TE/Prabhupada 0171 - మంచి ప్రభుత్వాన్ని మిలియన్ల సంవత్సరాలు మరచిపొండి



Lecture on SB 1.2.28-29 -- Vrndavana, November 8, 1972


ఈ వర్ణాశ్రమ ప్రకారం, శిక్షణ ఉండాలి. కొంత మందికి చక్కని బ్రహ్మనులుగా శిక్షణ ఇవ్వాలి కొందరికి చక్కని క్షత్రియులుగా శిక్షణ ఇవ్వాలి. కొందరికి చక్కని వైశ్యులుగా శిక్షణ ఇవ్వాలి. శుద్రునికి ఏటువంటి అవసరం లేదు ... ప్రతి ఒక్కరూ శుద్రుడు. Janmanā jāyate śūdraḥ. పుట్టుకతో, అందరు శుద్రులే Saṁskārād bhaved dvijaḥ. శిక్షణ ద్వారా వైశ్యులు అవుతారు, ఒకరు క్షత్రియుడు అవుతారు, ఒకరు బ్రాహ్మణులు అవుతారు. ఆ శిక్షణ ఎక్కడ ఉంది? అoదరు శూద్రులు. మీరు ఎలా మంచి ప్రభుత్వాన్ని ఆశించవచ్చు, శుద్ర ప్రభుత్వాము? శుద్రులు అందరు ఎదో విధముగా ఓటు వేయించుకుంటున్నారు వారు ప్రభుత్వ పదువులను ఆక్రమించుకుంటున్నారు. అందువలన వారి ఏకైక పని ..., కలి, ముఖ్యంగా ఈ యుగములో, mlecchā rājanya-rūpiṇaḥ, తినడం త్రాగటం, మాంసం తినడం, వైన్ త్రాగుటము. మ్లేచాస్, యవనాస్, వారు ప్రభుత్వ పదవులను అంగీకరిస్తున్నారు. మీరు మంచి ప్రభుత్వమును ఎలా ఆశిస్తారు? మర్చిపోoడి, లక్షలాది సంవత్సరాలపాటు మంచి ప్రభుత్వాన్ని మర్చిపోండి, మీరు ఈ వర్ణాశ్రమ-ధర్మాన్ని స్థాపించకపోతే. మంచి ప్రభుత్వాము ప్రశ్న లేదు. ప్రభుత్వానికి బాధ్యత వహించగల ఫస్ట్-క్లాస్ వైష్ణవుడు ఉండాలి. కేవలం పరిక్షిత్ మహారాజ లాగానే. అయిన తన పర్యటనలో ఉన్నాడు, ఒక నల్ల మనిషి ఒక ఆవుని చంపడానికి ప్రయత్నిoచడము అయిన చూసిన వెంటనే, వెంటనే అయిన తన కత్తిని తీసుకున్నాడు: ఎవరు నీవు, దుష్టుడా, ? అది క్షత్రియుడు అంటే. ఆవులను రక్షించగలవాడు వైశ్యుడు. Kṛṣi-go-rakṣya-vāṇijyaṁ vaiśya-karma svabhāva-jam (BG 18.44). అంతా స్పష్టంగా ఉంది. సంస్కృతి ఎక్కడ ఉంది?

ఈ కృష్ణ చైతన్య ఉద్యమము చాలా ముఖ్యమైనది. సమాజ నాయకులు, వారు చాలా శ్రద్ధ తీసుకోవాలి మీరు ఈ ప్రపంచం యొక్క సామాజిక పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవచ్చు. ఇక్కడ మాత్రమే కాదు, ప్రతిచోటా, సర్. కేవలం అజ్ఞానం భ్రమలో, ప్రతిదీ జరుగుతోంది. అస్పష్టమైన, స్పష్టమైన ఆలోచన లేదు. ఇక్కడ స్పష్టమైన ఆలోచన ఉన్నది. vāsudeva-parā vedāḥ వేద, విజ్ఞానం, మీరు ప్రజలను విజ్ఞానవంతులను చేస్తున్నారు, కానీ వాసుదేవుని గురించి ప్రజలకు ప్రచారముచేయడానికి మీ దగ్గర విద్య ఎక్కడ ఉంది, కృష్ణుని గురించి? భగవద్గీత నిషేధించబడింది. వాసుదేవడు తన గురించి తానే మాట్లాడు తున్నాడు, కానీ అది నిషేధించబడింది. ఎవరైనా చదువుతున్నట్లయితే, కొంతమంది ముర్ఖులు చదువుతున్నారు అయిన వాసుదేవుడిని తీసేస్తున్నారు. అంతే. భగవద్గీత మైనస్ కృష్ణ. ఇది జరుగుతోంది. పూర్తిగా అర్ధంలేని. మీరు ఒక అర్ధము లేని సమాజంలో మానవ నాగరికతను ఆశించలేరు. ఇక్కడ మానవ జీవితం యొక్క వాస్తవమైన ప్రయోజనం ఉన్నది. vāsudeva-parā vedā vāsudeva-parā makhāḥ, vāsudeva-parā yogāḥ. చాలా మంది యోగులు ఉన్నారు. నేను స్పష్టంగా చెప్పగలను, వాసుదేవుడు లేకుండా, యోగ - కేవలం ముక్కును ముసుకోవడము అంతే. ఇది యోగా కాదు.