TE/Prabhupada 0198 - చెడు అలవాట్లను వదలి వేసి, పూసలపై హరే కృష్ణ మంత్రమును జపము చేయండి



Temple Press Conference -- August 5, 1971, London

మహిళా విలేఖరి: ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది అనుచరులు ఉన్నారు లేదా మీరు లెక్కించలేరా ...?

ప్రభుపాద: ఏ శుద్ధమైన విషయము కోసం అనుచరులు చాలా తక్కువగా ఉండవచ్చు, ఏ చెత్త విషయమునకు, అనుచరులు చాలా మంది ఉండవచ్చు.

స్త్రీ విలేఖరి: ఎoత మంది ... నేను దీక్ష తీసుకున్న అనుచరుల , వ్యక్తులను ఎవరైతే ...

ప్రభుపాద: మూడు వేలమంది మా వద్ద ఉన్నారు

మహిళ విలేఖరి: ఇది అన్ని విధములగా పెరుగుతోందా?

ప్రభుపాద: అవును, ఇది చాలా నెమ్మదిగా పెరుగుతోంది. ఎందుకంటే మాకు చాలా నియమములు ఉన్నాయి. ప్రజలు ఏ నియమమును ఇష్టపడరు.

స్త్రీ విలేఖరి: అవును. అనుచరులు ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు? అమెరికాలోనా?

ప్రభుపాద: అమెరికాలో, ఐరోపాలో కెనడాలో, జపాన్లో, ఆస్ట్రేలియాలో. భారతదేశములో మిలియన్ల ఉన్నారు, ఈ ఉద్యమమునకు మిలియన్లు ఉన్నారు. భారతదేశం కాకుండా, ఇతర దేశాల్లో తక్కువ పరిమాణంలో ఉన్నారు. కానీ భారతదేశంలో మిలియన్లు లక్షలు ఉన్నారు.

పురుష విలేఖరి: మీ ఉద్యమం దేవుణ్ణి తెలుసుకోవటానికి ఏకైక మార్గం అని మీరు అనుకుంటున్నారా?

ప్రభుపాద: అంటే ఏమిటి?

భక్తుడు: దేవుణ్ణి తెలుసుకోవడానికి ఈ ఉద్యమం ఏకైక మార్గం అని మీరు అనుకుంటున్నారా?

ప్రభుపాద: అవును.

పురుష విలేఖరి: మీకు ఆ హామీ ఎలా ఉంది?

ప్రభుపాద: ప్రామాణికుల నుండి, దేవుడి నుండి, కృష్ణుడు. కృష్ణుడు చెప్తాడు sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja (BG 18.66).

పురుష విలేఖరి: దేవుడు వేరొకరికి మరొకటి చెప్పాడని ఎవరో చెప్పితే, మీరు అతన్ని సమానంగా విశ్వసిస్తారా?

శ్యామసుoదర: మేము ఇతర మతపరమైన పద్ధతులను అంగీకరించడము లేదు అని చెప్పడము లేదు.

ప్రభుపాద: లేదు, మేము ఇతర పద్ధతులను నమ్ముతాము. ఉదాహరణకు మెట్లు ఉన్నాయి. మీరు చివరి అంతస్తుకి వెళ్లాలనుకుంటే, మీరు క్రమముగా వెళ్లుతారు వాటిలో కొందరికి యాభై మెట్లు ఉన్నాయి, కొందరికి వంద మెట్లు ఉన్నాయి, కానీ పూర్తి చేయడానికి 1,000 మెట్లు ఉన్నాయి.

పురుష విలేఖరి: మీరు వెయ్యి మెట్లు ఎక్కరా?

ప్రభుపాద: అవును.

స్త్రీ విలేఖరి: మాలో ఈ రోజు ఉదయం ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మీ అనుచరులుగా ఉండాలనుకుంటే మేము ఏమి ఇవ్వాల్సి ఉంటుంది లేదా వదలివేయ వలసి ఉంటుంది?

ప్రభుపాద: మొదటిది అక్రమ లైంగిక జీవితాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది.

స్త్రీ విలేఖరి: సెక్స్ లైఫ్ మొతాన్న లేదా ...?

ప్రభుపాద: హుహ్?

మహిళ విలేఖరి: అక్రమమైనది అంటే ఏమిటి?

ప్రభుపాద: అక్రమ లైంగికం ... వివాహం లేకుండా, ఏ సంబంధం లేకుండా, లైంగిక జీవితం, అక్రమ లైంగిక జీవితం.

స్త్రీ విలేఖరి: సెక్స్ వివాహములో అనుమతిoచబడినది, కానీ వెలుపల కాదు.

ప్రభుపాద: ఆది జంతు లైంగిక జీవితం. జంతువులు వలె, వాటికి ఎటువంటి సంబంధం లేదు లైంగిక జీవితాన్ని కలిగి ఉంటాయి. కానీ మానవ సమాజంలో పరిమితి ఉంది. ప్రతి దేశంలో, ప్రతి ధర్మములో వివాహ పద్ధతి ఉంది. వివాహం లేకుండా, సెక్స్ జీవితం అక్రమ లైంగిక జీవితం.

స్త్రీ విలేఖరి: కానీ సెక్స్ వివాహంలో అనుమతిoచబడినది.

ప్రభుపాద: అవును, అది ...

మహిళా విలేఖరి: ఇంకా ఏమి వదిలివేయ వలసి ఉంటుంది?

ప్రభుపాద: అన్ని రకాల మత్తు పదార్ధాలను వదిలివేయలి.

స్త్రీ విలేఖరి: ఈ మత్తు మందులు మరియు మద్యపానియములనా?

ప్రభుపాద: ఏ రకమైన ఔషధము మత్తును ఇస్తుందో.

శ్యామసుందర: టీ కూడా ...

ప్రభుపాద: టీ కూడా, సిగరెట్. అవి కూడా మత్తుపదార్థాలు.

స్త్రీ విలేఖరి: అందుచే మద్యం, గంజాయి, టీ. ఇంకా ఏమైనా?

ప్రభుపాద: అవును. జంతువు మాంసమును వదులుకోవాలి. అన్ని రకాల జంతువుల మాంసమును. మాంసం, గుడ్లు, చేపలు. జూదం కుడా వదలి వేయాలి

స్త్రీ విలేఖరి: వ్యక్తులు కుటుంబమును కుడా విడిచిపెట్టాలా? నేను ప్రతి ఒక్కరు ఆలయంలో నివసిస్తున్నారు ఆనుకుంటున్నాను, వారు కాదా?

ప్రభుపాద: , అవును. ఈ పాపములను విడిచిపెట్టకపోతే, అతనికి దీక్షను ఇవ్వలేము

స్త్రీ విలేఖరి: కుటుంబాన్ని కూడా వ్యక్తులు వదలివేయలా

ప్రభుపాద: కుటుంబమా?

స్త్రీ విలేఖరి: ఇక్కడ ఉండుటకు., అవును.

ప్రభుపాద: అవును, కుటుంబం. మేము కుటుంబము గురించి ఆందోళన చెందడములేదు, మేము వ్యక్తుల గురించి ఆలోచిస్తాము. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఎవరైనా దీక్ష తీసుకోవాలని కోరుకుంటే, అతడు ఈ పాపములను విడిచిపెట్టాలి.

స్త్రీ విలేఖరి: మీరు కుటుంబం కుడా వదలి వేయాలా?. కాని కుటుంబము గురించి ...

శ్యామసుందర: లేదు, లేదు, మీరు కుటుంబాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.

స్త్రీ విలేఖరి: కానీ నా ఉద్దేశ్యం నేను దీక్ష తీసుకోవాలనుకుంటే నేను ఇక్కడకు వచ్చి నివసించాలా?.

శ్యామసుందర: అవసరము లేదు

ప్రభుపాద: తప్పనిసరి కాదు.

స్త్రీ విలేఖరి: , నేను ఇంట్లోనే ఉండవచ్చా?

ప్రభుపాద: , అవును, ఉండ వచ్చు.

స్త్రీ విలేఖరి: ఏమైనప్పటికీ, ఉద్యోగము సంగతి ఏమిటి? ఒక వ్యక్తి ఉద్యోగాన్ని వదులుకోవాలా?

ప్రభుపాద: మీరు ఈ చెడు అలవాట్లను విడిచిపెట్టి, ఈ పూసలతో, హరే కృష్ణ మంత్రాన్ని జపము చేయ వలసి ఉంటుంది. అంతే.

స్త్రీ విలేఖరి: నేను ఆర్థిక మద్దతు ఇవ్వాల్సి ఉంటుందా?

ప్రభుపాద: లేదు, మీ ఇష్టము మీరు ఇస్తే, అది సరియైనది. లేకపోతే, మేము పట్టించుకోవడం లేదు.

స్త్రీ విలేఖరి: క్షమించాలి, నాకు అర్థం కాలేదు.

ప్రభుపాద: మేము ఎవరి ఆర్ధిక సహాయము మీద ఆధారపడ లేదు. మేము దేవుడు లేదా కృష్ణుడిపై ఆధారపడతాము.

స్త్రీ విలేఖరి: నేను ఏమైనా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదా.

ప్రభుపాద: లేదు.

స్త్రీ విలేఖరి: నకిలీ గురువు నుండి నిజమైన గురువును గుర్తించే ముఖ్య విషయాలలో ఇది ఒకటా?

ప్రభుపాద: అవును. వాస్తవమైన గురువు ఒక వ్యాపారవేత్త కాదు.