TE/Prabhupada 0204 - నాకు గురు కృప వుంది. ఇది వాణి



Morning Walk -- July 21, 1975, San Francisco


ప్రభుపాద: మీరు ఈ రెండింటితో కూడి వుండాలి. Guru- -kṛṣṇa kṛpāya pāya bhakti-latā-bīja (CC Madhya 19.151). guru's kṛpā and kṛṣṇa's kṛpā, ఈ రెండు కలసి వుండాలి. అప్పుడు మీరు పొందుతారు.

జయ అద్వైత: ఆ గురు-కృపని పొందటానికి మనము ఎంతో ఆసక్తిగా ఉన్నాము.

ప్రభుపాద: ఎవరు?

జయ అద్వైత: మనము, మేమందరమూ.

ప్రభుపాద: అవును. Yasya prasādād bhagavat-prasādaḥ. మీకు గురు కృప వుంటే, అప్పుడు మీరు కృష్ణుడిని అప్రయత్న పూర్వకముగానే పొందుతారు.

నారాయణ: శ్రీల ప్రభుపాదా, గురు-కృప ఆధ్యాత్మిక గురువుని సంతోష పరచటము ద్వారా కలుగుతుందా?

ప్రభుపాద: లేకపోతే ఎలా? నారాయణ: క్షమించండి. ప్రభుపాద: లేకపోతే ఎలా వస్తుంది?

నారాయణ: మిమ్ముల్ని చూడడానికి లేదా మాట్లాడటానికి అవకాశం లేని శిష్యులు ...

ప్రభుపాద: అయిన మాట్లాడున్నది, వరం వాపు. మీరు ఆయన శరీరాన్ని చూడకపోయినా, మీరు అయిన మాటలు తీసుకోవాలి, వాణి.

నారాయణ: కానీ శ్రీల ప్రభుపాద, వారు మీకు ఆనందము కలిగించినట్లు వారికి ఎలా తెలుసు?

ప్రభుపాద: మీరు నిజంగా గురువు మాటలు అనుసరించినట్లయితే, అయిన ఆనందముగా ఉంటారు. మీరు అనుసరించకపోతే, అయిన ఎలా ఆనంద పడతారు?

సుధామా: అంతే కాదు, కానీ మీ దయ ప్రతిచోటా వ్యాపించింది, మనము దానిని అనుకూలముగా వాడుకోగలిగితే, మీరు ఒకసారి మాకు చెప్పారు, అప్పుడు మనము ఫలితము యొక్క అనుభూతి పొందగలము.

ప్రభుపాద: అవును.

జయ అద్వైత: గురువు చెప్పినదానిపై మనము విశ్వాసం కలిగి ఉంటే, అప్పుడు సహజముగా ఆపని మనము చేస్తాను.

ప్రభుపాద: అవును. నా గురు మహరాజు 1936 లో నిర్యాణం చెందారు, నేను 1965 లో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాను, ముప్పై సంవత్సరాల తరువాత. అప్పుడు? నేను గురువు యొక్క దయను పొందగలుగుతున్నాను. ఇది వాణి. గురువు భౌతికముగా కనిపించక పోయినా, మీరు గనుక ఆ వాణిని అనుసరించినట్లయితే అప్పుడు మీకు సహాయం లభిస్తుంది.

సుదామా: శిష్యుడు గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించినంత కాలం గురువుతో వేరు పడే ప్రశ్న ఉందా?

ప్రభుపాద: లేదు. Cakhu-dān dilo jei... ఏమిటది? తరువాతది?

సుధామ: Cakhu-dān dilo jei, janme janme prabhu sei.

ప్రభుపాద: Janme janme prabhu sei. వేరు ఎక్కడ ఉంది? ఎవరు నీ కళ్ళు తెరిపించారు?, అయిన జన్మ జన్మలకు నీ ప్రభువు.

పరమహంస: మీ ఆధ్యాత్మిక గురువు నుండి తీవ్రముగా దూరమవ్వటం మీరు ఎన్నడూ అనుభవించలేదా?

ప్రభుపాద: మీరు అది ప్రశ్నించవలసిన అవసరం లేదు.