TE/Prabhupada 0181 - నేను దేవుడితో సన్నిహితముగా ఉంటాను



Evening Darsana -- August 9, 1976, Tehran

ప్రభుపాద: ఆధ్యాత్మిక శిక్షణ అంటే మొదట మీరు కొంచము విశ్వాసము కలిగివుండాలి అంటే "నేను దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉన్నాను." ఈ విశ్వాసము మీకు లభించకపోతే, ఆధ్యాత్మికం శిక్షణ అనే ప్రశ్న లేదు. మీరు కేవలం సంతృప్తి చెందితే, "దేవుడు గొప్పవాడు, తన ఇంటిలోనే తనను ఉండనివ్వండి, నేను కుడా నా ఇంటిలోనే ఉంటాను," ఇది ప్రేమ కాదు. మీరు దేవుణ్ణి మరి0త ఎక్కువగా తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగివు0డాలి. తరువాత దశలో దేవుడు గురించి ఎలా తెలుసుకోవాలి అని ఆoటే దేవుడి సేవలో ఎల్లప్పుడూ ఉండే వ్యక్తుల సాంగత్యము మీరు తీసుకోవాలి . వారికి ఏ ఇతర పని లేదు. మనము శిక్షణ ఇస్తున్నట్లుగా, వారు కేవలం దేవుని సేవ కోసం ఉద్దేశించినవారు. వారికి ఏ ఇతర సేవ లేదు. దేవుడు గురిoచి ప్రజలు ఎలా అర్ధము చేసుకుంటారో, వారు ఎలా ప్రయోజన0 పొ0దుతారు, వారు ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్నారు. మనము దేవుడిని నమ్మి ప్రపంచమంతటా అయిన జ్ఞానాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న అలాంటి వ్యక్తుల సాంగత్యము మనము తీసుకోవాలి. మీరు వారితో కలవాలి, వారి సాంగత్యము తీసుకోవాలి. మొదట, మీరు విశ్వాసము కలిగి ఉండాలి, "ఈ జీవితంలో నేను దేవుడిని పూర్తిగా అర్ధము చేసుకుంటాను తరువాత దేవుడు సేవలో ఎల్లప్పుడూ ఉండే వ్యక్తుల సాంగత్యము తీసుకుంటాను. అప్పుడు వారు చేస్తున్నట్లు మీరు చేయండి. అప్పుడు భౌతిక జీవితము మీద ఉన్న దురభిప్రాయం పూర్తిగా పోతుంది అప్పుడు మీకు ప్రేమ కలుగుతుoది. తరువాత మీకు రుచి ఉంటుంది. ఈ విధంగా మీరు దేవుడి మీద ప్రేమను కలిగి ఉంటారు.

అలీ: నాకు ఇప్పటికే విశ్వాసము ఉంది.

ప్రభుపాద: మీరు పెంచుకోవాలి. కేవలం ప్రాథమిక విశ్వాసము, చాలా మంచిది, కానీ ఆ విశ్వాసము మరింత పెరిగకపోతే, అప్పుడు ఎటువంటి పురోగతి లేదు.

పరివ్రాజకచార్య: విశ్వాసము కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రభుపాద: అవును, మీరు పురోగతి సాధించటానికి ప్రయత్నించకపోతే, క్రమక్రమంగా ముందుకు సాగక పోతే, అప్పుడు ప్రమాదము ఉన్నది. నీవు కలిగి ఉన్నా కొంచెం విశ్వాసము, అది తగ్గిపోతుంది.