TE/Prabhupada 0189 - భక్తుడు మూడు గుణాలచే ప్రభావితము కాడు

From Vanipedia
Jump to: navigation, search

భక్తుడు ముడు గుణలచే ప్రభావితము కాడు
- Prabhupāda 0189


Lecture on SB 6.1.46 -- San Diego, July 27, 1975

మీరు ప్రకృతి యొక్క చట్టమును మార్చలేరు. ఉనికికి కోసము పోరాటం: మనము ప్రకృతి చట్టాలను జయించడానికి ప్రయత్నిస్తున్నాము. అది సాధ్యం కాదు. Daivī hy eṣā guṇamayī mama māyā duratyayā (BG 7.14). ఇవి అధ్యయనాలకు సంబంధించి విషయములు. ఎందుకు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ కొంతవరకు సంతోషంగా దుఖముగా ఉన్నారు? ఈ లక్షణాల ప్రకారం. ఇక్కడ చెప్పబడింది, అందువలన "ఇక్కడ మనము ఈ జీవితంలో, జీవిత కాలములో రకాలు ఉన్నాయి, అదేవిధంగా, guṇa-vaicitryāt, గుణల రకాలు ద్వారా, guṇa-vaicitryāt, "tathāyatrānumīyate. Anyatra అంటే తదుపరి జీవితం లేదా తదుపరి లోకము లేదా తదుపరి ఏదైనా అని అర్థం. అంతా నియంత్రణలో ఉంది. Traiguṇya-viṣayā vedā nistraiguṇyo bhavārjuna. కృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా సూచించాడు, "మొత్తం భౌతిక ప్రపంచం ఈ మూడు గుణాలచే నియంత్రిoచబడుతుంది. guṇa-vaicitryāt. అందువల్ల nistraiguṇya అవండి ఎక్కడైతే ఈ మూడు గుణాలు పనిచేయవో. Nistraiguṇyo bhavārjuna. మీరు ఈ మూడు గుణాల ప్రభావమును ఎలా నిలిపివేయవచ్చు? ఇది కూడా భగవద్గీతలో వివరించబడింది:


māṁ ca vyabhicāriṇi
bhakti-yogena yaḥ sevate
sa guṇān samatītyaitān
brahma-bhūyāya kalpate
(BG 14.26)


మీరు నిరంతరాయంగా పవిత్రమైన భక్తియుక్త సేవలో నిమగ్నమైతే, ఏదైనా నిరంతరాయము లేకుండా, అప్పుడు మీరు ఎల్లప్పుడూ అద్యాత్మికముగా ఉంటారు. ఈ మూడు గుణాల ప్రభావము లేకుండా ఉంటారు. మన కృష్ణ చైతన్య ఉద్యమం మూడు గుణాల పైన భక్తుడిని ఉంచడానికి ఉంది. ఉదాహరణకు మహాసముద్రము, మీరు మహాసముద్రంలో పడిపోతే, ఆది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎవరైనా మీకు సహాయం చేస్తే , మిమల్ని సముద్రపు నీటి నుండి పైకి తీసి, సముద్రపు నీటి పైన ఒక అంగుళం ఎత్తులో మిమల్ని ఉంచితే, ప్రమాదం లేదు. మీ జీవితం రక్షించ బడుతుంది.


అది కావాలి, ఆ guṇa-vaicitryāt, మీరు ఈ రకములైన జీవితాల నుండి మిమ్మల్ని మీరు రక్షించు కోవాలని కోరుకుంటే, జన్మించడము, మరణం, వృద్ధాప్యం వ్యాధి, మరియు జీవితం యొక్క అనేక రకాలు అంగీకరించాలి ... వాకింగ్ చేస్తున్నప్పుడు మీరు చెప్పుతున్నారు కాలిఫోర్నియాలో చెట్లు ఉన్నాయి ; అవి ఐదు వేల సంవత్సరాల నుండి జీవించి వున్నాయి అని. అది కూడా జీవితం యొక్క మరొక రకం. ప్రజలు అనేక సంవత్సరాలు జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రకృతి యొక్క మార్గం ద్వారా, ఇక్కడ ఒక చెట్టు, ఐదు వేల సంవత్సరాలు ఉంది. అటువంటి రకమైన జీవన విధానం చాలా లాభదాయకంగా ఉంటుందా, అడవీలో ఐదు వేల సంవత్సరాలు నిలబడటము? ఈ భౌతిక ప్రపంచంలో ఏ రకమైన జీవితము మంచి కాదు, మీరు దేవాతగా లేదా చెట్టుగా లేదా ఈ విధముగా లేదా అవిధముగా. అది విద్య. అది విద్య. అందువల్ల ఏ రకమైన జీవితమైన ,ప్రతిఒక్కరు అర్ధం చేసుకోవాలి, దేవతగా లేదా కుక్కలాగా, ఇక్కడ జీవితం సమస్యాత్మకమైనది. దేవతలు కూడా, వారు చాలా ప్రమాదాలలో, అనేక సార్లు ఉంచబడుతారు, వారు దేవుడి దగ్గరకు వెళ్లుతారు. ఇక్కడ మీరు ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉంటారు. Padaṁ padaṁ yad vipadām (SB 10.14.58). ఈ భౌతిక ప్రపంచంలో ప్రమాదము లేకుండా చేయటము వృధా ప్రయత్నము. అది సాధ్యం కాదు. రకరకములైన శరీరములు, ప్రమాదాలు, విపత్తులు, ఒక దాని తరువాత ఒకటి మీరు ఎదురుకోవలసి ఉంటుంది ... ఉత్తమమైనది ఏమిటంటే ఈ బౌతిక, జీవితమును ఆపవలసి ఉంది. అది వేదముల నాగరికత. మొత్తం వేదముల నాగరికత ఈ ఆలోచన ఆధారంగా ఉన్నది. "ఈ అర్ధంలేని పుట్టడము, మరణము, వృద్ధాప్యము పునరావృతం ఆవ్వకుండా ఆపండి." అందువలన కృష్ణడు చెప్పుతారు janma-mṛtyu-jarā-vyādhi duḥkha-doṣānudarśanam (BG 13.9).ఇది జ్ఞానం. ఏ జ్ఞానం, ఈ సాంకేతిక పరిజ్ఞానం, ఈ జ్ఞానం? మీరు ఈ విషయాలను ఆపలేరు. అందువలన ప్రధాన కర్తవ్యము ఇది ఎలా ఆపడము. వారు బుద్ధిహీనులు కనుక వారు అనుకుంటున్నారు , "ఈ విషయాలను ఆపలేము. మనము జన్మ మరణలు పునరావృతమవుతు మనం కొనసాగుదాము, ప్రతి జీవితంలో మనుగడ కోసం మనం పోరాడుదాం. " ఇది బౌతిక నాగరికత, అజ్ఞానం, జ్ఞానంలేదు.


ఈ జ్ఞానము భాగావన్ శ్రీ కృష్ణుడి చేత ఇవ్వబడినది. ఇక్కడ పరిష్కారం ఉన్నది. janma karma ca me divyaṁ yo janati tattvataḥ, tyaktvā dehaṁ punar janma naiti (BG 4.9)." సమస్య పునర్ జన్మా, జననము పునరావృతం అవ్వడము, మీరు దానిని ఆపాలని అనుకుంటే, కృష్ణుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు ఆపగలరు. మీరు కృష్ణుడిని అర్థం చేసుకున్న వెంటనే ... కృష్ణుడిని అర్థం చేసుకోవడము అంటే మీరు కృష్ణుడిని గుడ్డిగా అంగీకరించినా కూడా అది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కృష్ణుడు తాను దేవాదిదేవుడు అని చెప్పాడు. మీరు ఆయనను అంగీకరించాలి. అంతే. కేవలం ఈ విశ్వాసము కలిగి ఉండండి, "కృష్ణుడు దేవాదిదేవుడు" అని. అది మీకు భక్తిలో ఎదగటానికి ఉపయోగ పడుతుంది. కానీ ఇది భౌతిక వ్యక్తికి చాలా కష్టము. అందువల్ల కృష్ణుడు చెప్తాడు bahūnāṁ janmanām ante: (BG 7.19) అనేక జన్మల ప్రయత్నము తరువాత, bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate, జ్ఞానవంతుడు, నిజంగా తెలివైనవాడు, అయిన కృష్ణుడికి ఆశ్రయము పొందుతాడు. లేకపోతే, na māṁ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāh: (BG 7.15) లేకపోతే అతడు ఒక దుష్టుడుగా ఉంటాడు పాపములలో చిక్కుకొనిఉంటాడు, మానవజాతిలో అతి తక్కువ స్థాయిలో వుంటాడు , అతని జ్ఞానం తీసివేయబడుతుంది. Na māṁ prapadyante అతను ఎప్పటికి కృష్ణుడికి ఆశ్రయము పొందడు