TE/Prabhupada 0141 - తల్లి పాలను ఇస్తుంది. మీరు తల్లిని చంపుతున్నారు



Garden Conversation -- June 14, 1976, Detroit

జయ అద్వైత: కళాశాల కార్యక్రమాలలో, సత్స్వరూపా మహారాజ నేను వర్ణాశ్రమ ధర్మ మీద చాలా తరగతులను ఇస్తున్నాము. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ హిందూ కుల పద్ధతి గురించి ఏoతో కొంత తెలుసుకోవాలనుకుంటున్నారు, వారు దాని గురించి మా తరగతులకు వస్తారు. ఆ తరువాత మనము వర్ణాశ్రమ ధర్మము గురించి మాట్లాడుతున్నాము. వారు దానిని ఓడించటానికి వారి దగ్గర ఏమాత్రం ఆలోచన లేదు. వారు ఎల్లప్పుడూ, కొంత బలహీన వాదనలు చేస్తారు, కానీ వారి దగ్గర ఏ మెరుగైన పద్ధతి లేదు.

ప్రభుపాద: వారి వాదన ఏమిటి? జయ అద్వైత: అరుదుగా ... బాగా, వారు కొంత ఆలోచన కలిగి ఉన్నారు, వారు ఏ విధమైన సామాజిక చలనము లేదని వాదిస్తారు, ఎందుకనగా వారికి కొన్ని శరీర భావాలున్నాయి. కులాలు పుట్టిన దాని బట్టి అని . ప్రభుపాద: కాదు, అది వాస్తవం కాదు. జయ అద్వైత: కాదు ప్రభుపాద: అర్హత ఏమిటంటే. జయ అద్వైత: మనము వాస్తవ పరిస్థితిని ప్రచారము చేసినప్పుడు, వారు అక్కడే కూర్చుని ఉన్నారు, వారు వాదించాటము లేదు. అప్పుడు మనము వారి పద్ధతిను సవాలు చేస్తాము, "మీ సమాజం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? దాని లక్ష్యం ఏమిటి?" వారు ఏమీ చెప్పలేరు. ప్రభుపాద: కార్యకలాపాలను విభజించకపోతే, ఏదీ సరిగ్గా చేయలేము. శరీర భాగంలో సహజ విభజన ఉంది - తల, చేతులు, ఉదరము కాళ్ళు. అదేవిధంగా, సామాజిక సమాజములో కూడా అధికార్లు ఉండాలి, తెలివైన వ్యక్తులు, బ్రాహ్మణలు ఉండాలి. అప్పుడు ప్రతిదీ సజావుగా సాగుతుంది. ప్రస్తుతం, మనుషులలో తెలివైన వ్యక్తులు లేరు. అoదరు కార్మికులే, కార్మిక వ్యక్తుల వర్గము, నాల్గవ తరగతి. మొదటి తరగతి, రెండవ తరగతి లేరు. అందువలన సమాజం అస్తవ్యస్తమైన స్థితిలో ఉంది. మెదడు లేదు. జయ అద్వైత: వారి ఏకైక అభ్యంతరం, బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్తా, సన్యాస గురించి చెప్పినప్పుడు అప్పుడు వారు సహజముగా ప్రతికూలంగా మరుతారు. మనము ఇంద్రియ తృప్తికి వ్యతిరేకము అని వారు అర్థం చేసుకున్నారు ప్రభుపాద: అవును. ఇంద్రియ తృప్తి జంతు నాగరికత. ఇంద్రియ తృప్తి నియంత్రనే మానవ సమాజము. ఇంద్రియ తృప్తి మానవ సమాజం కాదు. ఇంద్రియ తృప్తి మానవ నాగరికత కాదు. లేదు. వారికి తెలియదు. వారి ముఖ్య ఉద్దేశ్యము ఇంద్రియ తృప్తి. అది లోపము. వారు ఒక జంతు నాగరికతను మానవ నాగరికతగా నడుపుతున్నారు. అది లోపము. ఇంద్రియ తృప్తి జంతు నాగరికత. వాస్తవానికి వారు జంతువులు. వారు తమ స్వంత బిడ్డను చంపితే, అది జంతువు. కేవలము పిల్లులు, కుక్కలు వంటి, వారు వారి సొంత పిల్లలను చంపతారు. అది ఏమిటి? ఆది జంతువు. ఎవరో చెపుతున్నారు ఆ పిల్లవాడిని వదిలేసినా సామాను దగ్గర వదిలేసారు అని? హరి-సౌరి: వదిలేసిన సామాన్ల లాకర్స్ దగ్గర. త్రివిక్రమ మహారాజ, జపాన్లో. అయిన ఇరవై వేల మంది పిల్లలు పైన వారు వారిని వదిలేసిన-సామాను లాకర్లో ఉంచి వారిని వదిలివేస్తారు. ప్రభుపాద: బస్ స్టేషన్? రైల్వే స్టేషన్? సామాను వదిలివేయండి. అక్కడ ఉంచండి దాన్ని లాక్ చేయండి, తిరిగి రాకండి. చెడ్డు వాసన వస్తున్నప్పుడు .... ఇది జరగబోతోంది. ఇది కేవలం జంతు నాగరికత. ఆవు నుండి చివరి పాల చుక్కను తీసుకొని వెంటనే కబేళాకు కసాయి వాని దగ్గరకు పంపించడము. వారు అలా చేస్తున్నారు. కబేళాకు పంపించేముందు, వారు ఆవు నుండి చివరి పాల చుక్కను తీసుకుంటారు. వెంటనే చంపడం. మీకు పాలు అవసరం, మీరు చాలా పాలు తీసుకుoటున్నారు, పాలు లేకుండా మీరు చేయలేరు .... మీరు పాలు తీసుకుoట్టున్న జంతువు, ఆమె మీ తల్లి. వారు దీన్ని మర్చిపోతున్నరు. తల్లి పాలు సరఫరా చేస్తుంది, ఆమె శరీరం నుండి పాలు సరఫరా చేస్తుంది, మీరు తల్లిని చంపుతున్నారా? ఇది నాగరికత? తల్లిని చంపడము? పాలు అవసరం. అందువల్ల మీరు చివరి చుక్కను కుడా తీసుకుంటున్నారు. లేకపోతే, ఆవు నుండి చివరి పాల చుక్కను తీసుకోవలసిన ఉపయోగం ఏమిటి? ఇది అవసరం. ఎందుకు ఆమెను బ్రతకనివ్వరు. మీకు పాలు సరఫరా చేస్తుంది. మీరు పాలు నుండి వందల వేల పోషక రుచికరమైన వంటకాలను తయారు చేయగలరు ఆ మేధస్సు ఎక్కడ ఉంది? పాలు రక్తం యొక్క పరివర్తన మాత్రమే. రక్తం తీసుకొనే బదులు, రక్తము పరివర్తన అయిన పాలను తీసుకోని , నిజాయితీ గల పెద్దమనుషుల వలె, చక్కగా నివసిoచండి. కుదరదు. వారు పెద్ద మనుషులు కుడా కాదు. దుర్మార్గులు, అనాగరిక. మీరు మాంసం తినలి అనుకుంటే, మీరు అల్పమైన ఉపయోగం లేని పందులు, కుక్కలు వంటి జంతువులను చంపవచ్చు. మీరు వాటిని తినవచ్చు, మీరు తినలి అనుకుంటే. ఇది అనుమతించబడింది, పందులు కుక్కలు అనుమతించబడ్డాయి. ఎందుకంటే ఏ పెద్దమనిషి మాంసం తేసుకోడు. ఇది తక్కువ తరగతి. వారు అనుమతించబడ్డారు, "సరే, మీరు పందులను తినండి, śvapaca." దిగువ తరగతి వ్యక్తులు, వారు పందులు కుక్కలను తీసుకొని. ఇప్పటికీ, వారు తీసుకుంటున్నారు. మీరు మాంసం కోరుకుంటే, మీరు ఈ ముఖ్యము కాని జంతువులను చంపవచ్చు. ఆఖరి పాల చుక్క కుడా మీకు అవసరైమైన జంతువును ఎందుకు చంపుతున్నారు? అర్థమేమిటి? మీరు కృష్ణుడిని తీసుకుంటే అయిన పూతనను చంపాడు. కానీ ఆమెకు తల్లి స్థానం ఇచ్చాడు. పూతన యొక్క ఉద్దేశం ఎద్దైన కావచ్చు, కానీ నేను ఆమె రొమ్ము పీల్చాను, కావున ఆమె నాకు తల్లి. అని కృష్ణడు ఆమెకు రుణపడి ఉన్నాడు. మనము ఆవు నుండి పాలు తీసుకుంటున్నాము. ఆవు నా తల్లి కాదా? ఎవరు పాలు లేకుండా జీవించగలరు? ఆవు పాలను ఎవరు తీసుకోలేదు? వెంటనే, ఉదయన్నే, మీకు పాలు అవసరం. ఆ జంతువు, ఆమె పాలు సరఫరా చేస్తుంది, ఆమె మీకు తల్లి కాదు? అర్థమేమిటి? తల్లిని చంపే నాగరికత. వారు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. దీనివలన అప్పుడు అప్పుడు భయంకరమైన యుద్ధము, ఒక్కసారిగా మొత్తని ఊచకోత, ప్రతిచర్య ఉంది.