TE/Prabhupada 0177 - కృష్ణ చైతన్యము శాశ్వతముగా ఒక వాస్తవము



Lecture on SB 1.15.28 -- Los Angeles, December 6, 1973

మనకు ఈ సన్నిహిత సంబంధం ఉన్నది. దేవుడితో కృష్ణుడితో మనకున్న సన్నిహిత సంబంధాన్ని అర్ధం చేసుకోవడానికి మనము ఆ స్థానానికి వచ్చినప్పుడు, ఇది స్వరూప-సిద్ధి అని, స్వరూప-సిద్ధి. అంటారు స్వరూప-సిద్ధి అంటే పరిపూర్ణత, స్వరూప-సిద్ధి అంటే పరిపూర్ణత. ఇక్కడ సుత గోస్వామి చెప్పారు. sauhardena gadhena, santa. ఒక పూర్వ స్నేహితుడు మరొక పూర్వ స్నేహితుడితో కలుస్తే వారు చాలా ఆనందిస్తారు అదేవిధంగా, తండ్రి మార్పడిన పిల్ల వానిని కలుస్తే, అయిన చాలా ఆనంద పడుతాడు పిల్లవాడు కూడా ఆనంద పడుతాడు. భర్త, భార్య విడిపోయి నప్పుడు, మళ్లీ వారు కలిసినప్పుడు. వారు చాలా ఆనందంగా ఉంటారు. ఇది చాలా సహజమైనది. చాలా సంవత్సరాల తర్వాత యజమాని సేవకులు, వారు మళ్లీ కలిసినట్లయితే, వారు చాలా ఆనందంగా ఉంటారు. మనము చాలా మార్గాల్లో శ్రీ కృష్ణుడితో సంబంధాలు కలిగి ఉన్నాము. santa, dasya, sakhya, vatsalya, madhurya. శాంతా, అంటే తటస్థ అని అర్థం, కేవలం దేవదిదేవుడిని అర్థం చేసుకోవడానికి. దాస్యా అంటే ఒక అడుగు ముందుకు. మనం చెప్పుతాము "దేవుడు గొప్పవాడు." దానిని శాంత అంటారు, దేవుడు గొప్పతనాన్ని అభినందించడాన్ని. కానీ ఏ కార్యకలాపాలు లేవు. కానీ మీరు ముందుకు వెళ్ళినప్పుడు, "దేవుడు గొప్పవాడు. నేను సమాజమును, స్నేహమును, ప్రేమను, పిల్లులను, కుక్కలను నేను వాటిని చాలా ప్రేమిస్తున్నాను. దాస్యా అని పిలవబడుతుoది ఎందుకు గొప్పవాడిని ప్రేమించకూడదు? దేవుడి సాక్షాత్కారము చాలా గొప్పది. అది కుడా చాలా మంచిది. కానీ మీరు స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళినప్పుడు, "ఇప్పుడు ఎందుకు గొప్పవానికి సేవ చేయలేరు?" సాధారణ సేవ నుండి, సేవలో నిమగ్నమై ఉన్నవారు, వారు తక్కువ స్థాయి సేవ నుండి ఉన్నత సేవకు మారాడానికి ప్రయత్నిస్తున్నారు. సేవ ఉంది. కానీ ఉన్నత సేవ ఎమిటంటే ప్రభుత్వ సేవను పొందటము అయిన చాలా బాగుంది అని అనుకుంటాడు. అదేవిధంగా, మనము సేవ చేస్తుంటే , మనము గొప్ప సేవ చేయాలనీ కోరుకునప్పుడు, అది మనకు శాంతియుత జీవితం ఇస్తుంది. శాంత, దాశ్యా.

అప్పుడు స్నేహంతో సేవ. సేవా, యజమానికి సేవాకుడు సేవ చేయడం, కానీ సేవకుడు చాలా సన్నిహితంగా ఉన్నప్పుడు స్నేహం ఏర్పడుతుంది నేను కలకత్తాలో ఆచరణాత్మకంగా చూశాను. డాక్టర్ బోస్, అయిన డ్రైవర్ అయినకు ఉత్తమ స్నేహితుడు. అయిన కారులో కూర్చొని ఉన్నప్పుడు, అయిన డ్రైవర్తో తన మనసులో ఉన్నది మాట్లాడుతాడు. ఈ డ్రైవర్, అయినకు సన్నిహిత స్నేహితుడు అయ్యాడు. డ్రైవర్తో అన్ని రహస్య చర్చలు చేస్తాడు. ఇది అలా జరుగుతుంది. సేవకుడు చాలా విశ్వాసముగా మారితే, యజమాని తన మనసును వెల్లడిస్తాడు. అయిన ఏమి చేయాలో అయినతో మాట్లాడుతాడు. దీనిని స్నేహ వేదిక అంటారు. మరల .. తండ్రి కొడుకు, తల్లి కొడుకులతో ఉన్న సంబంధం. దీనిని వాత్సల్య అని పిలుస్తారు, చివరకు మాదుర్య ప్రేమ. ఈ విధంగా మనం ఏదో విధముగా కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాము. పూజిoచబడేవానిగా, సేవకుడిగా, స్నేహితునిగా, వాత్సల్య ప్రేమ, లేదా మాదుర్య ప్రేమికుడిగా మనము దానిని పునరుద్ధరించాలి. మీరు వాటిలో ఏ ఒక దానిని పునరుద్ధరించుకుంటే వెంటనే, సాన్నిహిత్యం, అప్పుడు మనము సంతోషంగా ఉంటాము, ఎందుకంటే ఇది శాశ్వతమైనది. అదే ఉదాహరణ ... వేలు, అది వేరుగా ఉన్నప్పుడు, ఆది సంతోషంగా ఉండదు. అది కలిసివున్నప్పుడు వెంటనే అది సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా, మనము కృష్ణుడితో మన శాశ్వత సంబంధాన్ని కలిగి ఉన్నాము. ఇప్పుడు మనం విడిపోయాము, కాని మనము అయినతో చేరిన వెంటనే, మనము yenatma suprasidati అవుతాము

అందుచే కృష్ణ చైతన్య ఉద్యమం ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా ఉంటుంది కేవలం మన అసలు చైతన్యమును పునరుద్ధరించుకోవాడానికి ప్రయత్నిస్తున్నాము. అది ఎల్లప్పుడు ఉంటుంది, nitya-siddha krsna-bhakti. మన కృష్ణ చైతన్యము శాశ్వతముగా ఒక్క వాస్తవము. లేకపోతే మీరు ఐరోపా, అమెరికన్ బాలురు అమ్మాయిలు, మీకు, మూడు లేదా నాలుగు సంవత్సరాల క్రితం, మీకు కృష్ణుడు అంటే ఏమిటో తెలియదు. ఎందుకు మీరు కృష్ణుడిని ప్రేమిస్తున్నారు? మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు? మీరు కృష్ణుడిని ప్రేమించక పోతే , ఈ దేవాలయంలో కృష్ణుడి యొక్క మహిమను ప్రచారముచేయడానికి మీరు మీ విలువైన సమయాన్ని త్యాగం చేయలేరు. మీరు కృష్ణుడి పట్ల ప్రేమను పెంచుకున్నారు. లేకపోతే ఎవరూ అయిన సమయం వృధా చేసుకునే అంత అని మూర్ఖుడు కాదు. వీలు కాదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? కృష్ణుడు భారతీయుడు,కృష్ణుడు హిందూవు అని ఎవరైనా చెప్పవచ్చు క్రైస్తవులు ఎ0దుకు ఆసక్తి చూపుతున్నారు? వారు హిందూవులా? కృష్ణుడు. హిందూవు కాదు, ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు. కృష్ణుడు కృష్ణుడే. మీరు కృష్ణుడి యొక్క ఆoశ. నేను హిందూవుని, "నేను ముస్లింని," "నేను క్రిస్టియని," "నేను అమెరికన్ని," "నేను భారతీయుడిని" - ఈవి అన్ని హోదాలు. వాస్తవమునకు నేను ఆత్మని, అహం బ్రహ్మస్మి. కృష్ణుడు దేవాదిదేవుడు, param brahma param dhama pavitram paramam bhavan (BG 10.12).

మనము కృష్ణుడితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాము. ఇది శాశ్వతముగా వాస్తవము. కేవలం మనము పునరుద్ధరించు కోవాలి. Sravanadi-suddha-citte karaye udaya మనము సృష్టించాలి. ఉదాహరణకు ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించటానికి ఇష్టపడుతాడు, యువకుడిని ఒక యువతీ ప్రేమించటానికి ఇష్టపడుతుంది. అది సహజమైనది. అది సహజమైనది. కానీ వారు కలిసినప్పుడు, అది పునరుద్ధరించబడింది. ఇది కొత్త విషయము కాదు. ఇది ఎప్పుడు ఉంది. ఎలాగైనా, వారు కలిసినప్పుడు, వారి మధ్య ప్రేమపూర్వక ప్రవృత్తి పెరుగుతుంది. ప్రేమ పెరుగుతుంది. కృష్ణుడితో మన సంబంధం సహజమైనది. అది అసహజమైనది కాదు. నిత్య సిద్ధ. నిత్య సిద్ధా అంటే శాశ్వతముగా వాస్తవము. కేవలం అది కప్పబడి ఉంటుంది. ఇది కప్పబడి ఉంటుంది. ఆ కప్పి ఉన్న దానిని తీసివేయాలి. అప్పుడు సహజంగానే మనము కృష్ణుడితో సంబంధం కలిగి ఉంటాము. ఇది కృష్ణ చైతన్యము యొక్క పరిపూర్ణత.