TE/Prabhupada 0149 - కృష్ణ చైతన్య ఉద్యమము అంటే మహోన్నతమైన తండ్రిని కనుగొనుట
Tenth Anniversary Address -- Washington, D.C., July 6, 1976
ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే మహోన్నతమైన తండ్రిని గుర్తించడం. మహోన్నతమైన తండ్రి. ఈ ఉద్యమం యొక్క పూర్తి లక్ష్యము. మన తండ్రి ఎవరో మనకు తెలియకపోతే అది చాలా మంచి పరిస్థితి కాదు. భారతదేశంలో కనీసం, తన తండ్రి పేరు చెప్పకపోతే, అతనిని గౌరవించరు. న్యాయస్థానములో పద్ధతి మీరు మీ పేరు వ్రాసి , మీరు మీ తండ్రి పేరు రాయాలి. అది భారతీయ, వేదముల పద్ధతి, పేరు, తన పేరు, ఆయన తండ్రి పేరు, ఆయన గ్రామం పేరు. ఈ మూడు కలిపి. ఈ పద్ధతి ఇతర దేశాల్లో సాదారణముగా ఉంటుందని నేను భావిస్తున్నాను, కానీ భారతదేశంలో, ఇది పద్ధతి. మొదట పేరు తన సొంత పేరు, రెండవ పేరు తన తండ్రి పేరు, మూడో పేరు ఆయన జన్మించిన గ్రామం లేదా దేశం పేరు ఇది పద్ధతి. తండ్రి ... మనము తండ్రిని తప్పని సరిగా తెలుసుకోవాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. మనము తండ్రిని తప్పని సరిగా తెలుసుకోవాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. మన తండ్రిని మరచిపోయినట్లయితే, ఇది చాలా మంచి పరిస్థితి కాదు. ఏ విధమైన తండ్రి? Paraṁ brahma paraṁ dhāma (BG 10.12). అత్యంత ధనికుడు. తన పిల్లలకు తిండి కుడా ఏర్పాటు చేయలేని పేద తండ్రి కాదు. ఇది ఆ తండ్రి కాదు. Eko yo bahūnāṁ vidadhāti kāmān. ఆ తండ్రి చాలా ధనవంతుడు, ఆయన మాత్రమే లక్షలాది మిలియన్ల జీవులకు ఆహారం ఇస్తున్నాడు. ఆఫ్రికాలో వందల లక్షలాది ఏనుగులు ఉన్నాయి. ఆయన వాటికి ఆహారము ఇస్తున్నాడు. గది లోపల ఒక రంధ్రం ఉంది, మిలియన్ల చీమలు ఉండవచ్చు. ఆయన వాటికి కూడా ఆహారము ఇస్తున్నాడు. Eko yo bahūnāṁ vidadhāti kāmān. Nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). ఇవి వేదముల సమాచారం. మానవ జీవితం, మన తండ్రి ఎవరు అని అర్థం చేసుకోవడము కోసం ఉద్దేశించబడింది, ఆయన చట్టం ఏమిటి, దేవుడు ఎవరు, ఆయనతో మనకున్న సంబంధం ఏమిటి. ఇది వేదాంత. వేదాంత అంటే కొంత అర్ధం లేనివి మాట్లాడటం కాదు. మరియు తండ్రితో సంబంధము లేకపోవటము కాదు Śrama eva hi kevalam.... మీకు మీ తండ్రి ఎవరు తెలియకపోతే ...
- dharmaḥ svanuṣṭhitaḥ puṁsāṁ
- viṣvaksena-kathāsu yaḥ
- notpādayed yadi ratiṁ
- śrama eva hi kevalam
- (SB 1.2.8)
ఇది అవసరం లేనిది. కృష్ణుడు చెప్తాడు. vedaiś ca sarvair aham eva vedyaḥ (BG 15.15). ఇది అవసరం లేనిది. కృష్ణుడు చెప్తాడు. vedaiś ca sarvair aham eva vedyaḥ (BG 15.15). మీరు వేదాంతము తెలిసిన వారు అయ్యారు, అది మంచిది. వేదాంత ఆరంభంలో, పరమ సత్యము నుండి ప్రతిదీ వస్తుంది అని చెప్పబడింది. Athāto brahma jijñāsā. ఇది ప్రారంభము ఇప్పుడు మానవ జీవితం పరమ సత్యము, అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడింది. jijñāsā. పరమ సత్యము ఏమిటి అని విచారణ చేయాలి. పరమ సత్యమును తెలుసుకోవడమే మానవ జీవితం. తదుపరి సూత్రం వెంటనే చెప్పుతుంది పరమ సత్యము అన్నది ప్రతి దానికి మూలం. ప్రతిదీ అంటే ఏమిటి? మనము రెండు విషయాలు తెలుసుకోవాలి: జీవం ఉన్నవి జీవం లేనివి. ఆచరణాత్మక అనుభవం. వాటిలో కొన్నిటికీ జీవము ఉన్నది వాటిలో కొన్నిటికీ జీవం లేదు. రెండు విషయాలు. ఇప్పుడు మనము రకాలను విస్తరించవచ్చు. అది మరొక విషయం. కానీ రెండు విషయాలు ఉన్నాయి. ఈ రెండు విషయాలు, ఈ రెండు విషయాల మీద ఒక నియంత్రికుడు ఉన్నాడు. జీవం ఉన్నవి జీవము లేనివి మనము ఇప్పుడు ప్రశ్నించాలి రెండు విషయాల మూలం, జీవము ఉన్నవి నిర్జీవమైనవి వాటి పరిస్థితి ఏమిటి ఆ పరిస్థితి శ్రీమద్-భాగావతములో వివరించబడింది. janmādy asya yato 'nvayād itarataś cārtheṣv abhijñaḥ (SB 1.1.1).
ఇది వివరణ. అన్నీటికీ అసలు మూలం abhijñaḥ. ఎలా? Anvayād itarataś cārtheṣu. నేను ఏదైన సృష్టించినట్లయితే, నాకు ప్రతిదీ, అన్ని వివరాలు తెలుసు. Anvayād, నేరుగా లేదా పరోక్షంగా, నాకు తెలుసు. నేను ఏదైన తయారు చేస్తే ... నాకు కొన్ని ప్రత్యేక వంటకాలు తెలిస్తే, అది ఎలా చేయాలో అన్ని వివరాలు నాకు తెలుసు. అది మూలం. కావున ఆ మూలం కృష్ణుడు. కృష్ణుడు చెప్పుతాడు vedāhaṁ samatītāni: (BG 7.26). నాకు ప్రతిదీ తెలుసు - గతము, ప్రస్తుతము భవిష్యత్తు." Mattaḥ sarvaṁ pravartate. Aham ādir hi devānām (BG 10.2). సృష్టి సిద్ధాంతం ప్రకారం ... సిద్ధాంతం కాదు, వాస్తవమునకు బ్రహ్మ విష్ణు మహేశ్వర. వీరు ముఖ్యమైన దేవతలు విష్ణువు మొదటి వారు Aham ādir hi devānām. సృష్టి, మొదట మహా-విష్ణువు; అప్పుడు మహా-విష్ణువు నుండి గర్బోదాక్ క్షాయి విష్ణువు వచ్చారు. గర్బోదాక్ క్షాయి విష్ణువు నుండి క్షిరోదాయక విష్ణువు విష్ణువు యొక్క విస్తరణ, ఆయన నుండి బ్రహ్మా వచ్చారు. బ్రహ్మదేవుడు గర్బోదాక్ క్షాయి విష్ణువు తామర పుష్పము పై ఉన్నపుడు జన్మించారు అప్పుడు ఆయన రుద్రుడికి జన్మనిచ్చారు. ఇది సృష్టి యొక్క వివరణ. కృష్ణుడు చెప్తాడు. aham ādir hi devānām. ఆయన విష్ణువు యొక్క మూలం కూడా ఎందుకంటే, మనకు శాస్త్రము నుండి kṛṣṇas tu bhagavān svayam (SB 1.3.28). మొదటి వ్యక్తి భగవంతుడు కృష్ణుడు. కృష్ణుని మొదటి విస్తరణ బలదేవుడు. ఆ తరువాత ఆయన నుండి చతుర్ వ్యూహ వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ద, ఆ విధముగా తరువాత నారాయణ. నారాయణ నుండి, రెండవ చాతుర్-వ్యూహ, రెండవ చాతుర్-వ్యూహ నుండి సంకర్షణ మహా-విష్ణువు. ఈ విధంగా మీరు శాస్త్రములు నేర్చుకోవాలి. వాస్తవానికి, మీరు తెలుసుకుంటారు శాస్త్రములో చెప్పినట్లుగా kṛṣṇas tu bhagavān svayam. కృష్ణుడు చెప్పుతారు aham ādir hi devānām (BG 10.2). Ahaṁ sarvasya prabhavo mattaḥ sarvaṁ pravartate (BG 10.8). అర్జునుడు అంగీకరిస్తాడు, paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān (BG 10.12). మనం శాస్త్రమును అంగీకరించాలి. Śāstra-cakṣuṣāt. మీరు శాస్త్రము ద్వారా చూడాలి మీరు శాస్త్రాన్ని నేర్చుకుంటే, అప్పుడు మీరు kṛṣṇas tu bhagavān svayam అని తెలుసుకుంటారు
ఈ కృష్ణ చైతన్య ఉద్యమం మానవ సమాజమునకు భగవంతుని యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రచారము చేస్తుంది. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. మేము 1966 లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించి దానిని నమోదు చేసాము. మా రూపానుగా ప్రభు ఇప్పటికే వివరించారు. ఈ ఉద్యమమును చాలా తీవ్రంగా తీసుకోండి. అదే, కృష్ణుడు చారిత్రత్మకముగా, ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఆయన తన శిష్యుడిగా అర్జునుడితో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఐదువందల సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు, అదే ఉద్యమాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఆయన కృష్ణుడు. అది ఈ విధముగా జరుగుతోంది. ఇది తయారు చేయబడిన ఉద్యమం అని భావించ వద్దు. కాదు. ఇది ప్రామాణిక ఉద్యమం. ప్రామానికులు ధ్రువీకరించారు. Mahājano yena gataḥ sa panthāḥ (CC Madhya 17.186). శాస్త్రంలో మహాజనులను ప్రస్తావించారు కృష్ణ చైతన్య ఉద్యమంలో స్థిరపడి, కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిoచండి. మా దగ్గర అనేక సాహిత్యాలు ఉన్నాయి, ప్రామాణిక సాహిత్యములు ఉన్నాయి. మీ జీవితం విజయవంతము చేసుకోండి. చాలా ధన్యవాదాలు.