నాయకుల నుండి కాదు. సత్యము తెలిసిన వ్యక్తి నుండి, మీరు వినవలసి ఉంటుంది. మీరు ఆ సూత్రానికి కట్టుబడి ఉంటే, అప్పుడు మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. చాలా ధన్యవాదాలు.