TE/Prabhupada 0145 - మనము కొంత తప్పస్సును తీసుకోవాలి



Lecture on SB 3.12.19 -- Dallas, March 3, 1975

స్వాతంత్ర్యం అంత సహాజముగా రాదు. మీరు వ్యాధి బారిన పడుతున్నారు. మీరు జ్వరం నియంత్రణలో లేదా ఇతర బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు, ఏదో వ్యాధి వలన. మీరు కొoత తపస్సు చేయవలసి ఉంటుంది. మీరు శరీరం మీద ఉన్న పుండు వలన బాధపడుతున్నారు . ఆది చాలా బాధాకరమైనది. అప్పుడు, అది నయం చేయడానికి, మీరు శస్త్రచికిత్స చేయించుకోవాలి, మీరు నయము చేసుకోవాలంటే. అందువలన తపస్యా. అది తపస్సు. తాప అంటే బాధాకరమైన పరిస్థితి, తప. ఉదాహరణకు ఉష్ణోగ్రత వలె . మీరు అధిక ఉష్ణోగ్రత, 110 డిగ్రీ, కలిగి వుంటే అది మీకు చాలా భరించలేనిది. ఇది చాలా బాధాకరమైనది. భారతీయులు కూడా - మేము భారతదేశంలో జన్మించాము, ఉష్ణమండల వాతావరణం - ఇప్పటికీ, ఉష్ణోగ్రత వంద కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అది భరింపరానిది అవుతుంది. మీ గురించి మాట్లాడితే? మీరు వేరే ఉష్ణోగ్రతలో జన్మించారు. అదేవిధంగా, మనము తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేము. అది యాభై డిగ్రీల కన్నా తక్కువ ఉంటే, అది మాకు భరించలేనిది. వేర్వేరు వాతావరణాలు, వివిధ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కెనడాలో వారు సున్నా కంటే నలభై డిగ్రీలు తక్కువని తట్టుకోగలరు. ఇది జీవితం యొక్క వివిధ పరిస్థితులు. కానీ మనము బద్ధజీవులము. అధిక ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రత, అధిక చల్లదానము. కానీ మనము ఎలాంటి జీవన పరిస్థితులకైనా అలవాటు పడతాము మనము ఆ సామర్థ్యం కలిగివున్నాము బెంగాలీ సామెత ఉంది, śarīre na mahāśaya ya sahabe taya saya, ఈ శరీరం ఏ పరిస్థితినినైనా తట్టుకోగలదు మీరు సాధన చేస్తే మీరు కొన్ని పరిస్థితులలో ఉన్నారు, మీమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి మార్చితే, అది మీకు భరించలేనిదిగా వుంది మీరు బ్రతకలేరు అని కాదు . మీరు ఆచరిస్తే ... ఈ రోజుల్లోనే ఎవరూ వెళ్లటములేదు. గతంలో వారు హిమాలయ పర్వతానికి వెళ్ళేవారు, అక్కడ చాలా చల్లగా ఉంటుంది. తపస్యా ... అభ్యాసం చేసే పద్ధతి ఉంది, అధిక ఉష్ణోగ్రతలలో సాధువులు లేదా ఋషులు, వారు అన్ని వైపులా మంటను రగుల్చుతారు. ఆప్పటికే అధిక ఉష్ణోగ్రత ఉంది, వారు అన్ని వైపులా మంటను పెట్టుకొని, ధ్యానం చేస్తారు. ఇది తపస్యా. ఇవి తపస్యా యొక్క ఆంశములు అక్కడ కాలిపోయే వేడి ఉంటుంది. వారు ఆ ఏర్పాట్లు చేసుకుంటారు. అక్కడ తీవ్రమైన చలి నొప్పి కలిగించేంత చలి. నూరు డిగ్రీల కంటే తక్కువ , వారు నీటి కింద వెళ్ళి శరీరాన్నినీటిలో ముఖము వరకు వుంచి ధ్యానం చేసేవారు ఇవి తపస్యా యొక్క ఆంశాములు. తపస్య. భగవంతుని సాక్షాత్కారము కొరకు గతంలో ప్రజలు తీవ్రమైన తపస్సును ఆచరించేవారు, ప్రస్తుత క్షణం మనము పతితులమైయము, ఈ నాలుగు సూత్రాలను సహించలేకపోతున్నాము? ఇది చాలా కష్టమా? మనము కొoత తపస్సును ఇస్తున్నాము. "ఈ పనులలో నిమగ్నమవద్దు . అక్రమ లైంగికం సంబంధము వద్దు, ఏ మత్తు మందు వద్దు, ఏ మాంసం తినవద్దు, జూదం ఆడరాదు. " ఇవి కృష్ణ చైతన్యములో ఉన్నత స్థితికి చేరుకోవటానికి అచరించవలసిన తపస్సు యొక్క ఆంశాములు. చాలా కష్టమైన పనా? ఇది కష్టం కాదు. ఒకవేళ సాధన చేయగలిగితే, బాగా చల్లగా ఉన్న నీటిలో మెడ వరకు నీటిలో వుండండి, అక్రమ లైంగిక సంబంధము, మాంసం తినడం మత్తుపదార్థాలను విడిచిపెట్టడం కన్నా కష్టమేనదా? మనము "సెక్స్ వద్దు అని సలహా ఇవ్వటములేదు, అక్రమ సెక్స్ వద్దు అని చెప్పుతున్నాము. కష్టం ఎక్కడ ఉంది? కానీ ప్రస్తుత యుగము ఎంత పతనము అయినది అంటే ఈ ప్రాధమిక తపస్యను కుడా మనము అమలు చేయలేకపోతున్నాము. ఇదే కష్టం. కానీ మీరు దేవుణ్ణి అవగతము చేసుకోవాలని కోరుకుంటే, ఇక్కడ చెప్పబడినట్లు, tapasaiva, తపస్యా మాత్రమే, తపస్సు ద్వారా మాత్రమే, గ్రహించగలరు. లేకపోతే వీలుకాదు. లేకపోతే అది సాధ్యం కాదు. అందువలన ఈ పదం ఉపయోగిస్తారు, tapasaiva. కేవలము తపస్సు వలెనే. ఇతర మార్గాలు లేవు. Tapasā eva param. Param అంటే మహోన్నతమైన. మీరు దేవాదిదేవుడిని, సంపూర్ణంగా అర్ధము చేసుకోవాలని కోరుకుంటే, మీరు కొన్ని రకాల తప్పస్సులను అంగీకరించాలి. లేకపోతే అది సాధ్యం కాదు. ప్రాథమికమైన చిన్న తపస్సు. ఉదాహరణకు ekādaśī వలె . ఇది తపస్సు యొక్క అంశం. వాస్తవానికి ఎకాదశి రోజుల్లో మనం ఏ ఆహారం తీసుకోకూడదు, నీరు కూడా త్రాగాకూడదు. కానీ మన సమాజంలో మనము ఖచ్చితంగా పాటించటం లేదు. మనము చెప్పుతున్నాము, "ఏకదాశి రోజు, మీరు ఆహార ధాన్యాలు తీసుకోవద్దు, కొంచెం పండు, పాలు తీసుకోండి." ఇది తపస్యా. మనము ఈ తపస్సుని అమలు చేయలేమా? మనము ఈ సులభంగా అమలు చేయగల తపస్సును చేపట్టేందుకు సిద్ధంగా లేకపోతే, అప్పుడు మనం భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళగలమని ఎలా అనుకుంటాము? లేదు, అది సాధ్యం కాదు. ఇక్కడ చెప్పబడింది, tapasaiva, tapasā eva. eva అంటే ఖచ్చితంగా అని అర్థము. మీరు తప్పక. ఇప్పుడు, తపస్యా, తపస్సును అమలు చేస్తే మీరు ఓడిపోతారా? మీరు ఓడిపోరు. ఇప్పుడు, బయట నుండి వచ్చే వారు ఎవరైనా మన సమాజము యొక్క,మన సభ్యులను, బాలురు బాలికలను చూస్తారు. వారు, "ప్రకాశవంతమైన ముఖాలు." అని అంటారు. అవునా కాదా? వారు వ్యత్యాసాన్ని చూస్తారు. సాదారణ వస్త్రములలో ఉన్న ఒక పూజారి ... నేను లాస్ ఏంజిల్స్ నుంచి హవాయికి వెళుతున్నాను. ఒక పూజారి, అయిన విమానంలో నా వద్దకు వచ్చారు. అయిన నా అనుమతిని అడిగారు, "నేను మీతో మాట్లాడ వచ్చా?" సరే. ఎందుకు మాట్లాడకుడాదు?" తన మొదటి ప్రశ్న "మీ శిష్యుల ముఖాలు చాలా ప్రకాశవంతమైనవిగా నేను చూస్తున్నాను. ఇది ఎలా సాద్యమైనది అయిన నిజాయితీగా ఉన్నాడు. పొరపాటు ఎక్కడ ఉంది? ఈ చర్యలన్నింటిని, పాపభరితమైన కార్యకలాపాలను తిరస్కరించడం ద్వారా, మనము నష్టపోవటము లేదు. మనము చాలా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. మనము నేలపై కూర్చోవచ్చు మనము నేలపై పడుకోవచ్చు. మనకు చాలా సామాన్లు అవసరం లేదు, చాల అందమైన దుస్తులు అవసరము లేదు తపస్సు అవసరం వుంది. మనము ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని కోరుకుంటే, మనము తప్పస్సును కోంత అంగీకరించాలి. కలి-యుగాములో తీవ్రమైన తపస్సులను చలిలో ఉండటము వంటివి అంగీకరించలేము మనము నీటి కింద, కొన్నిసార్లు మునిగిపోతుండటం లేదా కొన్నిసార్లు పైకి తేలాటము, తరువాత హారే కృష్ణ మంత్రాన్ని ధ్యానం లేదా జపము చేయటము. అది సాధ్యం కాదు. కనీస తపస్సు ఇక్కడ ఉండాలి. ఈ శ్లోకము ద్వారా మనము గమనించాలి. మనము భగవంతుని అర్ధము చేసుకోవాలని తీవ్రముగా అనుకున్నట్లయితే కొంత తపస్సును ఆచరించాలి. ఇది కావాల్సింది