TE/Prabhupada 0179 - మనము కృష్ణుడి కొరకు పని చేయాలి



Lecture on SB 1.16.6 -- Los Angeles, January 3, 1974

ఈ మాయావాది తత్వవేత్తలు, వారు కల్పనతో, చాలా జ్ఞానము కలిగి ఉండ వచ్చును, కానీ వారు తిరిగి పతనమవ్వుతారు. ఎందుకు? Anadrta-yusmad-anghrayah: "వారు మీ కమల పాదముల దగ్గర ఆశ్రయం పొందలేదు వారు పతనము అవుతారు." ఇది సురక్షితమైనది కాదు. ఎవ్వరూ ఏ కోరిక లేకుండా, ఏ పని లేకుండానే ఉండలేరు. అది సాధ్యం కాదు. ఒక మనిషి, జంతువు, , కీటకాలు కూడా ఏదో ఒక్క పని చేస్తుండాలి. నాకు వాస్తవ అనుభవం ఉన్నది. నా కుమారులలో ఒకరు ... నేను యువకుడిగా ఉన్నప్పుడు, అయిన చాలా కొంటెడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మేము వాడిని రాక్ లో ఉంచేవాడిని. వాడు క్రిందకు రాలేకపోయేవాడు. వాడి ఆటలు రాక్ లో నిలిపివేయబడినందున వాడు చాలా అసౌకర్యoగా ఉండేవాడు. మీరు పని చేయకుండా ఉండటాన్ని ఆపలేరు. అది సాధ్యం కాదు. మీకు ఉన్నత పనిని ఇవ్వాలి. అప్పుడు మీరు ఆపివేస్తారు. Param drstva nivartate (BG 2.59).

ఈ కృష్ణ చైతన్యము ఉద్యమం అంటే మీరు ఉన్నత పనిని పొందడము అందువలన మీరు అధమ కర్మలను వదిలివేస్తారు. లేకపోతే, కేవలం పని చేయక పోవడము ద్వారా, అది సాధ్యం కాదు. మనము పని చేయాలి. మనము కృష్ణుడు కొరకు పని చేయాలి. మనము కృష్ణుడు ఆలయానికి వెళ్తాము, లేదా మనము కృష్ణుడు పుస్తకాలను విక్రయించడం కోసం వెళ్తాము లేదా కొంతమంది కృష్ణ భక్తుల్ని కలుస్తాను. చాలా బాగుంది. కానీ మీరు పని చేయడము అపలేరు. అది సాధ్యం కాదు. అప్పుడు మీ పని లేని మెదడు దెయ్యాల కర్మాగారము లాగా ఉంటుంది. అవును. అప్పుడు మీరు పతనమవ్వుతారు, "ఆ స్త్రీ వద్దకు ఎలా వెళ్ళాలి? ఆ పురుషుడు వద్దకు ఎలా వెళ్లాలి?" మీరు పని చేయడము నిలిపివేస్తే, అప్పుడు మీరు ఇంద్రియాలను తృప్తిపరుచు కోవాడానికి మళ్ళీ పని చేయాలి. అంతే. అదేవిధంగా, మీరు ఏ ఇంద్రియను తీసుకున్నా; మీరు దానిని ఆపలేరు, కానీ మీరు దానిని నిమగ్నం చేయవలసి ఉంటుంది. అది కృష్ణ చైతన్యము.