TE/Prabhupada 0133 - నా సూచనలను పాటించే ఒక్క శిష్యుడు కావలెను



Arrival Lecture -- San Francisco, July 15, 1975

కొన్నిసార్లు ప్రజలు నేను ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పని చేశానని చాలా గౌరవము ఇస్తారు కానీ నేను అద్భుతమైన వ్యక్తి అని నాకు తెలియదు. కానీ నాకు ఒక విషయం తెలుసు, నేను కృష్ణుడు మాట్లాడినదే మాట్లాడుతున్నాను. అంతే. నేను ఏదైనా అదనంగా, మార్పు చేయటం లేదు. నేను భగవద్గీతని యధాతదముగా ప్రచారము చేస్తున్నాను. నేను తీసుకునే క్రెడిట్ ఇది, నేను అర్ధంలేని మార్పులు చేయటం లేదు. ఆచరణాత్మకంగా అది విజయవంతమైంది అని నేను చూస్తున్నాను. నేను చాలా మంది యూరోపియన్లు అమెరికన్లకు లంచాలు ఇవ్వలేదు. నేను పేద భారతీయుడుని. నలభై రూపాయలతో నేను అమెరికాకు వచ్చాను, ఇప్పుడు నలభై కోట్లు కలిగి ఉన్నాను. ఎలాంటి మాయాజాలం లేదు. నీవు వెనుకవైపు వెళ్ళవచ్చు. నీవు నిద్రపోతున్నావు. ఇది రహస్యం, మీరు నిజాయితీగా గురువు కావాలనుకుంటే ... మీరు మోసం చేయాలనుకుంటే, అది మరొక విషయం. చాలా మంది మోసగాళ్లు ఉన్నాయి. ప్రజలు కూడా మోసం పోవాలని కోరుకుంటున్నారు. మనము చెప్పినట్లుగా, "నా శిష్యుడు కావాలని మీరు కోరుకుంటే, మీరు నాలుగు విషయాలను విడిచిపెట్టాలి: ఎటువంటి అక్రమ లైంగికం ఉండకూడదు, ఏ మత్తు తేసుకోకుడదు (టీ, ధూమపానం, సిగరెట్ త్రాగడానికి వరకు), ఏ మాంసం తినకూడదు జూదం అడకుడదు" వారు నన్ను విమర్శించారు, "స్వామిజీ చాలా సంప్రదాయవాది." అని "మీకు నచ్చినది అన్ని, అర్ధం లేని చెత్త అంతా చేసుకోవచ్చు" అని నేను చెప్పి ఉంటే మీరు కేవలం ఈ మంత్రాన్ని తీసుకొని నాకు 125 డాలర్లు ఇవండి, అంటే వారు ఇష్టపడతారు. ఎందుకంటే అమెరికాలో, 125 డాలర్లు పెద్ద మొత్తము కాదు. ఏ వ్యక్తి అయిన వెంటనే చెల్లించవచ్చు. నేను ఆ విధంగా మోసం చేసినట్లయితే నేను మిలియన్ల డాలర్లను సేకరించి ఉండేవాడిని. కానీ నాకు ఇది ఇష్టం లేదు. నాకు నా ఉపదేశమును అనుసరిస్తున్న ఒక విద్యార్థి కావాలి. నాకు లక్షలు అవసరము లేదు. Ekaś candras tamo hanti na ca tara-sahasrasaḥ. ఆకాశంలో ఒక్క చంద్రుడు ఉంటే చాలు, అది ఇచ్చే వెలుగు సరిపోతుంది. లక్షలాది నక్షత్రాలు అవసరం లేదు. నా స్థానం ఏమిటంటే కనీసం ఒక శిష్యుడు స్వచ్ఛమైన భక్తుడు అవాలని నేను కోరుకుంటాను. నిజమే, చాలామంది నిష్కపటమైన, స్వచ్ఛమైన భక్తులు నాకు లభించారు. నా అదృష్టం. నేను ఒకడిన్ని మాత్రమే కనుగొన్న కూడా నేను సంతృప్తి చెందేవాడిని. లక్షలాది నక్షత్రాలు అని పిలవబడే వాటి అవసరం లేదు.

అందువలన పద్ధతి ఉంది, అది చాలా సులభం, భగవద్గీతలోని అన్ని సూచనలను మనము అర్థం చేసుకొని, అప్పుడు శ్రీమద్-భాగావతం అధ్యయనం చేస్తే ... లేదా మీరు అధ్యయనం చేయకపోయినా, చైతన్య మహాప్రభు చాలా సులభమైన పద్ధతి ఇచ్చారు. అది కూడా శాస్త్రములో ఇవ్వబడినది:


harer nāma harer nāma harer nāmaiva kevalam
kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā
(CC Adi 17.21)


వేద సాహిత్యం నేర్చుకోవాలనుకుంటే, అది చాలా మంచిది. అది గట్టి ప్రారంభము. మనకు ఇప్పటికే యాభై పుస్తకాలు వున్నాయి మీరు చదువoడి. తత్వశాస్త్రం, ధర్మము, సామాజిక శాస్త్రంలో చాలా గొప్ప పండితుడు అవ్వండి. ప్రతిదీ శ్రీమద్-భాగావతంలో ఉంది, రాజకీయాలు కూడా ఉన్నాయి. మీరు పరిపూర్ణమైన జ్ఞానముతో పరిపూర్ణ మానవుడివి అవుతారు మీకు సమయం లేదని మీరు అనుకుంటే, మీరు చాలా మంచి పండితుడు కాదు, మీరు ఈ పుస్తకాలను చదవలేరు అని అనుకుంటే, హరే కృష్ణ మంత్రమును జపము చేయండి. ఏ విధంగానైనా మీరు పరిపూర్ణమౌతారు, రెండువిధములుగా లేదా కనీసం ఒక విధముగా ద్వారానైనా. మీరు పుస్తకాలను చదవలేకపోతే, హరే కృష్ణ మంత్రమును జపము చేయండి. మీరు పరిపూర్ణము అవుతారు. మీరు పుస్తకాలు చదివి హరే కృష్ణ మంత్రమును జపము చేస్తే, ఆది చాలా బాగుంటుంది. కానీ ఎటువంటి హాని లేదు మీరు హరే కృష్ణ మహా మంత్రాన్ని జపము చేస్తూ వుంటే, మీరు పుస్తకాలను చదవలేకపోతే, ఎటువంటి హాని లేదు. ఎటువంటి నష్టం లేదు. ఆ జపము సరిపోతుంది. కానీ మీరు చదివినట్లయితే, ప్రత్యర్దుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. అది మీకు ప్రచారము చేయడానికి సహాయపడుతు౦ది. ప్రచారములో మీరు చాలా ప్రశ్నలకు సమాధానమివ్వాల్సి వు౦టుంది , మీరు చాలా మంది ప్రత్యర్ధులను కలుస్తారు మీ పుస్తకాలు, వేద సాహిత్యం చదవడం ద్వారా మీరు బలంగా ఉంటే, అప్పుడు మీరు కృష్ణకు చాలా ఇష్టమైనవాడిగా ఉంటారు కృష్ణుడు చెప్పారు:

na ca tasmāt manuṣyeṣu
kaścit me priya-kṛttamaḥ
(BG 18.69)
ya imaṁ paramaṁ guhyaṁ
mad-bhakteṣu abhidhāsyati
(BG 18.68)


ఈ రహస్య జ్ఞానమును ఎవరైనా ఉపదేశిస్తే: "sarva-dharman parityajya mam ekam saranam vraja (BG 18.66)"అయిన ఈ సందేశాన్ని ప్రపంచానికి ప్రచారముచేయటానికి సమర్థవంతముగా ఉంటే, వెంటనే అయిన భగవంతుని చేత చాలా, చాలా గుర్తింపు పొందుతాడు.