TE/Prabhupada 0162 - కేవలము భగవద్గీత సందేశాన్ని తీసుకొని ప్రచారము చేయండి
Press Interview -- October 16, 1976, Chandigarh
భారతదేశంలో ఆత్మను అర్థం చేసుకోవడానికి అపారమైన వేద సాహిత్యములు ఉన్నాయి. మనము ఈ మానవ శరీరములో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, మనం ఆత్మహత్య చేసుకుంటున్నాము. భారతదేశంలో జన్మించిన గొప్ప వ్యక్తుల ప్రతిపాదన ఇది. ఆచార్యులు లాగా ... ఇటీవల ... పూర్వం, గొప్ప గొప్ప ఆచార్యులు వ్యాసదేవుని వంటి వారు. Devala. చాలామంది, అనేక మంది ఉన్నారు. ఇటీవలి, వెయ్యి ఐదు వందల సంవత్సరాల లోపల అనేక మందిఆచార్యులు ఉన్నారు, రామానుజాచార్య, మద్వాచార్య, విష్ణుస్వామి, ఐదువందల సంవత్సరాలలో భగవంతుడు చైతన్య మహాప్రభు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి వారు మనకు అనేక సాహిత్యాలను ఇచ్చారు.
కానీ ప్రస్తుతం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం నిర్లక్ష్యం చేయబడింది. అందువల్ల ఇది మొత్తం ప్రపంచానికి చైతన్య మహాప్రభు యొక్క సందేశం మీరు ప్రతి ఒక్కరూ, మీరు గురువు, ఒక ఆధ్యాత్మిక గురువు అవ్వండి. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక గురువుగా ఎలా మారవచ్చు? ఒక ఆధ్యాత్మిక గురువు కావడాము సులభమైన పని కాదు. అతడు బాగా నేర్చుకున్న పండితుడు అవ్వాలి. పూర్తి ఆత్మ సాక్షాత్కారము కలిగి వుండి, ప్రతి విషయము యొక్క పూర్తి పరిపూర్ణత అవగాహనా ఉండాలి. కానీ చైతన్య మహాప్రభు మనకు ఒక చిన్న సూత్రము ఇచ్చారు, మీరు ఖచ్చితంగా భగవద్గీత బోధలను అనుసరిస్తే భగవద్గీత యొక్క ప్రయోజనాన్ని బోధిస్తే, మీరు గురువు అవుతారు. బెంగాలీలో ఉపయోగించిన ఖచ్చితమైన పదాలు, yāre dekha, tāre kaha 'kṛṣṇa'-upadeśa (CC Madhya 7.128). గురువుగా మారడం చాలా కష్టమైన పని, కానీ మీరు కేవలం భగవద్గీత సందేశాన్ని తీసుకుంటే మీరు కలిసే ఎవరినేన ఒప్పించేందుకు ప్రయత్నించండి, అప్పుడు మీరు ఒక గురువు అవుతారు. మన, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఈ ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది. ఇ భగవద్గీతను ఎటువంటి తప్పుడు వ్యాక్యానము లేకుండా ప్రచారము చేస్తున్నాము.