TE/Prabhupada 0143 - మిలియన్లు ట్రిలియన్ల విశ్వాలు ఉన్నాయి



Sri Isopanisad, Mantra 13-15 -- Los Angeles, May 18, 1970

ఓ నా ప్రభువా, జీవాలన్నింటినీ పాలించువాడ, మీ వాస్తవమైన ముఖమును మీ తేజోవంతమైన ప్రకాశము, కాంతిచే కప్పబడినది. దయచేసి ఆ కాంతిని తొలగించి నీ స్వచ్ఛమైన భక్తుడికి మీ దర్శన బాగ్యము కలుగ చేయుము.

ఇక్కడ వేదముల ఆధారాలున్నాయి. ఈ Īśopaniṣad వేదము, Yajur వేదములో భాగము. ఇక్కడ చెప్పబడినది hiraṇmayena pātreṇa satyasya apihitam mukham. సూర్యుడు లాగానే. సూర్యుని లోకములో, వివాస్వాన్ అనే పేరు గల దేవుడు పాలించుచున్నాడు మనకు ఈ సమాచారము , మనకు భగవద్గీత నుండి వస్తున్నది Vivasvān manave prāha. ప్రతి లోకములో ఒక అధిపతి దేవడు ఉన్నాడు. మీ ఈ లోకములో వలె, దేవడు లేకపోతే, అక్కడ అధ్యక్షుడు లాంటి వారు ఎవరైనా ఉన్నారు. గతంలో, ఈ లోకము మీద మహారాజ పరీక్షిత్ వరకు ఒక్క రాజు మాత్రమే ఉండేవాడు. ఒక రాజు ... ఒక్క జెండా మాత్రమే ఈ మొత్తం లోకమును పాలిస్తూ ఉంది. అదేవిధంగా, ప్రతి లోకములో ఒక పాలించు అధిపతి ఉన్నాడు. ఇక్కడ మహోన్నతమైన పాలించే అధిపతి కృష్ణుడు అని చెప్పబడినది, ఆధ్యాత్మిక లోకములో, ఆధ్యాత్మిక ఆకాశంలో ఊర్ధ్వ లోకములో. ఇది భౌతిక ఆకాశం. భౌతిక ఆకాశంలో వున్నా విశ్వములలో ఇది ఒకటి. మిలియన్లు ట్రిలియన్ల విశ్వాలు ఉన్నాయి. ఈ విశ్వంలో మిలియన్ల ట్రిలియన్ల లోకాలు ఉన్నాయి. Yasya prabhā prabhavato jagad-aṇḍa-koṭi (Bs. 5.40). Jagad-aṇḍa. Jagad-aṇḍa means universe. jagad-aṇḍa అంటే విశ్వం. Aṇḍa: కేవలం ఒక గుడ్డు వలె, ఈ మొత్తం విశ్వంలో. కోటి. కోటి అంటే వందలు వేలు అని అర్థము. బ్రహ్మజ్యోతిలో విశ్వాలు వందలు వేలు ఉన్నాయి, ఈ విశ్వంలోనే వందల వేలాది లోకములు ఉన్నాయి. అదేవిధంగా, ఆధ్యాత్మిక ఆకాశంలో కూడా, వందలు వేల సంఖ్యలో, అపరిమిత సంఖ్యలో వైకుంఠా లోకములు ఉన్నాయి. ప్రతి వైకుంఠా లోకమును ఒక్క దేవాదిదేవుడు అధికారిగా ఉన్నాడు. కృష్ణ లోకములో తప్ప మిగిలిన అన్ని వైకుంఠా లోకములు, అవి నారాయణు చేత ప్రబలమైనవి, ప్రతి నారాయణుడికి వేర్వేరు పేర్లు ఉన్నాయి, వాటిలో కొన్ని మనకు తెలుసు. మనము ఉచ్చరిస్తున్నాము Pradyumna, Aniruddha, Saṅkarṣaṇa... మనకు ఇరవై నాలుగు పేర్లు మాత్రమే వచ్చాయి, కానీ చాలా పేర్లు ఉన్నాయి. Advaitam acyutam anādim ananta-rūpam (Bs. 5.33).


ఈ లోకములు బ్రహ్మజోతి ప్రకాశవంతమైన కాంతితో కప్పబడి ఉన్నాయి. ఇక్కడ ప్రార్ధించారు. hiraṇmayena pātreṇa satyasya apihitam. Apihitam అంటే కప్పబడిన మీరు ఈ సూర్యరశ్మి యొక్క ప్రకాశవంతమైన కాంతి వలన సూర్య భూగోళాన్ని చూడలేరు, అదేవిధంగా, కృష్ణుడి లోకమును, ఇక్కడ మీరు చిత్రాన్ని చూడవచ్చు. కృష్ణుని లోకము నుండి ప్రకాశావంతమైన కాంతి బయటకు వస్తుంది. అందువల్ల ఈ ప్రకాశవంతమైన కాంతి లోనికి పోవలసి ఉంటుంది. ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. Hiraṇmayena pātreṇa satyasya. వాస్తవ సంపూర్ణ సత్యము, కృష్ణుడు, అయిన లోకము బ్రాహ్మణ్ ప్రకాశవంతమైన కాంతిచే కప్పబడి ఉంటుంది. భక్తుడు ప్రార్థిస్తున్నాడు, "దయచేసి దానిని తొలిగించండి దానిని తొలిగిస్తే నేను నిజంగా మీమల్ని చూడగలుగుతాను" బ్రహ్మజ్యోతి, మాయావాదా తత్వవేత్తలు, బ్రహ్మజ్యోతిని మించి, దాటి వారికి ఏమీ తెలియదు. ఇక్కడ వేదముల ఆధారాలు ఉన్నాయి. బ్రహ్మజ్యోతి ప్రకాశము బంగారపు ప్రకాశము వలె ఉంటుంది Hiraṇmayena pātreṇa. ఇది దేవాదిదేవుడి యొక్క వాస్తవమైన ముఖమును కప్పి ఉంచుతుంది. Tat tvaṁ pūṣann apāvṛṇu. "మీరు పాలించువారు, మీరు సంరక్షకులు. దయచేసి దీన్ని తొలిగించండి, తద్వారా మేము నిజంగానే మీ ముఖాన్ని చూడగలుగుతాము. "